Kushbu
-
‘నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. అది డీఎంకే డీఎన్ఏ’
చెన్నై: మహిళలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను అధికార డీఎంకే పార్టీ వక్రీకరిస్తోందని బీజేపీ నేత కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించే పథకంపై కుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘మహిళలకు డీఎంకే ప్రభుత్వం రూ.1000 భిక్ష ఇస్తే.. వారికి ఓటు వేస్తారా?. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిస్తే.. ప్రజలు ఇలా ప్రభుత్వం ఇచ్చే రూ.1000 భిక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆమె సోమవారం బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అన్నారు. కుష్బూ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను కించపరిచేలా ఉన్నాయని డీఎంపీ పార్టీ మహిళా విభాగం తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపింది. తాను చేసిన వ్యాఖ్యలను డీఎంకే వక్రీకరించిందని కుష్బూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ‘మహిళలకు రూ. 1000 ఇచ్చే బదులు ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్యను తగ్గించాలి.అలా చేయటం వల్ల మహిళలకు వేల రూపాయలు పొదుపు చేసినట్లు అవుతుంది.వారి కుటుంబాలకు సాయం చేసినట్లు అవుతుంది. వాళ్లు సంతోషంగా తల ఎత్తుకొని జీవిస్తారు. నేను మాట్లాడిన వ్యాఖ్యల వెనక ఉన్న అర్థం ఇది. నేను మహిళలను అవమానించినట్లు నా మాటలను తప్పుదోవ పట్టించారు. మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయటం డీఎంకే డీఎన్ఏ.. కానీ నాది కాదు’ అని కుష్బూ సుందర్ వివరణ ఇచ్చారు. ‘నేను ఎప్పుడు తప్పు చేయను. తప్పు చేసి పారిపోయే వ్యక్తిని కాదు. ధైర్యంగా మాట్లాడటం నేర్పిన వ్యక్తి కలైంజ్ఞర్ కరుణానిధి. మీరు( డీఎంకే) దానిని మర్చిపోయి ఉండవచ్చు. కానీ నేను మర్చి పోలేదు’ అని కుష్బూ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన కుష్బూను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
కుష్బు ఆక్రోశం
సాక్షి, చైన్నె: బీజేపీ మహిళా నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బులో ఆక్రోశం రగిలింది. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో డీఎంకే నాయకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఎంతటి వారైనా సరే వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. డీఎంకే అధికార ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి ఓ సభలో కుష్బుకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీనిపై కుష్బు తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అనాగరికంగా మహిళలను ఉద్దేశించి ఎవరైనా మాట్లాడితే, అది వారి తల్లిని కించపరిచినట్టే అని మండిపడ్డారు. మహిళలకు వ్యతిరేకంగా ఒక నాయకుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తుంటే, సీఎం మౌనం వహించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తన ఇంటి మీద రాళ్లు విసిరినా భయపడను అని హెచ్చరించారు. ఇప్పటికే తన ఇంటి మీద గతంలో దాడి చేశారని గుర్తు చేస్తూ, ఇక ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ఎదురు దాడికి తాను సిద్ధం అని హెచ్చరికలు చేశారు. తాను పార్టీ రీత్యా చూడడం లేదని, మహిళలను కించ పరిచే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా అది చట్టపరంగా నేరం అని స్పష్టం చేశారు. మహిళలను కించపరిచే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తన కోసం మాట్లాడడం లేదని, కించపరిచే వారిపై ఎదురు దాడికి ప్రతి మహిళ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో తాను ముందు ఉంటానని స్పష్టం చేశారు. గొడవకై నా సరే, ఎదురు దాడికై నా సరే తనకు ధైర్యం ఉందన్నారు. తాను ప్రతిభను నమ్ముకుని తమిళనాడుకు వచ్చానని, తనను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. మహిళలను కించ పరిచే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే తాను చూస్తూ ఊరుకోబోనని వ్యాఖ్యలు చేశారు. వేదికలు ఎక్కి మహిళలను కించ పరిచే అధికారం డీఎంకే వాళ్లకు ఎవరు ఇచ్చారో అని ప్రశ్నిస్తూ, చట్ట రీత్య వారిపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తనలోని ఆక్రోశాన్ని వెళ్లగక్కే విధంగా మరిన్ని వ్యాఖ్యలతో కుష్బు సమావేశంలో ఆవేశంతో స్పందించడం గమనార్హం. శివాజీ కృష్ణమూర్తికి ఉద్వాసన కుష్బుకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తిని డీఎంకే నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆదివారం రాత్రి విడుదల చేశారు. పార్టీకి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించిన శివాజీ కృష్ణ్ణమూర్తిని పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, కుష్బు తీవ్ర ఉద్వేగం, ఆక్రోశంతో స్పందించిన కొన్ని గంటల్లో దురైమురుగన్ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఈ చర్యలను కుష్బు ఆహ్వానించారు. అయితే, శివాజీ కృష్ణమూర్తిపై తాను చట్టపరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. -
నటి ఖుష్భూ కూతుర్ని చూశారా? గ్లామర్ షోతో రచ్చరచ్చ
ప్రముఖ నటి ఖుష్భూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తుంది. సినిమాల్లోనే బిజీ హీరోయిన్గా ఉన్న సమయంలోనే డైరెక్టర్ సుందర్‌తో ప్రేమలో పడిన ఖుష్భూ 1991లో అతడిని పెళ్లాడింది. వీరికి అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లండన్‌లో చదువుకుంటున్న అవంతిక ఓ వైపు చదువుకుంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో తరచూ తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా లండన్‌లోని ఓ కాఫీ షాపులో పొట్టి బట్టల్లో గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ లెవల్లో గ్లామర్ షో చేస్తుందంటే.. త్వరలోనే సినిమాల్లోకి వచ్చేస్తుందేమో అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇలాంటి పొట్టి బట్టలు నీకు అవసరమా? అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by avantika (@avantikasundar) View this post on Instagram A post shared by avantika (@avantikasundar) View this post on Instagram A post shared by avantika (@avantikasundar) -
కూతుళ్లపై అలాంటి కామెంట్స్.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నటి ఖుష్బూ
సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ సుందర్. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదం, విమర్శలతో వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా తన పిల్లలను ట్రోల్ చేసిన వారిని తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా తన కూతుళ్లను టార్గెట్ చేసిన ఓ నెటిజన్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇద్దరు కూతుళ్లు అవంతిక, ఆనందిక ఫొటోను రీసెంట్గా తన ట్విటర్లో ఖాతా ప్రోఫైల్ పిక్‌గా షేర్ చేశారు ఖుష్బూ. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ఈ ఫొటోపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వారు తమ ముక్కుకు సర్జరీ చేసుకున్నారు!’ అని కామెంట్ చేశాడు. దీనిపై ఆమె స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ‘20, 22 ఏళ్ల వయసున్న పిల్లలకు కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? చిన్న పిల్లల మీద ట్రోలింగ్ చేయడం సిగ్గుచేటు. కనీసం పిల్లలనైనా వదిలేయండి’ అంటూ ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా ఖుష్బు కూతుళ్లపై ట్రోలింగ్ జరగడం ఇది తొలి సారి కాదు. చదవండి: వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది? గతంలోనూ వారి బరువు, శరీరాకృతిపై కొందరు కామెంట్స్ చేశారు. అలా కూతుళ్లపై ట్రోలింగ్ జరిగిన ప్రతిసారి ఖుష్బు వారికి కౌంటరి ఇస్తూనే వచ్చారు. తాజాగా మరోసారి తన పిల్లల గురించి అసత్య ప్రచారం చేయడంతో ఖుష్బూ ఘాటుగా స్పందించారు. కాగా హీరోయిన్గా కెరీర్ పీక్‌లో ఉండగానే దర్శకుడు సుందర్‌ను ఖుష్బూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి అవంతిక, ఆనందిక అనే ఇద్దరు కూమార్తెలు జన్మించారు. Why would a 20 and a 22 yr old go under a knife?? It’s a shame when children are part of trolling. At least spare the kids. https://t.co/wJ3NSME5aN — KhushbuSundar (@khushsundar) February 13, 2023 #NewProfilePic ❤️ pic.twitter.com/PVAjL5LeBC — KhushbuSundar (@khushsundar) February 13, 2023 -
షాక్‌లో తమిళ ప్రేక్షకులు.. ‘వారిసు నుంచి ఆమెను తొలగించారా?’
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు(తెలుగులో వారసుడు). జనవరి 11న విడుదల కావాల్సిన ఈ మూవీలో తెలుగులో వాయిదా పడిన సంగతి తెలిసిందే. థియేటర్ల ఇష్యూ కారణంగా ఇక్కడ వాయిదా పడగా.. తమిళంలో మాత్రం అదే తేదీకి విడుదలైంది. బుధవారం ఈ చిత్రం తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచి వారిసు మంచి హిట్‌టాక్‌ను సొంతంగా చేసుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంది. చదవండి: బాలకృష్ణ వీర సింహారెడ్డి ఓటీటీ పార్ట్నర్ ఇదే? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..! అయితే ఈ సినిమాలో ఆడియన్స్‌కు ఓ ఊహించని ఎలిమెంట్ ఒకటి షాకించిందట. దీంతో ఈ విషయంలో ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రముఖ నటి ఖుష్భు సుందర్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు షూటింగ్ స్పాట్లో మూవీ టీంతో కలిసి దిగిన ఫొటోలను ఖుష్భు తన సోషల్ మీడియలో షేర్ చేసింది కూడా. సెట్లో విజయ్, రష్మిక, ఖష్బు స్టిల్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే సినిమాలో మాత్రం ఖుష్బు ఎక్కడ కనిపించలేదట. దీంతో సినిమాలో ఆమె పాత్ర ఎక్కడ కనిపించకపోవడం తమిళ ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. చదవండి: రాహుల్‌కు కంగ్రాట్స్ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్ రూమర్స్ సినిమా చూసి బయటకు వచ్చాక ఖుష్బు సినిమాలో ఎక్కడ కనిపించలేదని, ఆమె సన్నివేశాలను ఎందుకు తొలగించారు? అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు మూవీ టీంని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ నుంచి వైరల్ అయిన ఆమె స్టిల్స్, వారిసు టీంతో కలిసి ఆమె షేర్ చేసిన పలు పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు. దీంతో ఖుష్బు సీన్లను ఎందుకు తొలగించారన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. వారిసు నుంచి ఆమెను తొలగించారా? ఎందుకు ఆమె సీన్లను తొలగించాల్సి వచ్చింది! అసలేం జరిగిందనేది ఆసక్తిని సంతరించుకుంది. అయితే వీటన్నింటికి సమాధానం రావాలంటే మూవీ టీం నుంచి క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాలి. Extremely happy to be part of this family. ( Was waiting for the official news from the production before me saying anything about it. ) @actorvijay @directorvamshi #DilRaju #Varisu #Varisudu #Vijay66 pic.twitter.com/BcfuWgFTDq — KhushbuSundar (@khushsundar) October 26, 2022 🤔 khushbu character is not in #Varisu Is they deleted the scene or changed the mother character to Jayasudha @directorvamshi pic.twitter.com/mI0I4GPr6J — 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 (@NameIsShreyash) January 11, 2023 Khushboo didi enga daa kanum???#Varisu#VarisuBlockbuster — Nambi (@NambiThalapathy) January 11, 2023 Hi Friends. Enaku oru doubt.#Varisu movie la Khushboo erukanganu sonnagale. 🤔🤔🤔#BlockBusterVarisu #VarisuPongalWinner@7screenstudio @Harish_NS149 @Karthikravivarm — Joseph Jeeva (@jnajeeva) January 11, 2023 Illa enaku puriyala enaku mattum varisula Khushboo kanuku theriyalai ya illa yella rukkuma ? #Varisu — pathukalam (@lavanku11) January 11, 2023 -
సుక్కు-చిరు కమర్షియల్ యాడ్, మెగాస్టార్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Chiranjeevi Remuneration For Latest Commercial Ad: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఏ మాత్రం తగ్గేదేలా అంటున్నాడు. ఇప్పటికే ఆయన వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘ఆచార్య’ మూవీ విడుదలకు రెడీ అవుతుండగా.. భోళా శంకర్, గాడ్ ఫాదర్ సిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటీకి మరో పక్క కమర్షియల్ యాడ్స్‌లో సైతం నటిస్తున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా ఓ కమర్షియల్ యాడ్ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రకటన వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ యాడ్‌కు చిరు తీసుకున్న పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: ‘గని’ టీంకు తెలంగాణ సర్కార్ షాక్, తగ్గించిన టికెట్ రేట్స్ ఈ యాడ్‌లో చిరుతో పాటు యాంకర్ అనసూయ భరద్వాజ్, ఖుష్బు సుందర్‌లు నటించారు. ఇందులో నటించిన వారంత పెద్ద స్టార్స్ కావడంతో ఈ యాడ్‌కు వారు తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఆసక్తి నెలకొంది. దీంతో వారి పారితొషికం గురించి ఆరా తీయగా చిరంజీవి భారీగా అందుకున్నాడని తెలుస్తోంది. ఈ యాడ్కుగాను చిరు సుమారుగా రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక అనసూయ, ఖుష్బులకు కూడా భారీగానే ముట్టజెప్పారట. అనసూయ ఇటూ యాంకర్‌గా, అటూ సినిమాల్లో కీ రోల్స్ చేస్తూ ఎంతో పాపులారిటిని సంపాదించుకుంది. ఇక ఖుష్బు కూడా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అనే విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వారి స్టార్డమ్ బట్టి రెమ్మునరేషన్ ఇచ్చారట. -
హ్యాపీ బర్త్‌డే చెప్పిన ఖుష్భు, నవ్విన బిగ్‌బాస్ బ్యూటీ
ఆమె నమ్మిందే చేస్తుందంటూ చీర ఫొటో షేర్ చేసిన జెనిలియా ‘శివగామి’కి హ్యాపీ బర్త్‌డే చెప్పిన ఖుష్భు బ్లాక్ అండ్ వైట్‌లో ఇలియానా, ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలా.. ఇంకా ఎటిఎమ్కు వెళుతున్నారా అంటూ వీడియో షేర్ చేసిన శ్రీముఖి View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by S (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Sushma kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by Meera Chopra (@meerachopra) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by mon (@imouniroy) -
ఘోర ఓటమి: ఖుష్బూ, షర్మిష్ట ఫైర్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దేశ రాజధాని ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ.. కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ భారీ ఓటమిపై కాంగ్రెస్ మహిళా నాయకులు షర్మిష్టా ముఖర్జీ, ఖుష్బూ సుందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి .. నష్ట నివారణ చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఈ మేరకు... ‘‘ ఢిల్లీలో మరోసారి మనం నాశనం అయిపోయాం. ఆత్మశోధన చేసుకున్నది చాలు. ఇది కార్యాచరణ మొదలుపెట్టాల్సిన సమయం. ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడం చాలా ఆలస్యమైంది. ఒక వ్యూహం లేదు. రాష్ట్ర స్థాయిలో సమన్వయం లేదు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారు లేరు. మూలాలే సరిగ్గా లేవు. ఈ వ్యవస్థలో భాగమైన నేను కూడా ఈ వైఫల్యానికి నా వంతు బాధ్యత వహిస్తా’’అని షర్మిష్ట ట్విటర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: థాంక్యూ ఢిల్లీ.. షాక్ తగిలిందా: ప్రకాశ్ రాజ్ అదే విధంగా ఖుష్బూ కూడా పార్టీ కార్యకర్తల తీరుపై విమర్శలు గుప్పించారు. ‘‘ఢిల్లీలో ఏదో అద్భుతం జరుగుతుందని ఊహించలేదు. మరోసారి ఘోరంగా విఫలమయ్యాం. మనం అసలు సరిగ్గా పనిచేస్తున్నామా? మనం చేసేది సరైందేనా? అసలు సరైన దారిలోనే ఉన్నామా? వీటన్నింటికీ.. ‘నో’ అనే కదా సమాధానం. కనీసం ఇప్పటి నుంచైనా పనిచేయడం మొదలుపెట్టాలి. క్షేత్రస్థాయిలో, మధ్య స్థాయిలో, ఉన్నత స్థాయిలో పరిస్థితులను చక్కబెట్టాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా మంగళవారం వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 స్థానాల్లో ఆప్ 62 సీట్లు గెలుపొందగా.. బీజేపీ 8 స్థానాలను కైవసం చేసుకుంది. ఇది ఢిల్లీ ప్రజల విజయం : కేజ్రీవాల్ We r again decimated in Delhi.Enuf of introspection, time 4 action now. Inordinate delay in decision making at the top, lack of strategy & unity at state level, demotivated workers, no grassroots connect-all r factors.Being part of d system, I too take my share of responsibility — Sharmistha Mukherjee (@Sharmistha_GK) February 11, 2020 Wasnt expecting magic in Delhi for #Congress Decimated yet again. Are we doing enough? Are we doing it right? Are we on the right track? NO is the big answer. We need to start working now. Its now or never. Ground level,middle level n top level. Things need to be set right. — KhushbuSundar ❤️ (@khushsundar) February 11, 2020 -
11 తర్వాత మహిళలకు మంచి రోజులే
ఆదిలాబాద్‌అర్బన్: ఆదిలాబాద్‌లోని పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మేజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఖుష్బూ పిలుపునిచ్చారు. ఈ నెల 11 తర్వాత అధికారంలోకి కాంగ్రెసే వస్తుందని, ఇక మహిళలకు అన్ని మంచి రోజులేనని చెప్పారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజా గాయకుడు గద్దర్, కాంగ్రెస్ అభ్యర్థి సుజాత, నాయకులతో కలిసి ఆదిలాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి గాంధీపార్కు, కలెక్టర్ చౌక్ మీదుగా తెలంగాణ చౌక్, డైట్ మైదానం వరకు రోడ్‌షో సాగింది. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్‌లో ఖుష్బూ మాట్లాడారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ గెలిస్తే మహిళలకు రక్షణ ఉంటుందని, పది స్థానాల్లో గెలిపిస్తే రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ హయంలోనే సెల్ప్ హెల్ప్ గ్రూపులు వచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహిళా గ్రూపులకు రూ.10 లక్షలు వడ్డీ లేకుండా ఇస్తామన్నారు. ప్రతి ఇంటికి ఆరు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానన్న మోదీ ఇంత వరకు ఎందుకు వేయలేదని, మీకేవరికైనా వచ్చాయా.. అని ఓటర్లను ప్రశ్నించారు. సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి ఆశీర్వాదం కావాలని, మీరు సహకరిస్తే తప్పకుండా సుజాత విజయం సాధిస్తుందని అన్నారు. అనంతరం ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే గండ్రత్ సుజాతకు మంత్రి పదవి ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. రోడ్‌షోలో కాంగ్రెస్ మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి, నాయకులు నరేష్ జాదవ్, భార్గవ్ దేశ్‌పాండే, సాజీద్‌ఖాన్, భూమారెడ్డి, రూపేష్‌రెడ్డి, శకీల్ పాల్గొన్నారు. -
మోదీని గద్దె దించడమే లక్ష్యం : కుష్బూ
పెరంబూరు: ప్రధానమంత్రి మోదీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా దేశంలోని అన్ని పార్టీలు ఏక తాటిపైకి వస్తున్నాయని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త, నటి కుష్బూ పేర్కొన్నారు. ఈమె ఒక ప్రకటనలో పేర్కొంటూ మోదీ పాలన తప్పుడు విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని, మోదీ సర్వాధికారిగా ప్రవర్తిస్తున్నారని రిజర్వుబాంకు గవర్నర్ రఘురాంరాజన్ చేసిన వ్యాఖ్యలను కుష్బూ గుర్తు చేశారు. మన్మోహన్సింగ్, చిదంబరం వంటి ఆర్థికనిపుణులు మొదటి నుంచి ఇదే చెబుతున్నారని అన్నారు. వారి కంటే మోది, జైట్లీ, అమిత్‌షా ఆర్థికవేత్తలా అంటూ విమర్శంచారు. పెద్ద నోట్ల రద్దు వంటి అనాలోచన నిర్ణయాలతో చిరు వ్యాపారవేత్తలు, సాధారణ ప్రజలు బాధింపునకు గురయ్యారని అన్నారు. అందుకే మోది దుష్ట పాలనకు చరమగీతం పాడాలని, మళ్లీ అధికారంలోకి రాకూడదనే దేశంలోని కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు. ఈ కూటమిలో ప్రధానమంత్రిని ఎంపిక చేయడంలో సమస్యలు తలెత్తవా? సుస్థిర పాలనను అందించడం సాధ్యమా? అన్న ప్రశ్నలకు తావేలేదన్నారు. మొదట మోదీ దుష్ట పాలనను పారదోలాలన్న ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు ఒకే గొడుగు కిందకు వస్తున్నాయని అన్నారు. ఇక రాహుల్‌గాంధీ ప్రధాని కావాలన్నది కాంగ్రెస్ వాదుల బలమైన ఆకాంక్ష అని, ఈ విషయమై నాయకులందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసన్‌కు, మాజీ అధ్యక్షుడు ఇళంగోవన్‌కు మధ్య వివాదం గురించి పార్టీ అధినాయకత్వం చూసుకుంటుందని, దానిగురించి తాను మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. అయినా ఇక్కడ విషయాలన్ని రాహుల్‌గాంధీకి తెలుసని, అయితే ప్రస్తుతం ఐదు రాష్ట్రాలు ఎన్నికలు జరగనుండడంతో ఆయా రాష్ట్రాల ప్రసార కార్యక్రమాల్లో రాహుల్‌గాంధీ బిజీగా ఉన్నారని, అవి ముగిసిన తరువాత ఆయన తమిళ రాజకీయాలపై దృష్టిసారిస్తారని కుష్బూ పేర్కొన్నారు. -
కాంగ్రెస్ నేత కుష్బూపై కోడిగుడ్లతో దాడి
-
బట్టలు కాదు... బుద్ధులు మారాలి
సమాజంలో ఆడవాళ్ల పై జరుగుతున్న లైంగిక దాడుల గురించి నటి ఖుష్బూతో ‘సాక్షి’ స్పెషల్ ఇంటర్వ్యూ. స్త్రీ వస్త్రధారణ సరిగ్గా లేకపోవడంవల్ల కూడా దాడులు జరుగుతున్నాయన్నది కొందరి ఒపీనియన్.. మీరేమంటారు? ఎనిమిదేళ్ల పాపపై అత్యాచారం జరిగింది. 67 ఏళ్ల వృద్ధురాలిపైనా లైంగిక దాడి జరిగింది. వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారని అలా జరిగింది. 88ఏళ్ల తల్లిని 45ఏళ్ల కొడుకు రేప్ చేశాడు. ఆ వయసులో ఆ తల్లి ఎలాంటి బట్టలు వేసుకుని ఉంటుంది? వయసు మీద పడి, వాడిపోయిన ఆమె శరీరం కనిపిస్తే వేరే ఆలోచనలు వస్తాయా? చూసే కళ్లల్లో తేడా ఉంటే ఎదుటి వ్యక్తి నిండుగా కప్పుకున్నా చెడ్డ ఆలోచనలే వస్తాయి. పైన చెప్పిన ఉదాహరణలన్నీ మనుషులు చేయదగ్గవేనా? మనిషి రూపంలో ఉన్న మృగాలు వాళ్లు. అయినా మన దగ్గరే బట్టల గురించి మాట్లాడుతున్నాం. విదేశాల్లో మొత్తం కురచ దుస్తులే వేసుకుంటారు. రోడ్డు మీద వాళ్లు వెళుతుంటే ఎవరూ పట్టించుకోరు. మనకు మాత్రం చాలా వింతగా ఉంటుంది. చూసే దృష్టి మారాలి. బుద్ధి మారాలి. ఆ మధ్య వైజాగ్‌లో ఓ అమ్మాయిని రోడ్డు మీద రేప్ చేస్తుంటే జనాలు చూస్తూ ఉండిపోయారు. ఈ సంఘటన వినే ఉంటారు. కామన్ పీపుల్‌కి మీరిచ్చే సందేశం ఏంటి? చూస్తూ నిలబడ్డానికి అక్కడేమైనా వినోదం జరిగిందా? అరాచకం జరిగినప్పుడు ఆపాల్సిన బాధ్యత లేదా? ఇవాళ అక్కడ ఉన్నది మన ఇంటికి సంబంధించిన అమ్మాయి కాకపోవచ్చు.. రేపు మన అమ్మాయి అవ్వొచ్చు. ‘ప్రతి స్త్రీ మన ఇంటి సభ్యురాలే’ అనుకుంటే చాలు. ఆ ్రïస్తీకి అన్యాయం చేయాలనుకునేవాళ్లు చేయలేరు. ఒకవేళ ఎవరైనా చేసినా మిగతావాళ్లు చూస్తూ ఉండలేరు. ఇంటి నుంచి రోడ్డు మీదకు వచ్చాక మన కళ్లెదుటే జరగరానిది జరిగినప్పుడు బాధితుల పక్షాన నిలబడాలి. లేకపోతే ‘మేం ఈ దేశ పౌరులం’ అని చెప్పుకునే అర్హత మనకు లేదు. ఒకవేళ పట్టించుకుంటే మనకేదైనా జరుగుతుందేమోనని భయం. ఆ మైండ్‌సెట్ మారాలి. లో క్లాస్ ఆఫీసుల నుంచి హై క్లాస్ ఆఫీసుల వరకూ లైంగిక వేధింపులకు గురయ్యే ఆడవాళ్ల సంఖ్య చాలానే ఉంటుంది. ‘ఉద్యోగంలోంచి తీసేస్తా’ వంటి బెదిరింపులు ఎదుర్కొంటుంటారు. వాళ్ల గురించి? మన వ్యక్తిగత మర్యాదను కాపాడుకోవడంకన్నా ఏ ఉద్యోగమూ గొప్పది కాదని నా అభిప్రాయం. ఉద్యోగం తప్పనిసరి అయిన పరిస్థితుల్లో కూడా రాజీపడకూడదు. ఎందుకంటే, ఒక్కసారి ‘యస్’ చెబితే అక్కడున్నంతకాలం అన్నింటికీ ఆమోదించాల్సిందే. అందుకే ‘నో’ చెప్పడం నేర్చుకోవాలి. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు కుదరదని నిర్మొహమాటంగా చెప్పేయొచ్చు. వేరే ఉద్యోగం వెతుక్కోవచ్చు. కానీ ‘నో’ చెప్పలేని పరిస్థితుల్లో వేరేవాళ్లు ఉంటారు. వాళ్లే ‘సెక్స్ వర్కర్స్’. వాళ్లంటే నాకు గౌరవం ఉంటుంది. ఎందుకంటే వేరే ఏ దారీ దొరక్క తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఆ పని చేస్తున్నామని వాళ్లు బాహాటంగానే చెబుతుంటారు. ఏ స్త్రీ కూడా తన శరీరాన్ని ఇష్టపూర్వకంగా అమ్ముకోదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అలా చేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో వేధిస్తారని నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌పై హాలీవుడ్ నటి ఆష్లే జడ్ ఆరోపణలు చేశాక చాలామంది ‘మీటూ’ అంటూ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెడుతున్నారు. మీకలాంటి సంఘటనలు ఏమైనా? టీనేజ్‌లో నేను సినిమాల్లోకొచ్చాను. ముంబై నుంచి ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడి పద్ధతులు తెలియవు. ఇక్కడి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కూడా తెలియదు. లక్కీగా నాకు ఎలాంటి వేధింపులు ఎదురు కాలేదు. కెరీర్ మొత్తం స్మూత్‌గా సాగింది. అయితే ‘అన్‌లక్కీ’ పీపుల్ ఉంటారు. వాళ్లు వేధింపులు ఎదుర్కొన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ‘నో’ చెప్పగలగడం. స్టార్టింగ్‌లోనే ‘నో’ చెప్పేశామనుకోండి.. ఇక్కడ ఉండనిస్తే ఉండనిస్తారు. లేకపోతే లేదు. వేరే ప్రొఫెషన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ అనే కాదు.. గుడిలాంటి పాఠశాలల్లో మంచి మార్కులు వేసి, పాస్ చేస్తానంటూ స్టూడెంట్స్‌ని ట్రాప్ చేయడానికి ట్రై చేసే టీచర్స్ గురించి తెలిసినప్పుడు మీకేమనిపిస్తుంది? నా రక్తం ఉడికిపోతుంది. అప్పటికప్పుడు ఏదో ఒకటి చేసేయాలనిపించేంత కసి. ఏమీ చేయలేం. మన పిల్లలు ఎక్కువ టైమ్ గడిపేది స్కూల్స్‌లోనే. అమ్మ లేని చోట పిల్లలను గైడ్ చేయడానికి టీచర్ ఉంటారంటారు. అలాంటి టీచర్సే ద్రోహం చేస్తుంటే ఇక పిల్లల్ని నమ్మి ఎక్కడికి పంపించాలి? స్కూల్‌కి పంపించాలంటే భయం. హాస్టల్లో ఉంచాలంటే భయం. ఎవర్ని నమ్మాలి? అందుకే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో ఎక్కువగా మాట్లాడాలి. స్కూల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఒకవేళ మూడీగా ఉంటే ఎందుకలా ఉన్నారో అడిగి తెలుసుకోవాలి. స్కూల్‌కి వెళ్లనని మొండికేస్తే బలవంతంగా పంపించేయకూడదు. అలా ఎందుకు చేస్తున్నారో ఆలోచించాలి. ఇంట్లో చెబితే నిన్ను ఫెయిల్ చేస్తామని టీచర్ బెదిరించి ఉండొచ్చు. అందుకే పదే పదే అడిగి, విషయం రాబట్టాలి. ముఖ్యంగా పిల్లల ప్రవర్తనలో మార్పొస్తే ఏదో జరగకూడనిది జరిగిందని గ్రహించాలి. అందుకే పిల్లల కోసం ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలి. ఆడవాళ్లకు మీరిచ్చే సందేశం? సందేశాలు ఇచ్చేంత కాదు కానీ.. నా మనసుకి తోచిన విషయాలు చెబుతాను. ఆత్మాభిమానం వదులుకోవాల్సి వచ్చే పరిస్థితులను సవాల్ చేయండి. తలొంచకూడదు.. తలెత్తుకునేలా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకోండి. ఎదుటి వ్యక్తి దాడి చేస్తున్నాడనగానే భయపడి సహాయం కోసం అరవకండి. తిరగబడండి. మీ కళ్లెదుట ఉన్నది మీలాంటి మనిషే అనే విషయాన్ని మరచిపోవద్దు. ఓవైపు నిర్మాతగా అప్పుడప్పుడు నటిగా చేస్తున్నారు. మీ ఇద్దరు కూతుళ్లకు తగినంత టైమ్ స్పెండ్ చేస్తుంటారా? ఇప్పుడు ఒక పాప టెన్త్, మరో పాప ట్వెల్త్ చదువుతున్నారు. చిన్నప్పుడు స్కూల్‌కి డ్రాప్, పికప్ నేనే. ఇప్పుడు వాళ్లే వెళతారు. మొదటి నుంచీ నా పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఆ రోజంతా ఏం జరిగిందో చెప్పే అలవాటు చేశాను. నేను పికప్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు కారులో వచ్చేటప్పుడే అన్ని విషయాలూ అడిగి తెలుసుకునేదాన్ని. ఇప్పుడు నా పని మీద బిజీగా ఉండి, ఇంట్లో లేకపోతే స్కూల్ నుంచి రాగానే ఫోన్ చేస్తారు. ‘ఈరోజు చాలా మూడీగా గడిచిందమ్మా’ అంటే.. ఎందుకు? అని అడుగుతాను. ‘హ్యాపీగా గడిచింది’ అంటే కూడా కారణం అడుగుతాను. నా పిల్లల మూడ్స్ మీద నేను ఓ దృష్టి పెడతాను. అలాగని వాళ్లకు ఆంక్షలు పెట్టను. స్వేచ్ఛ లేకుండా చేయను. తల్లిగా ఓ కంట కనిపెడతా. అంతే. ఇంతకుముందు స్కూల్ గురించి మాట్లాడుకున్నాం. స్కూల్‌లాంటి పవిత్రమైన మరో ప్లేస్ ‘హాస్పిటల్’. అక్కడ పేషెంట్స్‌ని కూడా కొందరు డాక్టర్స్ వదలని సంఘటనలు బయటికొచ్చాయి. అంత చదివినవాళ్లు కూడా అలా అంటే కారణం ఏమంటారు? పెరిగిన వాతావరణం ముఖ్య కారణం. ప్రాణం పోయాల్సిన డాక్టర్ దయనీయ స్థితిలో ఉన్న పేషెంట్‌పై లైంగిక దాడికి పాల్పడుతున్నాడంటే అతను డాక్టర్ ఎలా అయ్యాడు? అనిపిస్తుంది. చదువు.. సంస్కారం నేర్పిస్తుందంటారు. మరి.. ఆ చదువు ఎక్కడికి పోయినట్లు? ఇంటి వాతావరణం సరిగ్గా లేకపోయి ఉండొచ్చు. ఇంట్లో ఆడవాళ్లను మగవాళ్లు ఎలా ట్రీట్ చేస్తారన్నది చాలా ముఖ్యం. వాళ్లు చులకనగా చూస్తే.. ఆడవాళ్లను అవమానించడం, వాళ్ల పట్ల అమానుషంగా ప్రవర్తించడం తమ ‘బర్త్ రైట్’ అని అబ్బాయిలు అనుకుంటారు. పరాయి స్త్రీపై దాడి చేయాలనుకోవడానికి ఇదో కారణం అయ్యిండొచ్చు. అందుకే ఆడపిల్లల పెంపకం విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లే మగపిల్లలను కూడా కేర్‌ఫుల్‌గా పెంచాలి. ఆడవాళ్ల విలువ చెప్పాలి. దాడులు జరగడం సరే.. కొందరు ఆడవాళ్లు తమంతట తాము మాయలో పడిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భక్తి పేరుతో ఏ స్వామీజీని పడితే ఆ స్వామీజీని నమ్మడంలాంటివి.. ఇదైతే చర్చించాల్సిన విషయం. దేవుడు ఉన్నాడని నమ్ముతాం. దేవుడి సహాయం కోరతాం. దేవుడి మీద నమ్మకం పోతే అది మూఢ నమ్మకం అవుతుందని నా ఒపీనియన్. ఆ మూఢ నమ్మకమే వాళ్లను నమ్మకూడని వాళ్లను నమ్మేలా చేస్తుంది. పిల్లలు పుట్టాలంటే స్వామీజీ ఎలా చెబితే అలా చేయాలట? అవన్నీ కూడా చేయదగ్గ పనులు కాదు. అప్పుడైనా అతనెలాంటివాడో గ్రహించాలి కదా. గుర్మీత్ రామ్ రహీమ్ చేసిన అకృత్యాలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందుకే ఎవర్ని నమ్ముతున్నామన్నది ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి. సమాజంలో జరిగేవే సినిమాల్లో కనిపిస్తున్నాయా? సినిమాలు చూసి చేస్తున్నారా? కొన్ని సినిమాలు చెడు దారి పట్టిస్తున్నాయనే విమర్శకు మీ సమాధానం? సమాజంలో జరిగేవే సినిమాల్లో చూపిస్తున్నాం. మీరు ఏ సినిమా తీసుకున్నా.. లవ్, ఫ్యామిలీ, యాక్షన్.. ఇలా ఏ జానర్ తీసుకున్నా.. ఫైనల్‌గా ‘చెడుని మంచి గెలవడం’ అనే పాయింట్‌తోనే సినిమా ఎండ్ అవుతుంది కదా. అన్ని సినిమాల్లో చెప్పే ఇంత సింపుల్ మెసేజ్‌ని గుర్తించలేకపోతున్నారా? విలనే కదా ఓడిపోతున్నాడు. సినిమాలో ఉన్న మంచిని తీసుకుని చెడుని వదిలేయొచ్చు కదా. చెడు మార్గంలో వెళ్లాలనుకునేవాళ్లు చెడుని తీసుకుంటారు. అలాంటివాళ్లు సినిమాలు చూసి మాత్రమే చెడిపోరు. స్వతహాగా వాళ్లల్లో చెడు ఉంటుంది. సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇద్దరు ఆడపిల్లల తల్లిగా కూతుళ్లు పుట్టినందుకు ఎప్పుడైనా బాధపడ్డారా? నెవర్. చాలా ఆనందంగా ఉన్నాను. నేను, మా ఆయన (దర్శకుడు–నటుడు సుందర్. సి) ఆడపిల్లలు పుట్టాలనే కోరుకున్నాం. మేం లక్కీ. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక మగపిల్లాడు కావాలని కూడా అనుకోలేదు. ఏం ఆడపిల్లలు మన రక్తం కాదా? మరి.. మగపిల్లలనే ఎందుకు వారసులుగా ప్రకటిస్తున్నాం. మన కడుపున పుట్టిన మగబిడ్డ ఒంట్లో ఉండేదీ మన రక్తమే.. ఆడబిడ్డ ఒంట్లోదీ ఉండేది మన రక్తమే. అలాంటప్పుడు ఎందుకీ తేడా? ఫైనల్లీ.. పూటకో లైంగిక వేధింపుల గురించి వింటున్నాం. ఇవి ఆగాలంటే ఏం చేయాలి? చట్టరీత్యా పెద్ద దండన దొరుకుతుందనే భయం లేదు. అందుకే ఫ్రీగా ఉంటున్నారు. అరెస్ట్ చేసినా బెయిల్ మీద బయటికి వచ్చేయొచ్చనే ధీమా. నాన్–బెయిలబుల్ వారెంట్‌తో అరెస్ట్ చేయాలి. నేరం రుజువైతే శిక్ష వెంటనే పడాలి. పదీ పన్నెండేళ్లు లాగకూడదు. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్‌లో తీర్పు చెప్పాలి. ‘క్యాపిటల్ పన్మిష్మెంట్’ ఇవ్వాలి. ఇలా చేస్తేనే నేరాలు కొంతైనా తగ్గుతాయి. లా స్ట్రిక్ట్‌గా ఉండాలి. తమిళనాడులో ఓ చిన్నారి రేప్ విషయంలో ఇలానే జరిగింది కదా? తను ఏడేళ్ల పాప. చట్ట ప్రకారం బాధితుల పేరు మనం చెప్పకూడదు. నేరగాడి పేరు చెబుతాను. అతని పేరు ధశ్వంత్. ఏడేళ్ల పాపను రేప్ చేసి, చంపేశాడు. అతనికి న్యాయస్థానం మరణ శిక్ష విధించాలని తీర్పు ఇచ్చింది. ఈ కేస్ ఏళ్ల తరబడి సాగలేదు. ఏ కేస్ అయినా ఇంత త్వరగా మూవ్ అయితే బాగుంటుంది. – డి.జి. భవాని -
వీడియో వైరల్ : మద్యం మత్తులో సినీతారల డ్యాన్స్ !
సాక్షి, చెన్నై : తమిళ ప్రముఖ సినీతారల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఖుష్బూ సుందర్, సుకన్యలు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. చెన్నైలోని సవేరా హోటల్లో విందు సందర్భంగా ప్రముఖ హిందీ సాంగ్ 'పియా తూ అబ్ తొ ఆజా' ప్లే చేశారు. సాంగ్‌కి తగ్గట్టుగా ఖుష్బూ అద్భుతమైన స్టెప్పులు వేశారు. తర్వాత సుకన్య కూడా ఖుష్బూ స్టెప్పులకు ఏమాత్రం తీసిపోకుండా డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ ఇద్దరు సీనియర్ నటీమణుల వయసు పెరిగినా స్టెప్పుల్లో ఏమాత్రం గ్రేస్ తగ్గనట్లు కనిపించింది. ఖుష్బూ, సుకన్యలు డ్యాన్స్ వేస్తుంటే పక్కనే ప్రముఖ నటుడు మనోబాల కూడా ఉన్నారు. అయితే మద్యం మత్తులో ఖుష్బూ, సుకన్యలు చిందేశారంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఖుష్బూ ఇటీవలే విడుదలైన తెలుగు చిత్రం అజ్ఞాతవాసిలో నటించిన విషయం తెలిసిందే. 200లకు పైగా చిత్రాల్లో నటించిన ఖుష్బూ తమిళ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఖుష్బూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
కుష్బు చిత్రంలో వైభవ్
గెలుపు ప్రభావం ఏమిటన్నది యువ నటుడు వైభవ్‌కు బాగా అనుభవమైంది. విజయం అవకాశాల్ని ఆనందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రస్తుతం ఇవన్నీ కలిపిన జోష్‌లో ఉన్నారు నటుడు వైభవ్. మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూసిన ఈయనకు కప్పల్ చిత్రం దాన్ని అనూహ్యంగానే అందించింది. ఇంకా చెప్పేదేముంది పెద్ద పెద్ద సంస్థలో నటించే అవకాశాలు వైభవ్‌ను వరిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ నుంచి ఈ యువ నటుడికి పిలుపొచ్చింది. ఆయన నిర్మించనున్న చిత్రంలో వైభవ్ హీరో. ఈ చిత్రానికి ఎస్ ఎస్ స్టాన్లీ దర్శకుడు. అంతేకాదు అరణ్మణై వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విజయన్ ఐ మీడియా సంస్థ ఈయనతో చిత్రం చేయడానికి ముందుకొచ్చింది. మరో లక్కీఛాన్స్ ఏమిటంటే కుష్బు తన అల్కి సినీ మాక్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలోను వైభవే నాయకుడు. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని వైభవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ తాను దర్శకుల నటుడిని అన్నారు. నటుడిగా పేరు తెచ్చుకోవాలని చాలాకాలంగా శ్రమిస్తున్నానన్నారు. ఇప్పటి ఎదుగుదల చాలా సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. -
బాలచందర్‌కు రజనీ, కుష్బూ పరామర్శ
ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ క్రమంగా కోలుకుంటున్నారని చెన్నైలోని కావేరి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. బాలచందర్ ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని, క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతోందని చెప్పారు. కాగా, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, కాంగ్రెస్ నాయకురాలు కుష్బూ కావేరి ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న బాలచందర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, దానిపై ఎవరూ ఎలాంటి వదంతులు సృష్టించొద్దని ఈ సందర్భంగా కుష్బూ చెప్పారు. -
పెళ్లికి ముందు శృంగారం ముప్పు!
పెళ్ళికి ముందే శృంగారంలో పాల్గొనడం అనేది నేటి కొంతమంది యువతకి పెద్ద ఫ్యాషనైపోయింది. మితిమీరిన స్వేచ్ఛతో కొందరు కలసి తిరగడానికి, మరి కొందరు సహజీవనం చేయడానికి అలవాటుపడిపోయారు. అయితే ఇటువంటి వ్యవహరాలలో ఎక్కువగా మోసపోయేది, నష్టపోయేది యువతులే. యువతులు మోసపోయిన ఘటనలు ప్రతిరోజులో మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయినా పెళ్లికి ముందు విచ్చలవిడిగా తిరగడం, శృంగారంలో పాల్గొనడం మాత్రం తగ్గడంలేదు. ఇంకా పెరుగుతూ ఉంది. మోసపోయిన యువతులు, ఆ తరువాత ఆత్మహత్యలు చేసుకునే యువతుల సంఖ్య కూడా రోజుజోరుకు పెరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో కేంద్ర ఆరోగ్య శాఖ వారు గతంలో నిర్వహించిన ఒక సర్వేలో పెళ్లికి ముందు శృంగారంపై ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో 15 -24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను ప్రశ్నించారు. వారిలో 24 శాతం మంది అమ్మాయిలు తాము పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొన్నట్లు చెప్పారు. ఆ చెప్పినవారు 15 ఏళ్ల వయసువారే. ఇది ఆందోళన కలిగించే అంశమైనా వాస్తవం. అమ్మాయిలతో పోల్చినప్పుడు అబ్బాయిల శాతం తక్కువగా ఉంది. ఏది ఏమైనా వివాహానికి పూర్వం శృంగారం చాలా సాధారణమైపోయిందని తేలింది. పెళ్లికి ముందు శృంగారాన్ని సమర్ధించేవారు కూడా తక్కువ ఏమీలేరు. ప్రముఖ సినీ నటి ఖుష్బూ పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై తమిళనాడులో కేసులు కూడా నమోదయ్యాయి. తనపై కేసులను కొట్టేయాలని కుష్బూ పెట్టుకున్న పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. దాంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీం కోర్టు ఆమెపై కేసులను కొట్టేస్తూ తీర్పు చెప్పింది. ప్రతి వ్యక్తికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉందని, ఓ వ్యక్తి మాట్లాడే మాటలను భూతద్దంలో చూడటం సరి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లికి ముందు శృంగారం తప్పు కాదని, పైగా ఇలాంటి సంబంధం వల్ల వారిద్దరి మధ్య బంధం మరింత బలపడుతుందని సెక్సీ భామ షెర్లిన్ అంటున్నారు. కామసూత్ర 3డి సినిమా కోసం ఆమె నగ్నంగా ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు శృంగారం పెళ్లి వరకు వచ్చినప్పుడే షెర్లిన్ చెప్పినట్లు బంధం పలపడుతుంది. అలా కాకపోతే ఆ యువతే నష్టపోవలసి వస్తుంది. సెలబ్రిటీలకే ఏమై చెబుతుంటారు. ఇటువంటి విషయాలలో సాంప్రదాయాలు, కట్టుబాట్లు మధ్య జీవించే సామాన్య యువతులే ఎక్కువ బాధలు పడేది. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొని మోసపోయిన యువతులు చేసే ఫిర్యాదులు కూడా తక్కువేంలేవు. గత జూన్ నెలలోనే రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటువంటి ఫిర్యాదులు దాదాపు 150 వరకు వచ్చాయి. ఉన్నత చదువులు చదివి, వివిధ సంస్దలలో ఉద్యోగాలు చేస్తున్న 20-24 సంవత్సరాల మధ్య వయసున్న యువతులే ఎక్కువగా ఉన్నారు. తాము నమ్మిన వారి చేతిలో మోస పోయామని న్యాయం కోసం వారు మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు. ధైర్యం చేసి ఫిర్యాదు చేసినవారు మాత్రమే వీరు. ఇక బయటకు చెప్పుకోలేక లోపలలోపల కుమిలిపోయేవారి సంఖ్య ఎంత ఉంటుందో చెప్పడం కష్టం. అందువల్ల ఎవరు ఎన్ని చెప్పినా ఈ సంఘటనలు యువతులు తమ జాగ్రత్తలో తాము జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరిక చేస్తున్నాయి.