యాంకర్‌గా అనసూయ చెల్లెలు? త్వరలోనే ఆ షోతో ఎంట్రీ! | Anasuya Bharadwaj Sister Vaishnavi Entry into As Anchor Soon | Sakshi
Sakshi News home page

Anasuya Sister Vaishnavi: యాంకర్‌గా అనసూయ చెల్లెలు? త్వరలోనే ఆ షోతో ఎంట్రీ!

Published Thu, Oct 20 2022 12:50 PM | Last Updated on Thu, Oct 20 2022 12:56 PM

Anasuya Bharadwaj Sister Vaishnavi Entry into As Anchor Soon - Sakshi

బుల్లితెరపై యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ క్రేజ్‌ గురించిన తెలిసిందే. తనదైన యాంకరింగ్‌, అందం, గ్లామర్‌తో హీరోయన్లకు సమానమైన ఫ్యాన్‌ బేస్‌ను సంపాదించుకుంది. ఓ కామెడీ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన ఆమె వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై సైతం సత్తా చాటుతోంది. పెద్ద సినిమాల్లో కీ రోల్స్‌, లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో లీడ్‌ రోల్‌ పోషిస్తూ నటిగా తనని తాను ప్రూవ్‌ చేసుకుంది. ఇటూ యాంకర్‌గా, అటూ నటిగా కెరీర్‌లో సక్సెస్‌ అయ్యింది అనసూయ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చెల్లెలు యాంకర్‌గా రంగప్రవేశం చేయనుందట. అనసూయకు ఇద్దరు చెల్లెల్లు అనే విషయం తెలిసిందే. వారిలో వైష్ణవి ఒకరు.

చదవండి: కొడుకు పోజులు చూసి మురిసిపోతున్న కాజల్‌.. ఎమోషనల్‌ పోస్ట్‌

ఇప్పుడు ఆమె త్వరలోనే యాంకర్‌గా బుల్లితెరపై అలరించబోతోందని తెలుస్తోంది. ఆ మధ్య కామెడీ షో స్పెషల్‌ ఎపిసోడ్‌లో అనసూయతో పాటు వైష్ణవి కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే. అందం, అల్లరి, చాలాకి తనంలో అచ్చం అనసూయను తలపించడంతో అక్కకు తగ్గ చెల్లెలు అనిపించుకుంది వైష్ణవి. అందుకే ఆమెను యాంకర్‌గా రంగప్రవేశం చేయించేందుకు ‘రంగమత్త’ గట్టి ప్రయత్నాలు చేస్తోందని వినికిడి. ఈ నేపథ్యంలోనే వైష్ణవిని ఒక షో కోసం రికమండ్ కూడా చేసిందట. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్లో త్వరలో ప్రసారం కానున్న ఒక షో ద్వారా వైష్ణవి యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement