వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి(పాత చిత్రం)
హైదరాబాద్: టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి లేఖ రాశారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉత్తరాఖండ్‌లో నిర్మించిన కోటేశ్వర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని లేఖలో పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం కోటేశ్వర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు పూర్తి స్థాయి విచారణ చేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment