Dimple Hayathi Hilarious Reply To Fan Who Asked To Build Temple For Her - Sakshi
Sakshi News home page

Dimple Hayathi: గుడి కట్టిస్తానన్న అభిమాని.. డింపుల్‌ హయాతి క్రేజీ ఆన్సర్‌

Published Wed, May 3 2023 11:48 AM | Last Updated on Wed, May 3 2023 12:44 PM

Dimple Hayathi Funny Answer To Fan Who Asked To Build Temple For Her - Sakshi

సినీ తారలకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ల కోసం ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు కొందరు ఫ్యాన్స్‌. మరి కొందరేమో ఏకంగా గుడి కట్టేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇలా ఇప్పటికే ఖుష్భూ, నిధి అగర్వాల్‌, హన్సిక, నమిత, మొన్నీ మధ్య సమంత.. ఇలా హీరోయిన్లకు గుడికట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మరో అభిమాని హీరోయిన్‌ డింపుల్‌ హయాతికి గుడి కట్టాలనుకున్నాడు.

ఈ విషయాన్ని నేరుగా ఆమెనే అడిగేశాడు. మ్యాచో హీరో గోపీచంద్‌తో డింపుల్‌ కలిసి నటించిన సినిమా రామబాణం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌, మీమర్స్‌తో హీరోహీరోయిన్లు సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. 'మీకు గుడి కట్టాలనుకుంటున్నా. అది పాలరాయితో కట్టించాలా? లేక ఇటుకలతో కట్టించాలా' అని ప్రశ్నించాడు.

దీనికి డింపుల్‌ సమాధానిమిస్తూ.. 'నాకు బంగారంతో గుడి కట్టండి..చాలా బాగుంటుంది' అంటూ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. డింపుల్‌ ఆన్సర్‌కి అక్కడున్న వాళ్లంతా  తెగ నవ్వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement