Anasuya Tweets Goes Viral Again In Social Media Platforms About Haters And Trollers - Sakshi
Sakshi News home page

Anasuya: వారిని నిరాశకు గురి చేస్తూనే ఉంటా: అనసూయ

Published Sun, Aug 20 2023 6:43 PM | Last Updated on Mon, Aug 21 2023 10:30 AM

Anasuya Tweets Goes Viral Again In Social Medai Platforms About haters - Sakshi

బుల్లితెర యాంకర్ నుంచి.. నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే అనసూయ.. ఓ వీడియో షేర్ చేసి అభిమానులకు షాకిచ్చింది. అందులో బోరున విలపిస్తూ కనిపించింది. దీంతో అనసూయకు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆరా తీశారు. తీరా సోషల్ మీడియా నెగెటివిటీ గురించే అని అంతా అనుకున్నారు. కానీ మరో వీడియో షేర్ చేసిన అనసూయ.. మీరేంటి ఇలా అర్థం చేసుకున్నారా? అంటూ క్లారిటీ ఇచ్చింది. 

ఆ వీడియోలో ఏడ్చింది నేను ఓ తీసుకున్న నిర్ణయం వల్లే కానీ.. సోషల్ మీడియా నెగెటివిటీపై ఏ మాత్రం కాదని అనసూయ వెల్లడించింది.  అయితే తాజాగా మరో ట్వీట్‌ చేసిన అనసూయ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ సారి ముఖ్యంగా హేటర్స్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్‌లో ప్రస్తావించింది. ద్వేషాన్ని ఎదుర్కొని తాను ధైర్యంగా ముందుకు సాగుతానని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

అనసూయ ట్వీట్‌లో రాస్తూ..' మిమ్మల్ని చూస్తుంటే బాధగా ఉంది. ఎదుటివ్యక్తులను తక్కువ చేసి.. వాళ్లు బాధపడుతుంటే సానుభూతి చూపించి.. మీకు మీరు మంచి వాళ్లమని ఫీలవుతుంటారు. ఆ బాధపడిన వ్యక్తే స్ట్రాంగ్‌గా నిలబడితే మాత్రం తట్టుకోలేరు. ఇదే కదా కపటధోరణి అంటే. ఈరోజు నేను మాటిస్తున్నా. ఎంతోమందికి ఉదాహరణగా నా జీవితంలో ముందుకెళ్తా. సమస్యలు ఎదురైనప్పుడు పారిపోకుండా ఎలా ముందుకు సాగాలో చూపిస్తా. ఎందుకంటే.. నువ్వు ఒక స్థాయికి వెళ్లేవరకూ వాళ్లు నిన్ను కిందకు లాగాలనే చూస్తుంటారు. నువ్వు చనిపోయాక సానుభూతి చూపించి అటెన్షన్‌ పొందాలనుకుంటారు. బతికినంత కాలం చావాలనిపించేలా ట్రీట్‌ చేసి.. చచ్చాక ఉద్ధరించాలనుకుంటారు.' అంటూ ట్వీట్‌లో ప్రస్తావించింది. 

ఆ తర్వాత కూడా వరుస ట్వీట్స్ చేసింది. 'ఏది ఏమైనా ఇప్పటికే నేను విపరీతమైన ద్వేషాన్ని ఎదుర్కొని నిలబడ్డా. ఇక ముందూ నిలబడతా. హేటర్స్‌ను ఎప్పుడూ నిరాశపరుస్తూనే ఉంటా. నన్ను అభిమానించే వాళ్లను ఎప్పటికీ ఆరాధిస్తూనే ఉంటా. మీరే నా బలం. శక్తి'  అని రాసుకొచ్చారు.  ఆ తర్వాత మరో ట్వీట్‌లో.. 'ఐ యామ్‌ సారీ.. ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్‌మీడియాలో మనం ఉండటానికి అసలు కారణం ఏమిటి? అటెన్షన్‌ పొందడం కోసం కాదా?’’ అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం ఆమె చేసిన  ట్వీట్స్‌పై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement