ఫర్ గ్లాస్ స్కిన్.. ఈ చిట్కాలు పాటించండి.
►ఒక బౌల్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్, హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి. ఆ పేస్ట్‌ని స్క్రబ్‌లా మొహానికి రుద్దుకోవాలి .. ఓ 10 మినట్స్ వరకు. తర్వాత కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుని టవెల్‌తో ఆ తడిని అద్ది.. మాయిశ్చరైజర్ అప్లయ్ చేయాలి.
► శెనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడంలో సహాయం చేస్తుంది. శెనగపిండి, పసుపు, పెరుగు వేసి బాగా కలపండి. దీన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత ఆరాక కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
► పండిన బొప్పాయి, పుచ్చకాయ, బంగాళాదుంప, టొమాటో, కీర దోసకాయలు ఇలా వేటినైనా పేస్ట్‌గా చేసి.. దానిని 15 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి. అనంతరం పేస్ట్‌ను అప్లై చేసి.. పేస్ట్ చర్మంలో కలిసిపోయే వరకు స్క్రబ్ చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. టాన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.
► కొబ్బరి పాలలో దూదిని ఉంచి 15 నిమిషాల పాటు ముఖానికి మర్దనా చేయాలి. ఇది ట్యాన్‌ని రిమూవ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
కలబంద గుజ్జును ముఖంపై అప్లై చేశాకా 15 నిమిషాల తర్వాత సాధారణ నీళ్లతో కడిగేయాలి. ఇది స్కిన్‌టోన్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది.
► అవిసె గింజలు స్కిన్ టోన్‌ని గ్లాసీగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలను ఓ పాత్రలో వేడి చేసి అందులో నీళ్లు కలపాలి. జెల్ ఫార్మట్‌లో వచ్చాక స్టవ్ ఆపేసి వడగట్టాలి. మిగిలిన జెల్‌ను ముఖంపై అప్లై చేస్తే రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment