ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ కాలుష్యం, పని ఒత్తిడి, పెరుగుతున్న వయస్సుతో సాధారణంగా కాస్త పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ముఖాన్ని వైట్‌గా, కాంతివంతంగా మార్చుకునేందుకు వేలకు వేలు పోగేసి క్రీములు, ఫేస్‌మాస్కులు కొనగోలు చేసినా పెద్దగా ఉపయోగం లేదా? అయితే ఇది మీకోసమే. పైసా ఖర్చులేకుండా మన పెరట్లో దొరికే మందార పూలతోనే ముఖ వర్చస్సును మెరుగుపర్చుకోవచ్చు.
సాధారణంగా మందారం పువ్వులను జుట్టు పెరుగుదలకు, ఒత్తుగా పెరిగేందుకు విరివిగా ఉపయోగిస్తుంటారన్నది అందరికి తెలిసిందే. దీనిని ఉపయోగించడం వల్ల అనేక జుట్టు సమస్యలు దూరం అవుతాయి. కానీ ఈ పువ్వులు కేవలం జుట్టుకే కాదు అందాన్ని కూడా రెట్టింపు చేస్తాయని మీకు తెలుసా? అదేలాగా? మందార పువ్వులతో అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మందారంలో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వల్ల వయసు పెరిగినా యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. ఈమధ్య కాలంలో అందాన్ని కాపాడుకోవడం, మరింత బ్రైట్‌గా కనిపించేందుకు తరచూ బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఫేషియల్, బ్లీచ్ వంటివి చేయించుకుంటారు. దీనికోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ వీటికన్నా మందార పూలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ముందుగా రెండు-మూడు మందార పువ్వులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి మిక్సీజార్‌లో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.
వారానికి మూడుసార్లు ఇలా చేస్తే ముఖం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.అంతేకాకుండా తరచూ ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య కూడా దూరమవుతుంది. చాన్నాళ్లుగా వేధిస్తున్న మొటిమలు, వాటి తాలూకూ మచ్చలు కూడా తొలిగిపోతాయి.
Comments
Please login to add a commentAdd a comment