రవితేజ హీరోగా, మీనాక్షి చైదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించిన చిత్రం ఖిలాడి. ‘ప్లే స్మార్ట్’ అన్నది ట్యాగ్ లైన్. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌తో కలసి హవీష్ ప్రొడక్షన్‌పై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందనను అందుకుంది.
తాజాగా ఖిలాడి ఓటీటీ బాట పట్టింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా వెల్లడించింది. 'ఈ ఆటలో ఒక్కడే కింగ్, ఇంకా కొద్ది రోజులే వెయిటింగ్, ఫుల్ కిక్‌తో మార్చి 11న హాట్‌స్టార్‌లో మాస్ మహారాజ రవితేజ సినిమా ఖిలాడీ రాబోతోంది' అని ట్వీట్ ద్వారా ప్రకటించింది. దీంతో థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఖిలాడి చూసేయొచ్చని సంబరపడుతున్నారు.
Ee aata lo okkade king! Inka koddi rojule waiting!! Full kick toh March 11th na @DisneyPlusHS lo MassMaharaja @RaviTeja_offl's Khiladi is coming!! Catch him if you can #KhiladiOnHotstar #Raviteja #disneyplushotstar #MassMaharaja pic.twitter.com/FabOPHrHj3
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 4, 2022
Comments
Please login to add a commentAdd a comment