Dimple Hayathi Gives Two Auditions For Ramabanam Movie - Sakshi
Sakshi News home page

Dimple Hayathi: రెండు ఆడిషన్స్‌ ఇచ్చిన తర్వాతే డైరెక్టర్‌ నన్ను నమ్మారు

Apr 26 2023 8:31 AM | Updated on Apr 26 2023 10:04 AM

Dimple Hayathi Gives Two Auditions for Ramabanam Movie - Sakshi

‘‘ఈ చిత్రంలో యూ ట్యూబ్‌ బ్లాగర్‌ భైరవి పాత్రలో నటించాను. సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని నాకు ఈ పాత్ర కొత్తగా, కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించింది. ‘ఖిలాడి’ సినిమాలో నా గ్లామరస్‌ యాక్టింగ్‌ను చూసి  శ్రీవాస్‌గారు ‘రామబాణం’ సినిమాలో భైరవి ΄పాత్ర నేను చేయగలనా? అని కాస్త సంకోచించారు. దీంతో రెండు ఆడిషన్స్‌ ఇచ్చాను.

‘‘ఓ నటిగా నాకు అన్ని పాత్రలు చేయాలని ఉంది. కెరీర్‌లో ఐదేళ్లు గడిచిపోయినా కూడా నేను ఇంకా బేబీ స్టెప్స్‌ వేస్తున్నాను. నేను నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది’’ అన్నారు హీరోయిన్‌ డింపుల్‌ హయతి. గోపీచంద్, డింపుల్‌ హయతి జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామ బాణం’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది.

ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో డింపుల్‌ హయతి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో యూ ట్యూబ్‌ బ్లాగర్‌ భైరవి పాత్రలో నటించాను. సోషల్‌ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండని నాకు ఈ పాత్ర కొత్తగా, కాస్త ఛాలెంజింగ్‌గా అనిపించింది. ‘ఖిలాడి’ సినిమాలో నా గ్లామరస్‌ యాక్టింగ్‌ను చూసి  శ్రీవాస్‌గారు ‘రామబాణం’ సినిమాలో భైరవి ΄పాత్ర నేను చేయగలనా? అని కాస్త సంకోచించారు. దీంతో రెండు ఆడిషన్స్‌ ఇచ్చాను. ‘భైరవి’ పాత్రకు నేను సరిపోతానని ఆయన నమ్మారు. ప్రస్తుతం కొన్ని కొత్త కథలు వింటున్నాను. తెలుగు, తమిళ భాషల్లో నేను చేసిన కొత్త సినిమాల ప్రకటనలు త్వరలోనే వస్తాయి’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement