రామారావు నుంచి ఫస్ట్‌ సింగిల్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Ramarao On Duty First Song To Be Out On This Date | Sakshi
Sakshi News home page

Ramarao On Duty: రొమాంటిక్‌ రామారావు.. ఫస్ట్‌ సింగిల్‌ అప్పుడే

Published Fri, Apr 8 2022 8:20 AM | Last Updated on Fri, Apr 8 2022 8:24 AM

Ramarao On Duty First Song To Be Out On This Date - Sakshi

రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా జూన్‌ 17న విడుదలవుతోంది. ఈ చిత్రం నుంచి ‘బుల్‌ బుల్‌ తరంగ్‌..’ అంటూ సాగే తొలి పాటను ఈ నెల 10న రిలీజ్‌ చేస్తున్నారు.

‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. రవితేజ, రజీషా విజయన్‌లపై చిత్రీకరించిన ‘బుల్‌ బుల్‌ తరంగ్‌..’ పాట అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement