కుష్బు చిత్రంలో వైభవ్ | Kushbu film act in Vaibhav | Sakshi
Sakshi News home page

కుష్బు చిత్రంలో వైభవ్

Published Fri, Mar 27 2015 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 11:26 PM

కుష్బు  చిత్రంలో  వైభవ్

కుష్బు చిత్రంలో వైభవ్

గెలుపు ప్రభావం ఏమిటన్నది యువ నటుడు వైభవ్‌కు బాగా అనుభవమైంది. విజయం అవకాశాల్ని ఆనందాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రస్తుతం ఇవన్నీ కలిపిన జోష్‌లో ఉన్నారు నటుడు వైభవ్. మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూసిన ఈయనకు కప్పల్ చిత్రం దాన్ని అనూహ్యంగానే అందించింది. ఇంకా చెప్పేదేముంది పెద్ద పెద్ద సంస్థలో నటించే అవకాశాలు వైభవ్‌ను వరిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ నుంచి ఈ యువ నటుడికి పిలుపొచ్చింది. ఆయన నిర్మించనున్న చిత్రంలో వైభవ్ హీరో. ఈ చిత్రానికి ఎస్ ఎస్ స్టాన్లీ దర్శకుడు.

అంతేకాదు అరణ్మణై వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన విజయన్ ఐ మీడియా సంస్థ ఈయనతో చిత్రం చేయడానికి ముందుకొచ్చింది. మరో లక్కీఛాన్స్ ఏమిటంటే కుష్బు తన అల్కి సినీ మాక్స్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలోను వైభవే నాయకుడు. ఈ చిత్రాలకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని వైభవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన పేర్కొంటూ తాను దర్శకుల నటుడిని అన్నారు. నటుడిగా పేరు తెచ్చుకోవాలని చాలాకాలంగా శ్రమిస్తున్నానన్నారు. ఇప్పటి ఎదుగుదల చాలా సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement