ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: రాష్ట్ర మాస్టర్స్ అక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో మహిళల (30-34) విభాగం 50 మీటర్ల బటర్ ఫ్లయ్ ఈవెంట్‌లో డింపుల్ (హైదరాబాద్) 59.18 సెకన్లలో గమ్యం చేరి స్వర్ణం గెలిచింది. ఎన్.రాగిణి (నిజామాబాద్) రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెల్చుకోగా, సునీతా రెడ్డి(రంగారెడ్డి)కి కాంస్యం లభించింది. రాష్ట్ర అక్వాటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో సోమవారం ముగిశాయి.
ఫైనల్స్ ఫలితాలు: మహిళల విభాగం (40-44 ఏళ్లు): 100 మీ.బ్యాక్ స్ట్రోక్: 1. తోట విజయలక్ష్మీ (ఖమ్మం), 2. పి.ఉష. (30-34 ఏళ్లు) 100 మీ. బ్యాక్ స్ట్రోక్: 1.ఎం.రాధిక (కృష్ణా), 2.జి.వి.అర్చన (రంగారెడ్డి). (25-29 ఏళ్లు): 100 మీ. బ్యాక్ స్ట్రోక్: 1.ఆర్.శాలిని (హైదరాబాద్), 2.నాగేశ్వరమ్మ (కర్నూలు). పురుషులు (65-69 ఏళ్లు): 100 మీ ఫ్రీస్టయిల్: 1.నారాయణ (కరీంనగర్), 2.బాబు మాథ్యూ (హైదరాబాద్), 3.నర్సింహమూర్తి (హైదరాబాద్). (60-64 ఏళ్లు): 100మీ ఫ్రీస్టయిల్: 1. విఠల్ (నిజామాబాద్), 2.లక్ష్మీనారాయణ (కర్నూలు), 3.జేసుపాదం (హైదరాబాద్). (55-59 ఏళ్లు): 100 మీ ఫ్రీస్టయిల్: 1.సీతారామయ్య (గుంటూరు), 2.ఎస్.నరేంద్ర (హైదరాబాద్).
డింపుల్‌కు స్వర్ణం
Published Tue, Oct 1 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement