ప్రముఖ నటి ఖుష్భూ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ రాణిస్తుంది. సినిమాల్లోనే బిజీ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే డైరెక్టర్ సుందర్‌తో ప్రేమలో పడిన ఖుష్భూ 1991లో అతడిని పెళ్లాడింది. వీరికి అవంతిక, అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
లండన్‌లో చదువుకుంటున్న అవంతిక ఓ వైపు చదువుకుంటూనే, మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి బాగానే ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో తరచూ తన ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా లండన్‌లోని ఓ కాఫీ షాపులో పొట్టి బట్టల్లో గ్లామర్ షో చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ లెవల్‌లో గ్లామర్ షో చేస్తుందంటే.. త్వరలోనే సినిమాల్లోకి వచ్చేస్తుందేమో అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇలాంటి పొట్టి బట్టలు నీకు అవసరమా? అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment