
Khiladi Director Ramesh Varma Says Sorry To Heroine: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఖిలాడి'. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి - డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్ రమేశ్ వర్మ.. స్టేజ్‌పైనే హీరోయిన్ మీనాక్షి చైదరికి క్షమాపణలు చెప్పారు.
ఖిలాడీ ట్రైలర్ సహా ఇతర ప్రమోషన్స్‌లోనూ డింపుల్ హాయాతినే ఎందుకో కాస్త ఎక్కువగా చూపించారు. ఈ విషయంలో ఐయామ్ ఎక్స్‌ట్రీమ్లీ సారీ.. సినిమా చూశాక నువ్వు సంతోషిస్తావు. సినిమాలో ఇద్దరికీ సమాన ప్రాధన్యత ఉంటుంది అంటూ పేర్కొన్నారు. రమేశ్ వర్మ మాటలకు కన్విన్స్ అయిన మీనాక్షి చిరునవ్వుతోనే సరే అన్నట్లుగా సమాధానం చెప్పింది.