
సిద్ధమ్మ పాకలో టిఫిన్ తింటున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
ఎర్రావారిపాళెం(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా పరిధిలోని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన నియోజకవర్గంలో పల్లెబాట నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఎర్రావారిపాళెం మండలంలోని ఓ పాకలో టిఫిన్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ 78 ఏళ్ల సిద్ధమ్మ అవ్వ వద్ద రెండు దోసెలు..కాస్త చెట్నీ తీసుకున్నారు. అవ్వపెట్టిన దోసెలు ఆరగిస్తూ .. చాలా బావుందని చెప్పారు.
చదవండి: జనసేన చిల్లర షో..రక్తికట్టని డ్రామా..
ఆమె మాట్లాడుతూ, 40 ఏళ్ల నుంచి టిఫిన్ సెంటర్ నడుపుతున్నట్లు తెలిపింది. పిల్లలు స్థిరపడ్డారని చెప్పింది. మనవరాలు ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడించింది. స్థానికులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్యేని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఉన్నది ఎవరో తెలుసా అవ్వా? అంటూ అవ్వను అడిగారు. తనకు చూపు తక్కువని ఎవరో గుర్తుపట్టలేదని వారికి చెప్పింది. వారు ఇక్కడుండేది చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అని చెప్పడంతో అవ్వ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment