మీనాక్షి చౌదరి మాట్లాడుతూ– ‘ఖిలాడీ’ రవితేజగారి సినిమా అనగానే మరో మాట మాట్లాడకుండా అంగీకరించాను. ఆయన కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కామెడీ టైమింగ్ కోసం నేను కూడా హోమ్ వర్క్ చేశాను’’ అని మీనాక్షి చౌదరి అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నేను ఏ సినిమా ఒప్పుకున్నా నా పాత్ర నిడివి ఎంత అనేది చూడను. కథలో నా పాత్ర ప్రాధాన్యత చూస్తాను. ‘ఖిలాడీ’ కమర్షియల్ సినిమా కాబట్టి లిప్‌లాక్ వంటి కొన్ని అంశాలుంటాయి.. ఇది కూడా నటనలో ఓ భాగమే. నేను ‘సలార్’ చిత్రంలో నటించడం ఇంకా ఖరారు కాలేదు. తెలుగులో ‘హిట్ 2’, తమిళంలో ‘కొలై’లో నటించాను.. మరో రెండు కొత్త సినిమాలున్నాయి’’ అన్నారు.
డింపుల్ హయతి మాట్లాడుతూ–‘‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేశాను.. ఆ తర్వాత పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. కానీ కొంత విరామం తీసుకుని మంచి సినిమా కోసం వెయిట్ చేసి ‘ఖిలాడీ’ చేశాను. నటిగా ఈ సినిమా సంతృప్తినిచ్చింది. రవితేజగారితో సమానమైన పాత్ర అంటే మొదట్లో భయమేసింది. ఇలా చెబుతున్నారు తీస్తారా? లేదా? అనే అనుమానం కూడా కలిగింది. సినిమా చేశాక రమేశ్ వర్మ చెప్పింది చెప్పినట్లు తీశారని అర్థమైంది. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. ‘ఖిలాడీ’ లో ‘క్యాచ్ మీ..’ పాట చేయడానికి ముందు లావుగా ఉన్నాను. దర్శకుడు చెప్పడంతో 6 కేజీలు తగ్గాను. పైగా లాక్‌డౌన్ రావడంతో రెండు నెలలపాటు నా బాడీని మెయిన్‌టైన్ చేయడానికి డైట్‌తోపాటు వ్యాయామం చేశాను.
Comments
Please login to add a commentAdd a comment