మాచో స్టార్ గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. జగరపతిబాబు, ఖుష్బూ ప్రధానపాత్రలు పోషించారు. అయితే లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గోపీచంద్ యాక్షన్ సీక్వెన్స్, డింపుల్ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించినప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం బోల్తా కొట్టింది.
(ఇది చదవండి: బాలీవుడ్లో మరో సినిమా చేస్తోన్న ధనుష్.. ముచ్చటగా మూడోసారి! )
మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామబాణం... నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఈ మూవీ ఇంకెప్పుడు ఓటీటీలోకి వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించింది. ఈ ప్రకటనతో గోపీచంద్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు తెలిపారు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఓటీటీ రానుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
(ఇది చదవండి: సీనియర్ నటి నిరోషా ఇంట చోరీ.. విలువైన నగలు సహా..)
Comments
Please login to add a commentAdd a comment