రవితేజ ‘ఖిలాడి’ ప్లాన్‌.. క్లిక్ అయ్యేనా! | Ravi Teja Khiladi Movie To Release Simultaneously In Hindi | Sakshi
Sakshi News home page

రవితేజ ‘ఖిలాడి’ ప్లాన్‌.. క్లిక్ అయ్యేనా!

Published Mon, Feb 7 2022 10:11 AM | Last Updated on Mon, Feb 7 2022 10:11 AM

Ravi Teja Khiladi Movie To Release Simultaneously In Hindi - Sakshi

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పుష్ప కలెక్షన్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ హీరోలు మాస్ మూవీస్ కు దూరంగా ఉండటం, ఆ లోటును దక్షిణాది హీరోలు తీరుస్తామనడం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. పాన్‌ ఇండియా మార్కెట్ లోకి ఎవరూ ఊహించని హీరో, టాలీవుడ్ మాస్ రాజా ఎంట్రీ ఇస్తున్నాడు.

ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత బాలీవుడ్ మార్కెట్ లోకి అడుగుపెడుతున్న మరో తెలుగు హీరో రవితేజ. ఫిబ్రవరి 11న రిలీజ్ అవుతున్న ఖిలాడి మూవీతోనే మాస్ రాజా బాలీవుడ్ ఎంట్రీ కన్ ఫామ్ అయింది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోను భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ లో సౌత్ సినిమాల కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణ మాస్ రాజాకు ప్యాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ చూసే ఖిలాడి సినిమాను హిందీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది పెన్ స్టూడియోస్.

ఫిబ్రవరి 11న  బాలీవుడ్ థియేటర్స్ లో హిందీ సినిమా బదాయి దో రిలీజ్ అవుతోంది. గతంలో వచ్చిన బదాయి హో కు సీక్వెల్ వస్తోంది ఈ సినిమా. రాజ్ కుమార్, భూమి పెడ్నేకర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఓ సామాజిక అంశం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఫిబ్రవరి 11న ఈ సినిమాతో పోటీ పడి ఖిలాడి వసూళ్లను కొల్లగొట్టాల్సి ఉంటుంది.

హిందీ మార్కెట్ లో  ఖిలాడి క్లిక్ అయితే ఆ తర్వాతే బాలీవుడ్ లోనూ మాస్ రాజా ఫిల్మ్ ఫెస్టివల్ స్టార్ట్ కావడం కన్ ఫామ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వెంటనే రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు హిందీ మార్కెట్ కు క్యూ కట్టినా ఆశ్చర్యం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement