ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్‌.. కేవలం 61 గంటల్లోనే! | Bollywood Actor Sonu Sood Tweet Goes Viral After Whatsup Retrieved | Sakshi
Sakshi News home page

Sonu Sood: సోనూ సూద్ వాట్సాప్‌.. 9 వేలకు పైగా!

Published Sun, Apr 28 2024 7:05 PM | Last Updated on Sun, Apr 28 2024 7:05 PM

Bollywood Actor Sonu Sood Tweet Goes Viral After Whatsup Retrieved

అల్లు అర్జున్‌ మూవీ జులాయితో ప్రేక్షకులను అలరించిన నటుడు సోనూ సూద్‌. అరుంధతి చిత్రంతో పశుపతిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫతే మూవీలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో త్వరలోనే రిలీజ్ కానుంది. అయితే తాజాగా సోనూ సూద్ వాట్సాప్‌ ఒక్కసారిగా నిలిచిపోయింది. దీంతో వెంటనే ట్విటర్‌ ద్వారా తన సమస్యను ప్రస్తావించారు.

సోనూ సూద్ విజ్ఞప్తిని పరిశీలించిన వాట్సాప్ యాజమాన్యం అతని ఖాతాను పునరుద్ధరించింది. అయిదే దాదాపు 61 గంటల తర్వాత వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని సోనూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ఫైనల్‌గా నా వాట్సాప్ తిరిగి పనిచేస్తోంది.. కేవలం 61 గంటల వ్యవధిలోనే 9,483 సందేశాలు వచ్చాయి అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ వైరవుతోంది. కాగా.. సోనూ సూద్‌ నటిస్తోన్న ఫతే చిత్రంలో జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ  చిత్రం ద్వారా సోనూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి సాగర్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement