రిత్విక్‌ జోడీకి టైటిల్‌ | Ritwik Pair clinch under 16 fenesta title | Sakshi
Sakshi News home page

రిత్విక్‌ జోడీకి టైటిల్‌

Published Sat, Oct 14 2017 10:28 AM | Last Updated on Sat, Oct 14 2017 10:28 AM

Ritwik Pair clinch under 16 fenesta title

న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరి డబుల్స్‌లో టైటిల్‌ చేజిక్కించుకున్నాడు. బాలికల డబుల్స్‌లో సృజన రాయరాల– ముష్రత్‌ అంజుమ్‌ షేక్‌ జంట విజేతగా నిలిచింది.

అండర్‌–16 బాలుర డబుల్స్‌ తుదిపోరులో టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన రిత్విక్‌ చౌదరి (తెలంగాణ)–జావియా దేవ్‌ (గుజరాత్‌) ద్వయం 6–3, 6–4తో సార్థక్‌ సుదెన్‌ (ఢిల్లీ)–ధ్రువ్‌ తంగ్రి (పంజాబ్‌) జంటపై గెలిచింది. అండర్‌–14 బాలికల డబుల్స్‌ టైటిల్‌ పోరులో రెండో సీడ్‌ అంజుమ్‌ షేక్‌–సృజన జోడి 6–2, 6–1తో రుతూజ (మహారాష్ట్ర)–నయిషా (కర్ణాటక) జంటపై విజయం సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement