‘‘నేను కథను నమ్ముతాను.. కథ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. హీరో హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు సెకండరీ. ‘రాక్షసుడు’ సినిమా కథను నమ్మాను.. హిట్ అయింది. ‘ఖిలాడీ’ కథ కూడా బాగుంటుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రం’’ అని కోనేరు సత్యనారాయణ అన్నారు. రవితేజ హీరోగా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఖిలాడీ’. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా కోనేరు సత్యనారాయణ విలేకరులతో చెప్పిన విశేషాలు.
∙రమేశ్ వర్మ సరికొత్త పాయింట్‌తో చెప్పిన ‘ఖిలాడీ’ కథ నాకు బాగా నచ్చింది. ఇది రవితేజకి బాగుంటుందన్నాను. రవితేజకు కూడా ఈ కథ నచ్చడంతో వెంటనే సినిమా చే ద్దామన్నారు. ‘మీ కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ రావాలని ఈ సినిమా చేస్తున్నాను’ అని రవితేజతో చెప్పాను. ఇటలీలో తీసిన సన్నివేశాలు చూస్తే హాలీవుడ్ రేంజ్‌లో అనిపిస్తుంది. ∙‘పెళ్లి చూపులు, రాక్షసుడు’ సినిమాను తమిళంలో రీమేక్ చేసి, హిట్ సాధించాను. ‘ఖిలాడీ’ సినిమా రషెస్ చూశాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాబోతోంది. అందుకే దర్శకుడు రమేశ్ వర్మకి కారును బహుమతిగా ఇచ్చాను. ఏపీలో నాలుగు ఆటలకు పర్మిషన్ అడిగాం. ∙ఇతర వ్యాపారాలు, విద్యా సంస్థలున్నా కూడా మా అబ్బాయి హవీష్ కోసమే సినిమా పరిశ్రమలోకి వచ్చాను. హవీష్ ప్రస్తుతం ‘సంజయ్ రామస్వామి’ అనే సినిమా చేస్తున్నాడు. ‘రాక్షసుడు 2’ ప్లాన్ చేస్తున్నాం. వంద కోట్లతో ‘యోధ’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా అనుకుంటున్నాం. త్వరలోనే వరల్డ్ హై క్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బేస్డ్ యూనివర్సిటీ కట్టాలనుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment