మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' విడుదలైన మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ, సాంగ్స్, సీన్స్.. ఇలా ఏ విషయంలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా ఘోరంగా వచ్చాయి. ఒకరకంగా నిర్మాత నుంచి బయర్స్ వరకు నష్టం వచ్చినట్లేనని టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని గ్రహించిన చిరంజీవి తన రెమ్యునరేషన్ నుంచి కొంతమొత్తాన్ని నిర్మాతకు తిరిగిచ్చేశాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి- అనిల్ సుంకర మధ్య రెమ్యునరేషన్ విషయంలో గొడవలు వచ్చాయని ఈ మధ్య బాగా వైరల్ అయింది. దీంతో అనిల్ రంగంలోకి దిగి ఇందులో నిజం లేదని ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు.
(ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ )
ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకు చిరంజీవి రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. దీంతో 'భోళా శంకర్' కు ఆయన రూ. 60 కోట్లు తీసుకున్నాడని టాక్ నడిచింది. ఇందుకు సంబంధించిన రెమ్యునరేషన్‌ను సినిమా నిర్మాతలు షూటింగ్ సమయంలోనే చిరుకు రూ. 50 కోట్లు ఇచ్చేశారట. మిగతా రూ. 10 కోట్లు మెగస్టార్‌కు చెక్ రూపంలో ఇచ్చారట.
(ఇదీ చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి)
కానీ ఆ చెక్‌ను సినిమా విడుదల తర్వాత బ్యాంక్‌కు పంపాలని చిరంజీవి భావించారట. భోళా శంకర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా రిజల్ట్ తెలుసుకున్న మెగాస్టార్.. ఆ చెక్‌ను డిపాజిట్ చేయకుండా అలానే ఉంచారట. తనను నమ్ముకుని సినిమా తీసిన నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకుని ఆ చెక్‌ను అనిల్ సుంకరకు రీసెంట్‌గా తిరిగి ఇచ్చేశారని తెలుస్తోంది. గతంలో కూడా తన సినిమాల వల్ల నష్టపోయిన నిర్మాతలకు చిరంజీవి ఏదో రూపంలో సాయం చేశారని పలువురు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడని చెబుతున్నారు. చిరంజీవి తమకు ఎప్పుడూ అండగానే ఉన్నారని నిన్ననే నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment