
Chiranjeevi Remuneration For Latest Commercial Ad: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఏ మాత్రం తగ్గేదేలా అంటున్నాడు. ఇప్పటికే ఆయన వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘ఆచార్య’ మూవీ విడుదలకు రెడీ అవుతుండగా.. భోళా శంకర్, గాడ్ ఫాదర్ సిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటీకి మరో పక్క కమర్షియల్ యాడ్స్‌లో సైతం నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ఓ కమర్షియల్ యాడ్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రకటన వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ యాడ్‌కు చిరు తీసుకున్న పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది.
చదవండి: ‘గని’ టీంకు తెలంగాణ సర్కార్ షాక్, తగ్గించిన టికెట్ రేట్స్
ఈ యాడ్‌లో చిరుతో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్, ఖుష్బు సుందర్‌లు నటించారు. ఇందులో నటించిన వారంత పెద్ద స్టార్స్ కావడంతో ఈ యాడ్‌కు వారు తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఆసక్తి నెలకొంది. దీంతో వారి పారితొషికం గురించి ఆరా తీయగా చిరంజీవి భారీగా అందుకున్నాడని తెలుస్తోంది. ఈ యాడ్‌కుగాను చిరు సుమారుగా రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక అనసూయ, ఖుష్బులకు కూడా భారీగానే ముట్టజెప్పారట. అనసూయ ఇటూ యాంకర్‌గా, అటూ సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ ఎంతో పాపులారిటిని సంపాదించుకుంది. ఇక ఖుష్బు కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వారి స్టార్‌డమ్ బట్టి రెమ్మునరేషన్ ఇచ్చారట.