సాక్షి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో 100 మంది జనసేన నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని, జనసేనకి భవిష్యత్తు లేదన్నారు. కులతత్వ, మతతత్వ పార్టీలో ఏపీలో ఒక్కటయ్యాయని ఆయన మండిపడ్డారు.
నా ప్రత్యక్ష రాజకీయాలు సొంత జిల్లా నుంచి ప్రారంభిస్తున్నా.. రాష్టంలోని అన్ని జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా పనిచేశాను.. పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాను. జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదు.. అందుకే వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడ్ని లాక్కుని టికెట్ ఇచ్చారు. మా పార్టీలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన నేతలు ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తున్నారు’’ అని దుయ్యబట్టారు.
‘‘టీడీపీ నేతలు వీధి రౌడీలు, చిల్లర మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మాదక ద్రవ్యాలు దిగుమతి చేసుకున్నది. చంద్రబాబు బంధువులకు చెందిన కంపెనీ. డ్రగ్స్ కేసులో టీడీపీ నేతలు దొరికితే.. వైఎస్సార్‌సీపీపైకి నెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఆరు సీట్లకు మించి రావు. సీబీఐ విచారణలో టీడీపీ నేతల బండారం బయటపడటం ఖాయం. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన చాలా మంది నేతలు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారు. బ్రెజిల్ అధ్యక్షునికి అభినందనలతో ట్విట్ పెడితే.. దాన్ని కూడా తప్పుగా చిత్రీకరిస్తున్నారు’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి: జేపీని నమ్మొద్దు.. ఇది చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా: పోసాని
Comments
Please login to add a commentAdd a comment