రవితేజ ఖిలాడి ట్రైలర్‌ వచ్చేసింది, మరోసారి మాస్‌మహారాజా మార్క్‌ చూపించేశాడు | Ravi Teja Khiladi Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Ravi Teja: రవితేజ ఖిలాడి ట్రైలర్‌ వచ్చేసింది, మరోసారి మాస్‌మహారాజా మార్క్‌ చూపించేశాడు

Published Mon, Feb 7 2022 9:06 PM | Last Updated on Mon, Feb 7 2022 9:17 PM

Ravi Teja Khiladi Movie Trailer Released - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఖిలాడి'. భారీ బడ్జెట్‌తో సత్యనారాయణ కోనేరు నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన సింగిల్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ సరసన నాయికలుగా మీనాక్షి చౌదరి - డింపుల్ అలరించనున్నారు. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్  ను రిలీజ్ చేశారు.

‘ఎప్పుడూ ఒకే టీమ్ లో ఆడటానికి నేషనల్ ప్లేయర్ ను కాదు .. ఐపీఎల్ ప్లేయర్. ఎవడు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను’ అనే రవితేజ డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు .. ఈ ఆటలో ఒక్కడే కింగ్ ఉంటాడు’ అనే రవితేజ మరో డైలాగ్ ట్రైలర్‌కు స్పెషల్‌ అట్రాక్షన్‌గా చెప్పుకొవచ్చు. ఇక ఇందులో హీరోయిన్‌ రొమాన్స్‌ కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో హీరోయిన్‌ మీనాక్షి చౌదరి-రవితేజ లిప్‌లాప్‌ కిస్‌ సీన్‌ను కూడా చూపించారు. యాక్షన్ .. రొమాన్స్ .. కామెడీతో మాస్ సాంగ్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement