యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న 'ఫుల్ కిక్కు' సాంగ్‌ | Ravi Teja Full Kick Song Gets 5 Million Views | Sakshi
Sakshi News home page

Full Kick Song: కిక్కిచ్చే పాట.. ఇప్పటికే 5 మిలియన్లకు పైగా వ్యూస్‌

Published Sun, Jan 30 2022 7:17 PM | Last Updated on Mon, Jan 31 2022 8:03 AM

Ravi Teja Full Kick Song Gets 5 Million Views - Sakshi

Ravi Teja Full Kick Song Gets Huge Response: మాస్‌ మహారాజ రవితేజ రమేష్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడి. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్‌ వస్తుంది. రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి విడుదలైన ఫుల్‌కిక్‌ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్‌ చేస్తుంది.  ఇప్పటి వరకూ 5.8 మిలియన్స్‌కి  పైగా వ్యూస్‌తో దూసుకెళ్తున్న ఈ పాటకు 1.78లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

దేవిశ్రీ ప్రసాద్​ సంగీతమందించిన ఈ మాస్​ బీట్​కు శేఖర్ మాస్టర్​ కొరియోగ్రఫీ అలరిస్తున్నాయి. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్​ హయాతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే అర్జున్​, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి11న విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement