
తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం.. అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి పదే పదే అంటుంటాడు. అలాగే తెలుగు, ఇంగ్లీష్.. ఏదైనా కానీ నాకు నచ్చని ఏకైక పదం ఆంటీ అంటోంది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). ఏళ్ల తరబడి ఈ పదంపై ఉద్యమమే చేస్తోందీ యాంకర్. ఎవరు పడితే వారు ఆంటీ అంటే ఊరుకునేది లేదు.. అలా పిలవాలంటే నా బంధువులై ఉండాలి, లేదా చిన్నపిల్లలై ఉండాలని అప్పట్లోనే కుండ బద్ధలు కొట్టింది.
హోలీ ఈవెంట్‌లోనూ 'ఆంటీ' పిలుపు
కానీ జనాలు వింటేగా.. తనకు ఇష్టం లేదని చెప్తున్నా సరే పట్టించుకోకుండా సందు దొరికినప్పుడల్లా ఆంటీ అని ఏడిపిస్తున్నారు. శుక్రవారం (మార్చి 14న) హోలి సెలబ్రేషన్స్‌లో పాల్గొంది అనసూయ. హైదరాబాద్‌లోని ఓ హోలి ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వెళ్లిన ఆమెను ఓ ఆకతాయి ఆంటీ అని పిలిచాడు. ఆ పిలుపు తన చెవిన పడటంతో అనసూయకు చిర్రెత్తిపోయింది.

రెచ్చగొట్టకు..
దమ్ముంటే స్టేజీపైకి రా అని సవాల్ విసిరింది. నన్ను రెచ్చగొడితే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని ధమ్కీ ఇచ్చింది. ఏంటీ భయంతో ప్యాంటు తడిసిపోతుందా? అయితే వాష్‌రూమ్‌కు వెళ్లు అన్నట్లుగా సైగ చేసింది. ఇది చూసిన నెటిజన్లు.. అటు అనసూయ తగ్గదు, ఇటు జనాలు మారరు అని కామెంట్లు చేస్తున్నారు.
యాంకర్‌గా, నటిగా..
అనసూయ.. యాంకర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఎన్నో యేళ్లుగా పలు టీవీ షోలలో యాంకర్‌గా, జడ్జిగా పని చేసింది. ఈ మధ్య బుల్లితెరను వదిలేసి వెండితెరపైనే ఎక్కువ బిజీ అయింది. క్షణం, రంగస్థలం, మీకు మాత్రమే చెప్తా, పుష్ప 1, పుష్ప 2, విమానం, ప్రేమ విమానం, రజాకార్ వంటి పలు చిత్రాల్లో నటించింది. సూయ సూయ సూయ.., పైన పటారం లోన లొటారం, వా వా మేరే బావా వంటి స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసింది. ఇటీవల హరిహర వీరమల్లు సినిమా నుంచి రిలీజైన కొల్లగొట్టినాదిరో పాటలోనూ యాక్ట్ చేసింది.
చదవండి: అమాయకురాల్ని.. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకం..: రన్యా రావు
Comments
Please login to add a commentAdd a comment