Actress Kushboo Fires On Netizen Who Trolled About Her Daughters Nose Surgery - Sakshi
Sakshi News home page

Actress Kushboo: కూతుళ్లపై అలాంటి కామెంట్స్‌.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నటి ఖుష్బూ

Published Thu, Feb 16 2023 3:15 PM | Last Updated on Thu, Feb 16 2023 4:03 PM

Actress Kushboo Fires on a Netizen Who Trolled Her Daughters Nose Surgery - Sakshi

సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ సుందర్‌. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదం, విమర్శలతో వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా తన పిల్లలను ట్రోల్‌ చేసిన వారిని తనదైన శైలిలో కౌంటర్‌ ఇస్తుంటారు. తాజాగా తన కూతుళ్లను టార్గెట్‌ చేసిన ఓ నెటిజన్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇద్దరు కూతుళ్లు అవంతిక, ఆనందిక ఫొటోను రీసెంట్‌గా తన ట్విటర్‌లో ఖాతా ప్రోఫైల్‌ పిక్‌గా షేర్‌ చేశారు ఖుష్బూ.

చదవండి: ఆ హీరోయిన్‌ అంటే క్రష్‌.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్‌ చరణ్‌

ఈ ఫొటోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ ‘వారు తమ ముక్కుకు సర్జరీ చేసుకున్నారు!’ అని కామెంట్‌ చేశాడు. దీనిపై ఆమె స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ‘20, 22 ఏళ్ల వయసున్న పిల్లలకు కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? చిన్న పిల్లల మీద ట్రోలింగ్‌ చేయడం సిగ్గుచేటు. కనీసం పిల్లలనైనా వదిలేయండి’ అంటూ ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా ఖుష్బు కూతుళ్లపై ట్రోలింగ్‌ జరగడం ఇది తొలి సారి కాదు.

చదవండి: వాలంటైన్స్‌ డే: తమన్నా-విజయ్‌ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది?

గతంలోనూ వారి బరువు, శరీరాకృతిపై కొందరు కామెంట్స్‌ చేశారు. అలా కూతుళ్లపై ట్రోలింగ్‌ జరిగిన ప్రతిసారి ఖుష్బు వారికి కౌంటరి ఇస్తూనే వచ్చారు. తాజాగా మరోసారి తన పిల్లల గురించి అసత్య ప్రచారం చేయడంతో ఖుష్బూ ఘాటుగా స్పందించారు. కాగా హీరోయిన్‌గా కెరీర్‌ పీక్‌లో ఉండగానే దర్శకుడు సుందర్‌ను ఖుష్బూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి అవంతిక, ఆనందిక అనే ఇద్దరు కూమార్తెలు జన్మించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement