
Anchor Anasuya Dual Role In Ravi Teja Khiladi Movie: బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. యాంకరింగ్తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేకపాత్రల్లో అలరిస్తూ ఫుల్ జోష్ మీద ఉంది అనసూయ. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం 'పుష్ప: ది రైజ్'లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది.
రంగస్థలలంలో రంగమ్మత్తగా ఎంత పాపులర్ అయిందో కూడా తెలిసిందే. అలాగే పుష్ప సెకండ్ పార్ట్ 'ది రూల్'లో కూడా అనసూయ పాత్ర ఆసక్తిగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అనసూయ మరో విభిన్న పాత్రలో తన సత్తా చాటనుంది యాంకర్ అనసూయ భరద్వాజ్.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'ఖిలాడి' సినిమాలో అనసూయ ద్విపాత్రిభినయం చేస్తోందని సమాచారం. ఒక పాత్రలో రెబల్గా, రెండో పాత్రలో ఒక బ్రహ్మణ యువతిగా సందడి చేయనుందని సమాచారం. అయితే ఇందులో ఒక పాత్ర చనిపోతే మరొ రోల్ సినిమా చివరి వరకూ ఉండి ఆసక్తికరంగా ఉంటుందని టాక్. ఒకరకంగా అనసూయకు ఇది ఎక్కువ నిడివి ఉన్న పాత్ర అని తెలుస్తోంది.
ఇంకా ఇవే కాకుండా కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కూడా అనసూయకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్ర చేస్తుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతి సినిమాలో, మలయాళంలో మమ్ముట్టి నటిస్తున్న భీష్మ పర్వం మూవీలోనూ విభిన్న పాత్రలు చేస్తోందట అనసూయ.