ritwik
-
రిత్విక్ జోడీకి రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టైటిల్
రొవరెటో ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ టైటిల్ చేజిక్కించుకున్నాడు. పురుషుల డబుల్స్ విభాగంలో రిత్విక్–శ్రీరామ్ బాలాజీ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. ఇటలీ వేదికగా జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో శనివారం రిత్విక్–బాలాజీ జోడీ 6–3, 2–6, 12–10తో థియో అరిబెగ్ (ఫ్రాన్స్)–ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్) జంటపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన రితి్వక్–బాలాజీ జోడీకి 6,845 యూరోల (రూ. 6 లక్షలు) ప్రైజ్ మనీ, 100 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. రిత్విక్ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. -
క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ జోడీ
మెట్జ్ (ఫ్రాన్స్): మోజెల్లి ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ రాకెట్ పట్టకుండానే క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–ఫ్రాన్సిస్కో కబ్రాల్ (పోర్చుగల్) జోడీతో తలపడాల్సిన ఆర్థర్ కజాక్స్–హరోల్డ్ మయోట్ (ఫ్రాన్స్) జంట గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో రిత్విక్–కబ్రాల్ ద్వయానికి తొలి రౌండ్లో ‘వాకోవర్’ లభించింది. వాస్తవానికి ఈ టోర్నీలో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేతో రిత్విక్ జతగా పోటీపడాల్సింది. అయితే గతవారం బ్రాటిస్లావాలో జరిగిన స్లొవాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ సందర్భంగా అర్జున్‌కు గాయమైంది. దాంతో అర్జున్ మోజెల్లి ఓపెన్ నుంచి వైదొలగగా... పోర్చుగల్ ప్లేయర్ కబ్రాల్తో కలిపి రిత్విక్ పోటీపడుతున్నాడు. కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో... స్లొవాక్ ఓపెన్‌లో రిత్విక్ సెమీస్‌కు చేరడంతో అతని ఏటీపీ డబుల్స్ ర్యాంక్ కూడా మెరుగైంది. గతవారం 85వ ర్యాంక్‌లో నిలిచిన రిత్విక్ సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి 80వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. రిత్విక్ భాగస్వామి అర్జున్ ఖడే 76వ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... శ్రీరామ్ బాలాజీ నాలుగు స్థానాలు పడిపోయి 65వ ర్యాంక్‌లో ఉన్నాడు. యూకీ బాంబ్రీ 48వ ర్యాంక్‌లో మార్పు లేదు. టాప్–10లో చోటు కోల్పోయిన బోపన్న గత ఏడాది ఆగస్టు నుంచి టాప్–10లో ఉన్న భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు పడిపోయాడు. పారిస్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో బోపన్న–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ రెండో రౌండ్లో నిష్క్రమించడం బోపన్న ర్యాంక్‌పై ప్రభావం చూపింది. బోపన్న ప్రస్తుతం 12వ ర్యాంక్‌లో ఉన్నాడు. గతవారం సియోల్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో విజేతగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (తమిళనాడు) ర్యాంక్‌లు కూడా మెరుగయ్యాయి. రామ్‌కుమార్ 18 స్థానాలు ఎగబాకి 125వ ర్యాంక్‌లో, సాకేత్ 25 స్థానాలు పురోగతి సాధించి 203వ స్థానంలో నిలిచారు. -
శభాష్ రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా ఐదు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) ద్వయం తమ కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకుంది. కజకిస్తాన్‌లో ఆదివారం ముగిసిన అల్మాటీ ఓపెన్ అసోసియేన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్–అర్జున్ జోడీ డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది. వీరిద్దరి కెరీర్లో ఇదే తొలి ఏటీపీ–250 టోర్నీ టైటిల్ కావడం విశేషం. ఒక గంటా 41 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్–అర్జున్ జంట 3–6, 7–6 (7/3), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో నికోలస్ బారింటోస్ (కొలంబియా)–స్కాండర్ మన్సూరి (ట్యూనిషియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన రిత్విక్–అర్జున్‌లకు 54,780 డాలర్ల (రూ. 46 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 6–9తో వెనుకబడి... తొలి సెట్‌ను కోల్పోయిన రిత్విక్–అర్జున్రెండో సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గి నిలిచింది. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో ఒకదశలో రిత్విక్–అర్జున్ 6–9తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచారు. అయితే పట్టుదలతో పోరాడిన రిత్విక్–అర్జున్ స్కోరును సమం చేశారు. చివరకు 14–12తో విజయాన్ని అందుకున్నారు. సాధారణ టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన వారికి సెట్ లభిస్తుంది. ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం తొలుత పది పాయింట్లు నెగ్గిన వారికి విజయం దక్కుతుంది. ఒకవేళ స్కోరు 9–9తో సమమైతే రెండు పాయింట్ల ఆధిక్యం లభించినపుడు గెలుపు ఖరారవుతుంది. 23 ఏళ్ల రిత్విక్ ఈ ఏడాది మూడు ఏటీపీ–250 టోర్నీల్లో (హాంగ్జౌ, అట్లాంటా, న్యూపోర్ట్) ఆడినా తొలి రౌండ్‌ను దాటలేకపోయాడు. అయితే నాలుగో ఏటీపీ–250 టోర్నీలో మాత్రం టైటిల్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు రిత్విక్ 10 ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకున్నాడు. మూడింటిలో టైటిల్స్ నెగ్గి, ఏడింటిలో రన్నరప్‌గా నిలిచాడు. -
రిత్విక్ జోడీ ఓటమి
న్యూపోర్ట్ (అమెరికా): హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ రితి్వక్ చౌదరీ–నికీ కలియంద పునాచా (భారత్) ద్వయం 1–6, 4–6తో ల్యూక్ సవిల్లె–అలెగ్జాండర్ వుకిచ్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రితి్వక్ ద్వయం ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. -
భారత ఆటగాడు రాజా రిత్విక్‌కు రజతం
ఫ్రాన్స్‌లో జరిగిన ‘లా ప్లాన్’ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్íÙప్లో భారత గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్ రజత పతకం సాధించాడు. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ ఈవెంట్లో తెలంగాణకు చెందిన రిత్విక్ తొమ్మిదో సీడ్లో బరిలోకి దిగి 5 విజయాలు, 4 ‘డ్రా’ల తర్వాత మొత్తం 7 పాయింట్లు సాధించాడు. మరో ముగ్గురు ఆటగాళ్లు ఇన్నియాన్ పన్నీర్‌సెల్వం, ప్రణీత్ ఉప్పల, ధూళిపాళ బాలచంద్రప్రసాద్లతో సమంగా నిలిచాడు. అయితే టైబ్రేక్ ఆధారంగా రిత్విక్‌కు రెండో స్థానం దక్కగా, ఇన్నియాన్కు కాంస్యం లభించింది. ఫ్రెంచ్ జీఎం జూల్స్ మాసర్డ్ 7.5 పాయింట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. జూల్స్, రిత్విక్ మధ్యే జరిగిన 9వ రౌండ్ పోరు 28 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో 17 దేశాలకు చెందిన 184 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 17 మంది గ్రాండ్‌మాస్టర్లు, 40 మంది ఇంటర్నేషనల్ మాస్టర్లు ఉన్నారు. రాజా రితి్వక్ ఇటీవలే జాతీయ ర్యాపిడ్ చాంపియన్íÙప్లో కాంస్యం, జాతీయ బ్లిట్జ్ చాంపియన్íÙప్లో రజతం గెలుచుకున్నాడు. -
రిత్విక్ జోడీ శుభారంభం
జీఎన్‌పీ సెగురోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ శుభారంభం చేశాడు. మెక్సికోలోని అకాపుల్కో నగరంలో ఈ టోర్నీ జరుగుతోంది. తొలి రౌండ్లో రిత్విక్–నిక్కీ పునాచా (భారత్) ద్వయం 7–5, 6–2తో యువాన్ పాబ్లో ఫిచోవిచ్ (అర్జెంటీనా)–లుకాస్ రెస్ డా సిల్వా (బ్రెజిల్) జోడీపై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. -
రిత్విక్–అర్జున్ జోడీకి ఏటీపీ చాలెంజర్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్లో హైదరాబాద్ యువ క్రీడాకారుడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ కెరీర్లో తొలి చాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటలీలో జరిగిన ఒల్బియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో రిత్విక్–అర్జున్ ద్వయం 6–1, 6–3తో ఇవాన్ సబనోవ్–మాతెజ్ సబనోవ్ (సెర్బియా) జంటపై గెలిచింది. ఈ ఏడాది రిత్విక్ –అర్జున్ జోడీ పోర్టో ఓపెన్, బ్రాన్òÙ్వగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలలో ఫైనల్ చేరి రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడ్డారు. మూడో ప్రయత్నంలో ఈ జంట తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలి రౌండ్లో రిత్విక్–అర్జున్ 6–3, 6–4తో శ్రీరామ్ బాలాజీ (భారత్)–ఆండ్రీ బెగెమన్ (జర్మనీ)లపై... క్వార్టర్ ఫైనల్లో 6–3, 6–4తో ఆండ్రూ హారిస్–జాన్ ప్యాట్రిక్ (ఆ్రస్టేలియా)లపై... సెమీఫైనల్లో 2–6, 7–6 (11/9), 10–7తో జెబవి–జెడెనెక్ (చెక్ రిపబ్లిక్)లపై గెలుపొందారు. టైటిల్ నెగ్గిన రిత్విక్–అర్జున్ జోడీకి 8,420 యూరోల (రూ. 7 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీ, 125 పాయింట్లు లభించాయి. -
రోడ్డు ప్రమాదంలో.. యువకుడు.. తీవ్ర విషాదం!
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ శివారులో సోమవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో గుడిపాటి రిత్విక్‌రెడ్డి (26) దుర్మరణం పాలయ్యాడు. బసంత్‌నగర్ ఎస్సై వెంకటేశ్ కథనం ప్రకారం.. కాటారం మండలం దేవరాంపల్లికి చెందిన రిత్విక్‌రెడ్డి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఆదివారం బైక్‌పై స్వగ్రామానికి వచ్చి తిరిగి సోమవారం వేకువజామున హైదరాబాద్‌కు పయనమయ్యాడు. రాఘవాపూర్ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించారు. మృతుడి తండ్రి గుడిపాటి సమ్మిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. Follow the Sakshi TV channel on WhatsApp: ఇవి చదవండి: ప్రేమించిన యువతి పెళ్లికి ఒప్పుకోలేదని.. యువకుడు.. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సీఎం రమేష్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోమవారం కలిశారు. ఫిబ్రవరి 7న తమ కుమారుడు రిత్విక్ వివాహానికి రావాల్సిందిగా ఆయన ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. కాగా ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో, రిత్విక్ నిశ్చితార్థం గత ఏడాది నవంబర్‌లో దుబాయ్ జరిగింది. కాగా ఇప్పటికే సీఎం రమేష్ తన కుటుంబసభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి, వివాహ ఆహ్వాన పత్రికను అందచేశారు. -
ఒకే సంస్థకు అన్ని పనులా!
సాక్షి, అమరావతి : టీడీపీ సర్కార్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో 60–సీ నిబంధన కింద 268 పనుల నుంచి పాత కాంట్రాక్టర్లను తొలగించటం.. వాటి అంచనా వ్యయం పెంచాక రూ.1,600 కోట్ల విలువైన పనులను సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. ఒకే సంస్థకు అన్ని పనులు ఎలా అప్పగించారని హంద్రీ–నీవా, గాలేరు–నగరి అధికారులను ప్రశ్నించింది. గురువారం హంద్రీ–నీవా పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి.. శుక్రవారం, శనివారం విజయవాడలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది. గత సర్కార్ హయాంలో చేపట్టిన ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ బుధవారం హైదరాబాద్‌లోని పోలవరం అతిథి గృహంలో సమావేశమైంది. పోలవరం కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాల పనులను పర్యవేక్షించే ఎస్ఈలు, ఈఈలు, హంద్రీ–నీవా, గాలేరు–నగరి సుజల స్రవంతి పథకాల సీఈలు, ఎస్ఈలు, ఈఈలు ఈ సమావేశానికి హాజరయ్యారు. హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల్లో అధిక శాతం పనులను పాత కాంట్రాక్టర్ల నుంచి 60–సీ నిబంధన కింద తప్పించి.. వాటి అంచనా వ్యయాన్ని పెంచేసి ముగ్గురు కాంట్రాక్టర్లకే అప్పగించడాన్ని నిపుణుల కమిటీ గుర్తించింది. హంద్రీ–నీవాలో పెంచిన అంచనా వ్యయంతో చేపట్టిన పనులను గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిర్ణయించింది. పోలవరం ఎడమ కాలువ పనుల్లో ఎనిమిది ప్యాకేజీల కాంట్రాక్టర్లను 60–సీ నిబంధన కింద తొలగించి.. కొత్త కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్ధతిలో అప్పగించడాన్ని గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అనుమతి లేకుండా నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారని నిలదీసింది. పోలవరం కుడి కాలువ పనుల్లోనూ ఇదే రీతిలో వ్యవహరించడాన్ని తప్పుబట్టింది. శుక్రవారం, శనివారం విజయవాడలో నిర్వహించే సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరుకావాలని ప్రాజెక్టుల అధికారులను కమిటీ ఆదేశించింది. -
పడక గదిలో కెమెరా.. భార్యపై అనుమానం
సాక్షి, బెంగళూరు: తాళికట్టిన భర్త అమానుష ప్రవర్తనతో విసుగెత్తిన భార్య పోలీసుల్ని ఆశ్రయించింది. అశ్లీల వెబ్సైట్లకు బానిసైన ఓ వ్యక్తి పడకగదిలో భార్యతో లైంగిక ప్రక్రియను రికార్డు చేసుకునే ఉద్దేశంతో బెడ్రూమ్లో సీసీ కెమెరా అమర్చిన ఘటన కర్ణాటకలోని సదాశివనగరలో వెలుగు చూసింది. భర్త రిత్విక్ హెగ్డే వేధింపులు భరించలేక బాధితురాలు.. భర్త, అత్తమామలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రకు చెందిన పారిశ్రామికవేత్త రిత్విక్ హెగ్డే వివాహం అనంతరం వ్యాపారరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాడు. దంపతులకు నాలుగేళ్ల కుమారుడు. అయితే రిత్విక్ హెగ్డ్ భార్యతో లైంగిక ప్రక్రియ చూడాలనే కోరికతో ఆమెకు తెలియకుండా బెడ్రూమ్లో సీసీ కెమెరా అమర్చాడు. మరోవైపు భార్య ప్రవర్తనపై అనుమానపడేవాడు. అంతేకాకుండా భార్య ఈ మెయిల్ హ్యాక్ చేసి అందులో ఆమె స్నేహితులకు అశ్లీలంగా మెసేజ్ పంపించేవాడు. దీంతో ఆమె... భర్త ప్రవర్తనను ప్రశ్నంచడంతో భౌతికంగా దాడి చేయడమే కాకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు. విసుగెత్తిన బాధితురాలు ఆదివారం పోలీసుల్ని ఆశ్రయించింది. -
‘రిత్విక్ కంపెనీపై సీబీఐ విచారణ జరిపించండి’
హైదరాబాద్: టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి లేఖ రాశారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్‌లో నిర్మించిన కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని లేఖలో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం కోటేశ్వర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పూర్తి స్థాయి విచారణ చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. -
‘రిత్విక్’పైనే విచారణ చేస్తారా!?
సాక్షి, అమరావతి : తన సంస్థ తప్పు చేస్తే.. విచారణ చేస్తారా అంటూ జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు బినామీ సీఎం రమేష్ చిందులు తొక్కినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణ నివేదికను పక్కన పెట్టి తన సంస్థకే పనులు కట్టబెట్టాలంటూ ఆయన తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈయనకు ముఖ్యనేత కూడా వత్తాసు పలకడంతో చేసేదిలేక రూ.239.03 కోట్లను ఆయన సంస్థకే కట్టబెట్టడానికి సీవోటీ (కమిషనర్ ఆఫ్ టెండర్స్) సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. తెలుగుగంగ ప్రాజెక్టు పనుల అంచనా వ్యయాన్ని రూ.4,460.64 కోట్లకు ఖరారు చేస్తూ మార్చి 20, 2007న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2009 నాటికి 95 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో అంచనా వ్యయాన్ని రూ.6,671.62 కోట్లకు పెంచేస్తూ 2018 మార్చి 9న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అడ్డగోలుగా పెంచేసిన అంచనా వ్యయంతో.. మిగిలిన పనులను బినామీ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకోవడానికి ముఖ్యనేత స్కెచ్ వేశారు. ఈ క్రమంలో తెలుగుగంగ ప్రధాన కాలువ 0.00 కి.మీ నుంచి 18.20 కి.మీ వరకూ లైనింగ్ చేయడం, 18.200 కి.మీ నుంచి 42.566 కి.మీ వరకూ గతంలో లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులు, బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ (బీసీఆర్) నుంచి వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేసే లింక్ ఛానల్ 0.00 కి.మీ నుంచి 7.380 కి.మీ వరకూ లైనింగ్ చేయకుండా మిగిలిపోయిన పనులను చేపట్టాలని నిర్ణయించారు. 2007 నాటి ఉత్తర్వుల ప్రకారం ఈ పనుల విలువ రూ.172.99 కోట్లు. కానీ.. ఈ ఏడాది మార్చి 9న జారీ చేసిన ఉత్తరులలో ఈ పనుల విలువను రూ.180.48 కోట్లుగా ఖరారు చేశారు. ఆ పనుల వ్యయాన్ని మళ్లీ పెంచాలని ముఖ్యనేత ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన అధికారులు ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.280.27 కోట్లకు పెంచేస్తూ జూన్ 8న ఉత్తర్వులు జారీచేశారు. ఈ పనులకు రూ.239.03 కోట్లను అంతర్గత విలువగా నిర్ణయించిన అధికారులు.. ముఖ్యనేత ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంస్థకు ఆ పనులు దక్కేలా రూపొందించిన నిబంధనలతో జూలై 16న ఎల్ఎస్–ఓపెన్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. 18 నెలల్లో ఈ పనుల పూర్తికి గడువు విధించారు. జూలై 31న టెక్నికల్ బిడ్‌ను తెరిచారు. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థతోపాటూ ‘స్యూ’, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రాలు బిడ్లు దాఖలు చేశాయి. రిత్విక్ అనర్హతపై స్యూ ఫిర్యాదు ఇదిలా ఉంటే.. తెలుగుగంగ ప్రధాన కాలువ లైనింగ్ పనుల టెండర్లలో టెక్నికల్ బిడ్‌ను తెరిచిన సమయంలో రిత్విక్ సంస్థ తప్పుడు అర్హత పత్రాలు సమర్పించినట్లు స్యూ సంస్థ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్, అలహాబాద్ జిల్లాల పరిధిలో బన్సాగర్ కెనాల్ ప్రాజెక్టు పనులను రిత్విక్ సంస్థ సబ్ కాంట్రాక్టర్లతో చేయించిందని.. కానీ, ఆ పనులు తానే చేసినట్లు తప్పుడు పత్రాలు సమర్పించిందని.. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని స్యూ సంస్థ ప్రతినిధులు కోరారు. కానీ, ఉన్నత స్థాయి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఆగస్టు 6న ప్రైస్ బిడ్ తెరిచారు. 2.88 శాతం అధిక ధర(ఎక్సెస్)కు రిత్విక్ (ఎల్–1), 3.61 శాతం ఎక్సెస్‌కు స్యూ (ఎల్–2), 4.31 శాతం ఎక్సెస్‌కు హెచ్‌ఈఎస్ (ఎల్–3) సంస్థలు బిడ్లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఎల్–1గా నిలిచిన రిత్విక్ సంస్థకు పనులు అప్పగించాలని సీవోటీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. నాపైనే విచారణకు ఆదేశిస్తారా? స్యూ సంస్థ ఫిర్యాదుతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులను సీవోటీ ఆదేశించారు. దీంతో సీఎం రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన సంస్థపైనే విచారణకు ఆదేశిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే టెండర్లు ఆమోదించి తన సంస్థకు పనులు అప్పగించాలంటూ ఒత్తిడి తెచ్చారు. కానీ, ఆ ఒత్తిళ్లకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తలొగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం నేరుగా జలవనరుల శాఖ ఉన్నతాధికారుల వద్దకు చేరుకుని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారాన్ని ముఖ్యనేత దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కూడా జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై మండిపడినట్లు చెబుతున్నారు. దాంతో చేసేదిలేక విచారణ నివేదికను పక్కన పెట్టి సీఎం రమేష్ సంస్థకు పనులు కట్టబెట్టేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. -
సీఎం రమేష్..గోబెల్స్‌కే కొత్త పాఠాలు
సాక్షి, అమరావతి: పచ్చి అబద్ధాలను పదేపదే వల్లె వేసి అక్రమాలను కప్పిపుచ్చుకోవచ్చా? అవాస్తవాలు చెప్పి వాస్తవాలను దాచేయొచ్చా? మీడియా ముందు రంకెలు వేస్తే దొంగ దొర అవుతాడా? ముఖ్యమంత్రి చంద్రబాబు దన్నుతో సారా వ్యాపారిగా జీవితం ప్రారంభించి, కాంట్రాక్టర్‌గా రూపాంతరం చెంది, రాజకీయ నేతగా రంగు మార్చుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యవ హారశైలి చూస్తే అలానే ఉంది. సీఎం రమేష్ కుటుంబానికి చెందిన కాంట్రాక్టు, వ్యాపార సంస్థల్లో ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) అధికారులు మూడు రోజులపాటు సోదాలు చేశారు. కీలక పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. ఐటీ సోదాలు పూర్తయిన తర్వాత సీఎం రమేష్ ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తన అక్రమాలను కప్పిప్చుకోవడానికి అబద్ధాలు వల్లె వేశారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. కనికట్టు చేసేందుకు ప్రయత్నించారు. అబద్ధాలు చెప్పడంలో గోబెల్స్‌కే కొత్త పాఠాలు నేర్పుతున్నారు. మీడియా సమావేశంలో సీఎం రమేష్ అబద్ధాలతో చేసిన రుబాబు.. వాస్తవాలు ఇవీ... సీఎం రమేష్: 1998లోనే రిత్విక్ ప్రాజెక్టస్‌ను ప్రారంభించా. అప్పట్లోనే టెండర్లలో రూ.90 కోట్ల విలువైన అవుకు రిజర్వాయర్ పనులు దక్కించుకున్నా. వాస్తవం: రిత్విక్ ప్రాజెక్ట్స్‌ను 1999లో ప్రారంభించారు. కావాలంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ వెబ్సైట్ చూసుకోవచ్చు. సీఎం రమేష్ చెప్పినట్టు 1998లో ప్రారంభించిన సంస్థకు.. పనులు చేసిన అనుభవం ఉండదు. అంటే టెండర్లలో పాల్గొనే అవకాశం లేదు. కానీ, చంద్రబాబు అండతో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అవుకు రిజర్వాయర్ పనులు దక్కించుకున్న రిత్విక్ ప్రాజెక్ట్స్.. రెండేళ్లలో పూర్తి చేయాల్సిన ఆ రిజర్వాయర్ పనులను 2004 దాకా చేస్తూనే ఉంది. పనులు నాసిరకంగా చేయడం వల్ల రిజర్వాయర్ మట్టికట్టకు పలుమార్లు గండ్లు పడ్డాయి. దాంతో 2004లో ఈ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచుతూ మళ్లీ కొత్తగా పనులు చేయాల్సి వచ్చిందన్న విషయం వాస్తవం కదా? సీఎం రమేష్: అంచనా వ్యయం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉండే పనులను నామినేషన్‌పై ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు. నేను నామినేషన్‌పై ఒక్క పని కూడా తీసుకోలేదు. నామినేషన్‌పై ప్రాజెక్టుల పనులు తీసుకున్నానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం. వాస్తవం: 2004 నుంచి 2014 వరకూ రూ.5 లక్షలలోపు విలువైన పనులను మాత్రమే.. అదీ అత్యవసరంగా చేపట్టాల్సిన పనులనే నామినేషన్ విధానంలో కాంట్రాక్టర్లకు అప్పగించే సాంప్రదాయం రాష్ట్రంలో ఉండేది. కానీ, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 నుంచి నిబంధనలను తుంగలో తొక్కారు. రూ.వందల కోట్ల విలువైన పనులను సైతం నామినేషన్ విధానంలో కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారు. నీరు–చెట్టు కింద ఇప్పటిదాకా చేసిన రూ.15,386 కోట్ల విలువైన పనుల్లో 95 శాతం పనులను నామినేషన్‌పైనే జన్మభూమి కమిటీల ముసుగులో టీడీపీ నేతలకు కట్టబెట్టారు. పోలవరం ప్రాజెక్టులో రూ.1,292 కోట్ల విలువైన పనిని నవయుగ సంస్థకు అప్పగించారు. హంద్రీ–నీవా ప్రాజెక్టులో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను టెండర్లలో ఆర్కే–హెచ్‌ఈఎస్–కోయా(జేవీ) సంస్థ రూ.430 కోట్లకు దక్కించుకుంది. నిబంధనల ప్రకారం టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేసేటప్పుడే సబ్ కాంట్రాక్టర్ల వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ, అప్పట్లో ఇవ్వలేదు. ప్రస్తుతం ఆ పనులను రిత్విక్ ప్రాజెక్ట్స్ చేస్తోంది. కావాలంటే రిత్విక్ ప్రాజెక్ట్స్ వెబ్సైట్ చూసుకోవచ్చు. ఆ పనులు సీఎం రమేష్ చేతికి ఎలా దక్కాయి? దొడ్డిదారిన కాదా? ఇవే పనులకు ఇటీవల కేబినెట్లో తీర్మానం చేసి మరీ అదనంగా రూ.122.75 కోట్ల బిల్లులు ఇప్పించుకున్న ఘనత సీఎం రమేష్‌కే దక్కింది. హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులలో భారీ ఎత్తున పనులను ఇదే రీతిన దక్కించుకోవడం వాస్తవం కాదా? సీఎం రమేష్: నేను ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్టు పనులు చేయకూడదా? 2014కు ముందు కూడా నేను భారీ ఎత్తున పనులు చేశా. 2014 తర్వాత కేవలం రూ.2,000 కోట్ల విలువైన పనులను.. అదీ టెండర్ల ద్వారా పారదర్శకంగా దక్కించుకున్నా. వాస్తవం: 2014 వరకూ సీఎం రమేష్ సంస్థ టెండర్లలో పాల్గొన్న దాఖలాలు లేవు. హంద్రీ–నీవాలో 23, 32 ప్యాకేజీలను బ్యాక్‌బోన్ కన్స్ట్రక్షన్స్ను ముందు పెట్టి.. 33వ ప్యాకేజీ పనులను ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్(ఇండియా)ను ముందు పెట్టి దక్కించుకుని.. వాటిని సబ్ కాంట్రాక్టు కింద చేశారు. 23, 33వ ప్యాకేజీల్లో పనులు చేయకున్నా చేసినట్లు చూపి రూ.9.87 కోట్లకుపైగా అధికంగా బిల్లులు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సీఈ, ఎస్ఈ, ఈఈలపై సర్కార్ సస్పెన్షన్ వేటు వేయడం నిజం కాదా? సీఎం రమేష్ చేసిన పాపాలకు బ్యాక్‌బోన్ కన్స్ట్రక్షన్స్ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన మాట వాస్తవం కాదా? 2014 వరకూ సీఎం రమేష్ సబ్ కాంట్రాక్టర్‌గానే వ్యవహరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పుడు అర్హత ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, టెండర్లలో పనులు దక్కించుకున్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణ పనుల దగ్గర నుంచి తెలుగుగంగ లైనింగ్ పనుల టెండర్ల వరకూ ఇదే కథ. సీఎం చంద్రబాబు అండదండలతో అక్రమంగా పనులు దక్కించుకున్న మాట వాస్తవం కాదా? వెలిగొండ రెండో టన్నెల్ పనులు కేవలం సీఎం రమేష్‌కు దక్కవనే నెపంతోనే రద్దు చేసి.. రెండోసారి టెండర్లు నిర్వహించి రూ.299 కోట్ల విలువైన పనులను రూ.597.34 కోట్లకు చేజిక్కించుకోవడం నిజం కాదా? సీఎం చంద్రబాబును అడ్డం పెట్టుకుని గత నాలుగున్నరేళ్లలో రూ.3,596.15 కోట్ల విలువైన పనులను దక్కించుకోవడం వాస్తవం కాదా? సీఎం రమేష్: కాంట్రాక్టు పనుల్లో రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడడం లేదు. అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నాం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నా వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలు చేశారు. వాస్తవం: కేవలం అంచనా వ్యయం పెంచడం ద్వారానే గత నాలుగున్నరేళ్లలో రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు రూ.1,544.83 కోట్ల ప్రయోజనాన్ని ప్రభుత్వం చేకూర్చింది. అంటే తక్కువ పనులు చేసి ఎక్కువ లాభం పొందారన్న మాట. ఇది అక్రమం కాదా? నెలనెలా చెల్లించాల్సిన వస్తు సేవల పన్నును(జీఎస్టీ)ని రిత్విక్ ప్రాజెక్ట్స్ చెల్లించడం లేదని కమర్షియల్ ట్యాక్స్ అధికారులే చెబుతున్నారు. ఆదాయపు పన్ను ఎప్పటికప్పుడు సక్రమంగా చెల్లిస్తున్నప్పుడు ఐటీ అధికారులు సోదాలు చేస్తే మీకు ఎందుకంత ఉలికిపాటు? -
సీఎం రమేష్‌కు ఐటీ దెబ్బ..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఆర్పీపీఎల్) కంపెనీ లీలలు జిల్లాలోనూ కొనసాగుతున్నాయి. రమేష్ కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలో హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ప్రధాన కాలువ విస్తరణ పనుల్లో రిత్విక్ వ్యవహారంపైనా చర్చ సాగుతోంది. ఈ పనులను తప్పుడు పత్రాలతో దక్కించుకోవడమే కాకుండా.. చేయకపోయినప్పటికీ నిధులు కొల్లగొట్టింది. కంపెనీకి విధించిన గడువు ముగిసినప్పటికీ కనీసం నోటీసులు ఇచ్చేందుకు సైతం అధికారులు సాహసించడం లేదు. ఈ వ్యవహారంపై అప్పట్లోనే కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. వాస్తవానికి హంద్రీ– నీవా ప్రధాన కాలువ విస్తరణ పనులను తప్పుడు పత్రాలతో రిత్విక్ సంస్థ దక్కించుకుంది. పైగా ఏడాది కాలంగా పనులు చేపట్టడం లేదు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూన్ నాటికే పూర్తి చేయాలి. అయినా ఇప్పటికీ పూర్తి చేయలేదు. పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించకూడదన్న నిబంధన సైతం పక్కన పెట్టింది. సగం సగం చేసిన పనులను వారికి అప్పగించింది. సదరు సబ్ కాంట్రాక్టర్లు కూడా ప్రస్తుతం పనులు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న రిత్విక్ సంస్థ.. సబ్ కాంట్రాక్టర్లు చేసిన పనులకు మాత్రం బిల్లులు ఇవ్వడం లేదు. టెండర్ దశలోనే రింగు కావడమే కాకుండా ఇతర కంపెనీలపై అనర్హత వేటు వేయించి.. అధిక ధరకు ఈ పనులను దక్కించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ నివేదిక రూపొందించింది. తాజా ఐటీ దాడుల నేపథ్యంలో రిత్విక్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. దోపిడీ జరిగిందిలా.. హంద్రీ –నీవా ప్రధాన కాలువను 11 నుంచి 20 మీటర్ల మేర వెడల్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.831.09 కోట్లతో అంచనాలు రూపొందించింది. టెండర్లో పాల్గొనే కంపెనీ ఇదే తరహా కాలువ వెడల్పు పనులను ఏడాదిలో రూ.328.75 కోట్ల విలువైనవి లేదా మూడు నెలల కాలంలో రూ.82.18 కోట్ల విలువైనవి ప్రధాన కాంట్రాక్టర్‌గా చేసి ఉండాలని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే.. ఇందుకు భిన్నంగా సబ్ కాంట్రాక్టర్‌గా పనులు చేసిన రిత్విక్ సంస్థను టెండర్లో పాల్గొనేందుకు అనుమతించడమే కాకుండా ఏకంగా అధిక ధరకు కట్టబెట్టారు. పోటీగా నిలబడి తక్కువ ధరనే కోట్ చేసినప్పటికీ..సాంకేతిక కారణాలను సాకుగా చూపి ఐవీఆర్సీఎల్, ప్రసాద్‌లను పక్కకు తప్పించారు. మొత్తం మూడు ప్యాకేజీలుగా పిలిచిన ఈ పనుల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మూడు కంపెనీలకు చెరో ప్యాకేజీ అప్పగించారు. అయితే, రిత్విక్ కంపెనీ సమర్పించిన మొత్తం డాక్యుమెంట్లపై కేంద్ర నిఘా వర్గాలు కీలక సమాచారాన్ని సేకరించాయి. అర్హత ఉందంటూ ఛత్తీస్‌గఢ్ నుంచి రిత్విక్ తెచ్చిన వివరాలు సరైనవి కావని కూడా తేల్చాయి. రెండో ప్యాకేజీ పనుల్లో... వాస్తవానికి హంద్రీ–నీవా ప్రధాన కాలువ విస్తరణ పనులను మొదట్లో 14 ప్యాకేజీలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత తమఅనుకూల కంపెనీలకే దక్కేలా మూడు ప్యాకేజీలుగా విడగొట్టింది. ఇందులో కర్నూలు జిల్లాలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి. ప్రధాన కాలువ –1.150 కిలోమీటర్ నుంచి 78.60 కిలోమీటర్ల వరకు రూ.326.75 కోట్లతో ఒక ప్యాకేజీగా, 79.75 కిలోమీటర్ల నుంచి 134.27 కిలోమీటర్ల వరకు రూ.224.42 కోట్లతో రెండో ప్యాకేజీగా విభజించారు. ఇక మిగిలింది అనంతపురం జిల్లాలో 134 కిలోమీటర్ల నుంచి 216.3 కిలోమీటర్ల వరకు రూ.279.92 కోట్లతో మూడో ప్యాకేజీగా విభజించారు. ఈ మూడు ప్యాకేజీ పనులను ఒక్కో కంపెనీకి అప్పగించారు. ఇందులో రెండో ప్యాకేజీ పనులను రిత్విక్ కంపెనీ చేపట్టింది. మొబిలైజేషన్ అడ్వాన్సు తీసుకుని పనులు చేయకుండానే ఆ సంస్థ చెక్కేసింది. ఐటీ దాడుల నేపథ్యంలో ఈ వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సీఎం రమేష్ సంస్థల్లో ఐటీ సోదాలు
సాక్షి, అమరావతి, హైదరాబాద్, సాక్షి ప్రతినిధి కడప: ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకుంట మునుస్వామి రమేష్ (సీఎం రమేష్)కు చెందిన కంపెనీలు, పలుచోట్ల ఉన్న ఇళ్లు, కార్యాలయాలలో ఆదాయ పుపన్ను శాఖ అధికారులు శుక్రవారం విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల సమయంలో సుమారు 90 నుంచి 100 మంది ఐటీ అధికారులు సీఎం రమేష్‌కు చెందిన హైదరాబాద్, వైఎస్సార్ జిల్లా పోట్లదుర్తిలో ఉన్న ఇళ్లతో పాటు రిత్విక్ ప్రాపర్టీస్, అనుబంధ కంపెనీల్లో సోదాలు జరిపారు. ఇంజనీరింగ్ కాంట్రాక్టులు, మైనింగ్ విద్యుత్తు తదితర రంగాల్లో ఉన్న సీఎం రమేష్ వ్యాపార సామ్రాజ్యం గత మూడేళ్లలో అనూహ్యంగా పెరిగింది. అయితే దానికి తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు పెరగకపోవడం, ఖాతాల నుంచి నగదు రూపంలో లావాదేవీలు భారీగా జరుగుతుండటం ఐటీ సోదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో రాత్రిదాకా సోదాలు... విచారించేందుకు సిద్ధమవుతున్న అధికారులు! హైదరాబాద్ సాగర్ సొసైటీలోని రమేష్ కన్స్ట్రక్షన్, విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహించే రిత్విక్ కంపెనీ, జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో 16 మంది అధికారులతో కూడిన బృందం సోదాలు జరిపింది. 2014కి ముందు ఆయన దాఖలు చేసిన ఐటీ రిటర్నులు, ఆ తర్వాత దాఖలు చేస్తూ వస్తున్న వివరాల్లో భారీ వ్యత్యాసాలున్నట్లు ఈ సందర్భంగా గుర్తించారని తెలిసింది. సీఎం రమేష్ మొదటిసారి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్, రెండోసారి నామినేట్ అయిన సందర్భంలో దాఖలు చేసిన అఫిడవిట్లోనూ భారీ తేడాలున్నట్లు అధికారులు గుర్తించారు. నాలుగేళ్లలో రూ.వందల కోట్ల మేర ఆస్తులు పెరిగిపోవడం, వాటికి సంబంధించి చెల్లించాల్సిన ఐటీలో తేడా ఉండటంపై అధికారులు సీఎం రమేశ్‌ను విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రమేశ్ కంపెనీలకు ఇటీవల ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రాజెక్టుల టెండర్లు, వాటి ద్వారా వచ్చిన లాభాలకు సంబంధించిన లెక్కల్లోనూ భారీగా తేడాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని లావాదేవీలు, నిర్మాణ రంగం, పవర్ ప్రాజెక్టులు దక్కించుకున్న అంశాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రిత్విక్ సంస్థ నుంచి 8 హార్డ్‌డిస్క్‌లు, 18 పెన్‌డ్రైవ్‌లు, 6 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 3 సూటుకేసుల్లో కీలక పత్రాలు వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని సీఎం రమేష్ ఇంటికి ఉదయమే చేరుకున్న తిరుపతి ఆదాయపు పన్నుశాఖ అధికారులు ఎంపీ ఢిల్లీలో ఉండడంతో ఆయన సోదరుడు సురేష్‌నాయుడి సమక్షంలో సోదాలకు ఉపక్రమించారు. ఎంపీ సోదరులు సురేష్, రాజేష్, ప్రకాష్ ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. ప్రొద్దుటూరులో ఉంటున్న రమేష్ సమీప బంధువు గోవర్ధన్‌నాయుడు ఇంట్లో కూడా తనిఖీలు కొనసాగించారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు వాటి జాబితాను సురేష్‌నాయుడుకు అందచేసి మూడు సూట్‌కేసులతో సాయంత్రం 5.30 గంటలకు వెనుతిరిగారు. అత్యధిక చెల్లింపులు నగదు రూపంలోనే 2013–14లో రూ.55,349.26 కోట్లుగా ఉన్న రిత్విక్ ప్రాపర్టీస్ ఆదాయం రెండేళ్లలో అంటే 2016–17 నాటికి ఏకంగా 145 శాతం పెరిగి రూ.1,35,720.78 కోట్లకు చేరుకుంది. మరోవైపు 2017–18కి సంబంధించి ఐటీ రిటర్నులు ఇంకా సమర్పించలేదని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) సమాచారం ద్వారా వెల్లడవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దక్కించుకున్న రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు సంబంధించి చెల్లింపులు జరగగానే అధిక భాగం నగదు రూపంలో తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీనిపై హైదరాబాద్ సాగర్ సొసైటీలోని అలహాబాద్ బ్యాంక్ అధికారులను ఆరా తీసిన ఐటీ అధికారులు బ్యాంకు మేనేజర్ నుంచి సాక్షి సంతకాలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే ఐటీ అధికారులు తనిఖీలకు దిగినట్లు భావిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. పలు లావాదేవీలకు సంబంధించిన విలువైన పత్రాలు, హార్డ్ డిస్క్‌లను ఐటీ అధికారులు సీజ్ చేసి సూట్‌కేసుల్లో తరలించారు. పుట్టగొడుగుల్లా కంపెనీలు... సీఎం రమేష్, ఆయన సోదరుడి పేరు మీద 10కి పైగా ప్రధాన కంపెనీలతో పాటు పలు డొల్ల కంపెనీలు ఉన్నట్లు తేలింది. వీటిలో కొన్ని కంపెనీలు రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రారంభం కావడం గమనార్హం. రిత్విక్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోబల్ ఎర్త్ మినరల్స్, ల్యాండ్ మార్క్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ అండ్ హోమ్స్, రిత్విక్ హోల్డింగ్స్, అంజనాద్రి పవర్, కడప పవర్, నారాయణాద్రి గ్రీన్ ఎనర్జీ, కదిరి గ్రీన్ పవర్, రిత్విక్ గ్రీన్ పవర్‌లతోపాటు మరికొన్ని డొల్ల కంపెనీలు ఉన్నట్లు బయటపడింది. వీటిలో కడప, అంజనాద్రి, నారాయణాద్రి, కదిరి గ్రీన్ పవర్ కంపెనీలు రెండు మూడేళ్ల క్రితమే ఏర్పాటయ్యాయి. షెల్ కంపెనీల్లోకి నిధుల మళ్లింపు? రిత్విక్ ప్రాజెక్టస్ ద్వారా వచ్చిన నిధులను సీఎం రమేష్ గొలుసుకట్టు కంపెనీలలోకి మళ్లించడం ద్వారా భారీ మొత్తాలను బయటకు తరలించినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా దృష్టి సారించి దర్యాప్తు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆంతరంగికుల్లో ఒకరైన సీఎం రమేష్ ఆదాయం అనూహ్యంగా పెరగడంపై వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 2009లోనే కోర్టు తలుపులు తట్టారు. 2003లో రూ.61 కోట్లుగా ఉన్న రమేష్ కంపెనీ ఆదాయం 2009 నాటికి రూ.488 కోట్లకు పెరిగిందని, ఓ చిన్న సబ్‌కాంట్రాక్టరుకు ఈ స్థాయిలో వ్యాపారం పెరగడం అసాధారణమని, దీనిపై దర్యాప్తు జరిపించాలంటూ హైకోర్టును ఆమె గతంలో ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సోదాలకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణుల నిరసన.... సీఎం రమేష్ ఇంట్లో ఐటీ సోదాలపై టీడీపీ శ్రేణులు పోట్లదుర్తిలో నిరసన తెలిపాయి. శాసనమండలిలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తదితరులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సోదాల వెనుక కేంద్రం ప్రమేయం: సీఎం రమేష్ సాక్షి, న్యూఢిల్లీ: తన ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న ఐటీ సోదాల వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున తనపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేయిస్తున్నారని శుక్రవారం ఢిల్లీలోని మీడియాతో పేర్కొన్నారు. తాను ఇంట్లో లేని సమయాన్ని చూసి ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారని, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని, తన సంస్థల ద్వారా వస్తున్న ఆదాయానికి క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నట్టు చెప్పారు. సోదాల సందర్భంగా ఐటీ అధికారులు తెలంగాణ ప్రభుత్వ అధికారులను మధ్యవర్తులుగా తీసుకురావడాన్ని ఆయన తప్పుబట్టారు. -
రిత్విక్‌కు డబుల్
సాక్షి, హైదరాబాద్ : కెన్యాలో జరిగిన గ్రేడ్–4 టెన్నిస్ టోర్నమెంట్లో నగరానికి చెందిన రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ సాధించాడు. సింగిల్స్ ఫైనల్లో రిత్విక్ 7–5, 6–1తో అబ్దుల్ షకూర్ (బురుండి)పై గెలుపొందాడు. అంతకుముందు సెమీస్‌లో 6–1, 6–3తో జ్యాన్ అహ్మద్ (గ్రేట్ బ్రిటన్)పై; క్వార్టర్స్‌లో 6–4, 6–1తో లూకా అలేసియో అంటునెస్ (ఆస్ట్రేలియా)పై విజయాలు సాధించాడు. డబుల్స్ ఫైనల్లో రిత్విక్–జ్యాన్ అహ్మద్ (గ్రేట్ బ్రిటన్) జోడీ 6–1, 6–2తో నిఖిల్ నిరంజన్ (అమెరికా)–అమన్ పటేల్ (భారత్) జంటపై గెలుపొందింది. -
రిత్విక్ ‘డబుల్’ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–4 టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు రిత్విక్ చౌదరి బొల్లిపల్లి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ టోర్నీలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. బాలుర సింగిల్స్ ఫైనల్లో రిత్విక్ 4–6, 6–2, 6–0తో అబ్దుల్ షకుర్ కబురా (బురుండి)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌లో 6–3, 6–0తో గిలియన్ ఓస్మోంట్ (ఫ్రాన్స్)పై, క్వార్టర్స్‌లో 6–3, 6–0తో అలీ హబిద్ (గ్రేట్ బ్రిటన్)పై విజయం సాధిం చాడు. మరోవైపు బాలుర డబుల్స్ టైటిల్‌పోరులో టాప్ సీడ్ రిత్విక్ (భారత్)–యాన్ అహ్మద్ (గ్రేట్ బ్రిటన్) జంట 6–1, 6–4తో అబ్దుల్ (బురుండి)–ర్యాన్ అటెటొ ర్యాండిక్ (కెన్యా) జోడీపై గెలిచి విజేతగా నిలిచింది. -
రిత్విక్ జోడీకి టైటిల్
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరి డబుల్స్‌లో టైటిల్ చేజిక్కించుకున్నాడు. బాలికల డబుల్స్‌లో సృజన రాయరాల– ముష్రత్ అంజుమ్ షేక్ జంట విజేతగా నిలిచింది. అండర్–16 బాలుర డబుల్స్ తుదిపోరులో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన రిత్విక్ చౌదరి (తెలంగాణ)–జావియా దేవ్ (గుజరాత్) ద్వయం 6–3, 6–4తో సార్థక్ సుదెన్ (ఢిల్లీ)–ధ్రువ్ తంగ్రి (పంజాబ్) జంటపై గెలిచింది. అండర్–14 బాలికల డబుల్స్ టైటిల్ పోరులో రెండో సీడ్ అంజుమ్ షేక్–సృజన జోడి 6–2, 6–1తో రుతూజ (మహారాష్ట్ర)–నయిషా (కర్ణాటక) జంటపై విజయం సాధించింది. -
చాంపియన్ రిత్విక్ జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు కుర్రాడు రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సత్తా చాటాడు. నైరోబి జూనియర్ ఓపెన్ 2, గ్రేడ్–5 టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో రిత్విక్ జోడీ విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రిత్విక్ (భారత్)–షేలి కొటేచా (కెన్యా) ద్వయం 6–2, 6–2తో అబ్దుల్లా అల్ బర్వాణి – అర్జున్ మరియప్ప (అమెరికా) జోడీపై గెలుపొందింది. సింగిల్స్ విభాగంలో రిత్విక్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. క్వార్టర్స్‌లో 3–6, 2–6తో పాబ్లో స్కెల్చర్ (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. గతవారమే రిత్విక్ నైరోబి జూనియర్ ఓపెన్–1 డబుల్స్ టైటిల్‌నూ గెలుచుకున్నాడు. -
విజేత రిత్విక్ జంట
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) నైరోబి జూనియర్ ఓపెన్–1 టెన్నిస్ టోర్నమెంట్లో నగరానికి చెందిన రిత్విక్ చౌదరి బొల్లిపల్లి సత్తాచాటాడు. కెన్యాలో జరిగిన ఈ టోర్నీలో బాలుర డబుల్స్ విభాగంలో రిత్విక్ జంట విజేతగా నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో రిత్విక్ (భారత్)–షేల్ కొటెచా (కెన్యా) ద్వయం 6–4, 6–2తో డెన్నిస్ మోసెస్ (జింబాబ్వే)– చానోన్ హున్సావత్ (థాయ్‌లాండ్) జంటపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో రిత్విక్ క్వార్టర్స్‌లోనే వెనుదిరిగాడు. క్వార్టర్ ఫైనల్లో రిత్విక్ 2–6, 1–6తో స్కెల్చర్ మురో (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
రిత్విక్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఈస్ట్ ఆఫ్రికా జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ సత్తా చాటాడు. బాలుర డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. ఫైనల్లో రిత్విక్ చౌదరీ (భారత్)- మాథ్యూ బెచర్ (గ్రేట్ బ్రిటన్) జోడీ 7-6 (7/4), 5-7, 10-2తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ కెవిన్ చెరియట్-షేల్ కొటెచా (కెన్యా) జంటపై సంచలన విజయం సాధించి విజేతగా నిలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన రిత్విక్ జంట రెండో రౌండ్లో 7-5, 6-3తో నియిజెనా (రువాండా)-మొహమ్మద్ ఒమర్ (బురుండి) ద్వయంపై... క్వార్టర్ ఫైనల్లో 3-6, 6-3, 11-9తో జంకోవియాక్-మార్సిన్ (పోలాండ్) జంటపై, సెమీఫైనల్లో 6-3, 4-6, 11-9తో దేవ్ జవియా-కరణ్ శ్రీవాస్తవ (భారత్) జోడీపై గెలిచింది. -
ఒలింపిక్స్ ప్రాబబుల్స్‌లో చోటు
హిందూపురం టౌన్ : హిందూపురం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న వి.రిత్విక్ జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి ఒలింపిక్స్ ప్రాబబుల్స్‌లో స్థానం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మేరి, కోచ్ రామచంద్రలు సోమవారం తెలిపారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రిత్విక్ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతిని సాధించి సినీనటుడు సుమన్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. అదే విధంగా త్వరలో ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు అర్హత సాధించాడని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్, కోచ్‌తో పాటు ఎఓ ప్రభాకర్‌రెడ్డి, డీన్ నాగరాజు, తల్లిదండ్రులు వెంకటేష్, అరుణలు అభినందించారు. -
ఫలక్, రిత్విక్‌లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫలక్, రిత్విక్‌లు టైటిల్స్‌ను కై వసం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో క్యాడెట్ బాలికల ఫైనల్లో ఫలక్ (జీఎస్ఎం) 7-11, 7-11, 11-4, 11-9, 12-10తో ఫాతిమా (స్టాగ్ అకాడమీ)పై గెలుపొందగా... బాలుర విభాగంలో రిత్విక్ (స్టాగ్ అకాడమీ) 11-9, 11-3, 9-11, 11-9తో రాజు (ఏడబ్ల్యూఏ)పై విజయం సాధించారు. జూనియర్ బాలబాలికల ఫైనల్లో సరోజ్ సిరిల్ (జీటీటీఏ) 7-11, 11-8, 11-4, 11-9, 11-4తో అరవింద్ (ఏడబ్ల్యూ)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 9-11, 11-6, 11-9, 7-11, 11-6, 8-11, 11-1తో ప్రణీత (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. సబ్ జూనియర్ బాలుర ఫైనల్లో వరుణ్ శంకర్ (జీటీటీఏ) 11-8, 11-7, 9-11, 11-5, 8-11, 11-5తో సారుు వెంకట ధనుష్ (ఏడబ్ల్యూఏ)పై, బాలికల ఆయుషి (జీఎస్ఎం) 11-5, 11-4, 11-2, 11-5తో అంజలి (జీఎస్ఎం)పై విజయం సాధించారు. యూత్ బాలికల ఫైనల్లో ప్రణీత (హెచ్‌వీఎస్) 9-11, 4-11, 11-6, 11-8, 11-9, 11-7తో సస్య (ఏడబ్ల్యూఏ)పై... బాలుర ఫైనల్లో సరోజ్ సిరిల్ (జీటీటీఏ) 11-7, 8-11, 4-11, 11-4, 11-3, 11-3తో హర్ష్ లహోటి (హెచ్‌వీఎస్)పై నెగ్గారు. -
పలక్, రిత్విక్‌లకు టైటిల్స్
స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: డాక్టర్ బోడెపూడి శ్రీకాంత్ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పలక్, రిత్విక్ విజేతలుగా నిలిచారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం క్యాడెట్ బాలికల విభాగంలో జరిగిన ఫైనల్లో జి. పలక్ (జీఎస్ఎం) 9-11, 11-5, 5-11, 11-5, 11-9తో ఆశ్లేష సింగ్ (ఏడబ్ల్యూఏ)పై గెలుపొందగా... బాలుర విభాగంలో స్టాగ్ అకాడమీకి చెందిన రిత్విక్ 13-15, 11-5, 5-11, 11-4, 11-5తో త్రిశూల్ మెహ్రా (ఎల్బీఎస్)ను ఓడించి టైటిల్స్‌ను దక్కించుకున్నారు. అంతకు ముందు జరిగిన బాలికల సెమీస్‌లో పలక్ 6-11, 11-7, 14-12, 11-7తో పూజ (ఏడబ్ల్యూఏ)పై, ఆశ్లేష సింగ్ 11-8, 11-7, 11-5తో ప్రియాంక రాజ్ (హెచ్‌వీఎస్)పై విజయం సాధించారు. బాలుర సెమీస్‌లో త్రిశూల్ 7-11, 12-10, 11-6, 11-1తో వేణు మాధవ్ (జీఎస్ఎం)పై, రిత్విక్ 11-7, 11-6, 11-6తో కుషాల్ (జీటీటీఏ)పై నెగ్గారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో ఆయుషి (జీఎస్ఎం) 11-7, 11-3, 11-9, 11-2తో కీర్తన (హెచ్‌వీఎస్)పై నెగ్గి విజేతగా నిలిచింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు జూనియర్ బాలుర ప్రిక్వార్టర్స్: స్నేహిత్ (జీటీటీఏ 11-2, 11-5, 11-9, 11-5తో గోవింద్ (స్టాగ్ అకాడమీ)పై, సారుు (జీఎస్ఎం) 11-5, 11-9, 9-11, 11-9, 11-6తో వెంకట ధనుష్ (ఏడబ్ల్యూఏ)పై, అరవింద్ (ఏడబ్ల్యూఏ) 11-5, 11-7, 11-2, 11-8తో రఘురాం (నల్గొండ)పై, హరికృష్ణ (జీటీటీఏ) 11-9, 11-8, 11-6, 11-4తో అనూప్ అమర (స్టాగ్ అకాడమీ)పై, అలీ మొహమ్మద్ (స్టాగ్ అకాడమీ) 12-10, 11-2, 11-7, 11-9తో రుత్విక్ (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. జూనియర్ బాలికల క్వార్టర్స్: నైనా (ఎల్బీఎస్) 11-8, 13-11, 11-7, 8-11, 10-12, 11-9తో ఆయుషి (జీఎస్ఎం)పై, ప్రణీత (హెచ్‌వీఎస్) 5-11, 11-5, 11-3, 8-11, 11-5, 11-8తో అంజలి (జీఎస్ఎం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 11-3, 8-11, 8-11, 6-11, 11-7, 11-8, 11-4తో భవిత (జీఎస్ఎం)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 11-8, 11-7, 11-7, 11-5తో దేవయాని (జీఎస్ఎం)పై విజయం సాధించారు. మహిళల రెండో రౌండ్: మౌనిక (జీఎస్ఎం) 11-6, 11-3, 7-11, 11-4, 11-8తో గాయత్రి (హెచ్‌వీఎస్)పై, నిఖత్ బాను (జీఎస్ఎం) 11-5, 11-6, 11-4, 11-7తో రచన (జీఎస్ఎం)పై, ఆకుల శ్రీజ (జీటీటీఏ) 11-1, 11-4, 11-2, 11-2తో నవ్య (ఖమ్మం)పై, సస్య (ఏడబ్ల్యూఏ) 11-1, 11-3, 11-5, 11-8తో హనీఫ (స్టాగ్ అకాడమీ)పై, లాస్య (11-5, 11-4, 11-7, 11-7తో పలక్ షా (స్టాగ్ అకాడమీ)పై నెగ్గారు. సబ్ జూనియర్ బాలుర క్వార్టర్స్: వరుణ్ (జీటీటీఏ) 7-11, 12-10, 11-7, 11-8, 11-8తో విశాల్ (జీఎస్ఎం)పై, కేశవన్ కన్నన్ (జీటీటీఏ) 7-11, 11-9, 7-11, 11-5, 8-11, 11-4, 11-4తో అద్వైత్ (ఏడబ్ల్యూఏ)పై, ధనుష్ (ఏడబ్ల్యూఏ) 11-8, 11-9, 11-6, 11-13,11-9తో రితేశ్ థామస్ (జీటీటీఏ)పై కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 11-4, 9-11, 11-7, 7-11, 11-4, 11-8తో సారుునాథ్ రెడ్డి (హెచ్‌వీఎస్)పై గెలుపొందారు. యూత్ బాలుర ప్రిక్వార్టర్స్: స్నేహిత్ (జీటీటీఏ) 11-7, 11-4, 11-6, 11-3తో అభయ్ (ఏడబ్ల్యూఏ)పై, హర్ష్ లహోటి (హెచ్‌వీఎస్) 13-11, 11-7, 11-9, 11-9తో సౌరభ్ (జీఎస్ఎం)పై, పీయూష్ (స్టాగ్ అకాడమీ) 11-9, 12-10, 11-5, 8-11, 7-11, 7-11, 12-10తో అలీ మొహమ్మద్ (స్టాగ్ అకాడమీ)పై విజయం సాధించారు.