వైవా హర్ష, దివ్య శ్రీపాద జంటగా నటించిన సుందరం మాస్టర్. ఈ చిత్రానికి కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజ నిర్మించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. న్యూ ఇయర్ సందర్భంగా వచ్చేనెల 16న థియేటర్లలో సందడి చేయనుందని రవితేజ్ ట్వీట్ చేశారు.
రిలీజ్ తేదీని ప్రకటిస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. 'సుందరం మాస్టర్ అటెండెన్స్ కోసం రెడీగా ఉన్నారు.. ఫిబ్రవరి 16న థియేటర్లలో సిద్ధంగా ఉండండి' అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో వైవా హర్ష కామెడీ సినీ ప్రేక్షకులను నవ్వులు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల జీవన విధానం నేపథ్యంలో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సుందరం మాస్టర్‌గా హర్ష అభిమానులను అలరించనున్నారు.
Our #SundaramMaster is ready to take your attendance!
Stooodents get reddie two geev attendance et thiyatars frum Feb 16th!#SM @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @itswetha14 @NambuShalini @RTTeamWorks @GOALDENMEDIA pic.twitter.com/SHUxokoOQ7— Ravi Teja (@RaviTeja_offl) January 1, 2024
Comments
Please login to add a commentAdd a comment