
సాక్షి, విశాఖపట్నం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చెయ్యడం కోసం ఏదైనా చేస్తానని అన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎన్నికల్లో పోటీలో ఎవరున్నారని పేదవాడికి కనిపించేంది సీఎం జగన్ మాత్రమేనని తెలిపారు. తమకు మంచి చేసిన వైఎస్ జగన్‌కే మళ్లీ ఓటువేసి గెలిపించాలని పేదవాడు అనుకుంటాడని పేర్కొన్నారు.
సీఎం రమేష్ ఎంపీ నిధులను అనకాపల్లిలో ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టాడా అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడో అనకాపల్లి ప్రజలు గమనించాలని అన్నారు. బ్యాంకులకు కన్నం వేసి అనకాపల్లిలో తల దాచుకునేందుకు వచ్చాడని విమర్శించారు. రమేష్ ఆధార్ కార్డుపై మైదరాబాద్ అడ్రస్ ఉంటుందని దుయ్యబట్టారు. సీఎం రమేష్ ఎస్టీడీ.. బూడి ముత్యాలనాయుడు(అనకాపల్లి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి) లోకల్ అంటూ పేర్కొన్నారు.
పువ్వు పార్టీ అనకాపల్లిలో గెలిచేది లేదని అమర్నాథ్ సెటైర్లు వేశారు సీఎం రమేష్ ఆ పువ్వు చెవిలో పెట్టుకొని వెళ్లిపోవడమేనని ఎద్దేవా చేశారు. అనకాపల్లిలో రాజకీయ శత్రువులను కలిపిందే తానంటూ కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను ఉద్ధేశిస్తూ అన్నారు. వాళ్ల ఇంట్లో తన ఫోటో పెట్టుకోవాలని అన్నారు. అలాంటి వారు తనమీద పడి ఏడుస్తున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment