
జబర్దస్త్ కామెడీ షోలో అందాల ఆరబోతతో పాటు నవ్వులు విరజల్లులు చిలకరించే యాంకర్ అనసూయ భరద్వాజ్. బుల్లితెర, వెండితెర.. మధ్యలో ఓటీటీ తెర.. కాదేదీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అనర్హమన్నట్లుగా కుదిరిన అన్ని చోట్లా కాలు మోపుతూ సక్సెస్‌ను అందిపుచ్చుకుంటోంది. తాజాగా ఆమెకు కమెడియన్ పక్కన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది. సునీల్ హీరోగా తెరకెక్కుతున్న 'వేదాంతం రాఘవయ్య' సినిమాలో అతడికి జోడీగా నటించేందుకు అనసూయను సంప్రదించారని సమాచారం. అయితే కథ నచ్చడంతో పాటు, హీరోహీరోయిన్లు ఇద్దరికీ సమప్రాధాన్యత ఉండటంతో సదరు సినిమాలో నటించేందుకు ఆమె పచ్చజెండా ఊపినట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. (చదవండి: కరోనా లక్షణాలు కనిపించాయి.. జాగ్రత్త : అనసూయ)
మరి ఇందులో ఎంతవరకు నిజముందనే విషయాన్ని అనసూయ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కమర్షియల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కథ అందించిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.ఇదిలా వుంటే అనసూయ ఇప్పటికే ఆమె 'థాంక్యూ బ్రదర్' సినిమాలో నటిస్తోంది. అది కూడా గర్భిణిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది. మరోవైపు మెగా డాటర్ నిహారికతో కలిసి ఓ వెబ్‌సిరీస్ కూడా చేస్తోంది. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయంటూ ఆదివారం ఓ పోస్టు పెట్టి అభిమానులను ఆందోళనకు గురిచేసిన ఈ నటి దాని గురించి ఇంకా ఎటువంటి అప్‌డేట్ ఇవ్వకపోవడం గమనార్హం. (చదవండి: మహేశ్ చేతుల మీదుగా ‘థ్యాంక్ యు బ్రదర్’ మోషన్ పోస్టర్)