Rama Rao On Duty: Art Director Sahi Suresh About Raviteja - Sakshi
Sakshi News home page

Raviteja-Sahi Suresh: రవితేజకు అది చాలా నచ్చింది: ఆర్ట్‌ డైరెక్టర్‌

Published Wed, Jul 20 2022 8:59 AM | Last Updated on Wed, Jul 20 2022 12:55 PM

Art Director Sahi Suresh About Raviteja Rama Rao On Duty - Sakshi

Art Director Sahi Suresh About Raviteja Rama Rao On Duty: ‘‘శక్తి’ సినిమాకి ఆర్ట్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ సాయి గారితో పని చేశాను. అప్పుడు నా ప్రతిభని గుర్తించిన అశ్వినీదత్‌ గారు ‘సారొచ్చారు’కి ఆర్ట్‌ డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ రోజు నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. దాదాపు 40 చిత్రాలకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా చేశాను’’ అని సాహి సురేష్‌ అన్నారు. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా, దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. 

ఈ చిత్రానికి ఆర్ట్‌ డైరెక్టర్‌గా చేసిన సాహి సురేష్‌ మాట్లాడుతూ– ‘‘రామారావు ఆన్‌ డ్యూటీ’ 1995లో జరిగే రూరల్‌ కథ. 95 నేపథ్యాన్ని మొత్తం రీ క్రియేట్‌ చేశాం. రవితేజగారికి ఎమ్మార్వో ఆఫీస్‌ సెట్‌ చాలా నచ్చింది. శరత్‌ కొత్త దర్శకుడైనప్పటికీ చాలా క్లారిటీ ఉంది. ‘కంచె, ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు, అ’ చిత్రాలు ఆర్ట్‌ పరంగా నాకు చాలా తృప్తినిచ్చాయి. ప్రస్తుతం ‘మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో పాటు నితిన్‌–వక్కంతం వంశీ సినిమాలు చేస్తున్నాను’’ అని తెలిపారు.

చదవండి: నా మైండ్‌ సెట్‌ చాలా మారింది: నాగ చైతన్య
కరీనా కపూర్‌ మళ్లీ ప్రెగ్నెంట్ !.. అతను ఇప్పటికే చాలా చేశాడని పోస్ట్‌
డ్రగ్స్‌తో పట్టుబడిన మోడల్‌.. గర్భవతిగా నమ్మిస్తూ..

27 ఏళ్ల తర్వాత పూర్తి పాత్రల్లో షారుక్ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ !..
ఆ వార్త నన్ను కలిచివేసింది: సుష్మితా సేన్‌ తమ్ముడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement