
రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇందులో రజీషా, దివ్యాంశ హీరోయిన్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించనున్న ఈ మూవీతో వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తున్నాడు. నాజర్, తనికెళ్ల భరణి, పవిత్రాల ఓకేశ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా జూన్ 17న విడుదలవుతున్నట్లు గతంలో ప్రకటించారు.
అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. మంచి అవుట్‌పుట్ రావాలంటే ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. రామారావు ఆన్ డ్యూటీ జూన్ 17న రిలీజ్ కావడం లేదు. త్వరలో ఓ కొత్త తేదీని ప్రకటిస్తాం అని వెల్లడించింది చిత్రయూనిట్.
Okk!!! #RamaRaoOnDuty Postponed pic.twitter.com/nqBOpKhmQN
— RavitejaFlicks On Duty (@RaviTejaFlicks) May 26, 2022
చదవండి: Ramakrishna Reddy: ప్రముఖ నిర్మాత కన్నుమూత
కిరాక్ ఆర్పీ నిశ్చితార్థం, ఫొటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment