హీరోయిన్కు ఘోర అవమానం! | refused a service in a store because of skin tone, says Zendaya Coleman | Sakshi
Sakshi News home page

హీరోయిన్కు ఘోర అవమానం!

Published Thu, Sep 8 2016 8:43 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

హీరోయిన్కు ఘోర అవమానం!

హీరోయిన్కు ఘోర అవమానం!

ఆధునిక సమాజంలోనూ వర్ణవివక్షకు గురవ్వడం ఎంతో బాధిస్తోందని హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో సాధారణ వ్యక్తుల మాట దేవుడెరుగును.. కానీ సెలబ్రిటీలు కూడా వర్ణవివక్షకు గురవుతున్నారంటూ హాలీవుడ్ నటి, సింగర్ జెండయ కోలెమన్ అంటోంది. ఇందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ తన స్నాప్ చాట్ ఖాతాలో దీనికి సంబంధించిన కొన్ని వీడియోలను పోస్ట్ చేసి నిరసన తెలిపింది.

నటి కోలెమన్ ఉత్తర అమెరికాలోని ఓన్స్ సూపర్ మార్కెట్ కు వెళ్లింది. తనకు కావలసిన వస్తువులు కొనుక్కుని బిల్లు కౌంటర్ వద్దకు వెళ్లింది. అయితే అక్కడ ఉన్న ఉద్యోగి కోలెమన్ వాలెట్ తీసి విసిరికోట్టాడు. దీంతో తనకు ఏం చేయాలో కొద్దిసేపు అర్థంకాలేదని వాపోయింది. గిఫ్ట్ కార్డులు కొనేందుకు వెళ్లగా తన రంగు(నలుపు) అయినుందున తనకు అవమానం జరిగిందని వివరించింది. వాలెట్ పడేసి నువ్వు ఇవి కొనేందుకు అర్హురాలివి కాదంటూ వ్యాఖ్యానించిందని, వాలెట్ లో ఎంతో విలువైన వస్తువులు ఉంటాయన్న కనీస అవగాహన కూడా ఆ ఉద్యోగికి లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. నల్లజాతీయులకు అవమానాలు చాలా దేశాల్లో జరుగుతున్నాయని స్నాప్ చాట్ వీడియోల రూపంలో తన బాధను అభిమానులు, ఫాలోయర్స్ తో కోలెమన్ పంచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement