fenesta open
-
చాంపియన్స్ సౌజన్య, నిక్కీ
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఈ టోరీ్నలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలతో పాటు అండర్–18 బాలికల కేటగిరీలోనూ విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన నిక్కీ పునాచ, సౌజన్య భవిశెట్టి పురుషుల, మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను హస్తగతం చేసుకోగా... అండర్–18 బాలికల సింగిల్స్‌లో తెలంగాణకు చెందిన రషి్మక భమిడిపాటి చాంపియన్‌గా అవతరించింది. శనివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ నిక్కీ పునాచ 6–2, 7–6 (7/4)తో ఆర్యన్ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. మరోవైపు శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌లో రిషికతో కలిసి డబుల్స్ టైటిల్ నెగ్గిన సౌజన్య... సింగిల్స్ విభాగంలోనూ సత్తాచాటింది. టాప్ సీడ్‌గా బరిలో దిగిన ఆమె ఫైనల్లో 6–4, 6–2తో ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)పై గెలు పొందింది. సౌజన్యకిదే తొలి జాతీయ టైటిల్ కావడం విశేషం. అండర్–18 బాలికల సింగిల్స్ ఫైనల్లో ఆరో సీడ్ రష్మి క భమిడిపాటి 6–0, 6–4తో ఐదో సీడ్ సందీప్తి సింగ్ రావుపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. బాలుర తుదిపోరులో మాడ్విన్ కామత్ 6–2, 7–6 (7/1)తో ఉదిత్ గొగోయ్‌పై గెలుపొంది చాంపియన్‌గా నిలిచాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేసింది. -
సెమీ ఫైనల్లో నిక్కీ, సౌజన్య, రష్మిక
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల విభాగంలో సౌజన్య భవిశెట్టి సెమీస్‌కు చేరగా... శ్రేయ తటవర్తి, శ్రావ్య శివాని, భువన కాల్వ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు నిక్కీ పునాచ ముందంజ వేశాడు. అండర్–18 బాలికల విభాగంలో రషి్మక భమిడిపాటి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ నిక్కీ పునాచ 6–4, 6–3తో ప్రజ్వల్ దేవ్‌పై గెలుపొందాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆరోసీడ్ దల్వీందర్ సింగ్ 7–6 (7/4), 7–5తో ఇక్బాల్‌పై, నాలుగో సీడ్ కునా ల్ ఆనంద్ 6–3, 7–6 (7/5)తో ఏడో సీడ్ నితిన్ కుమార్ సిన్హాపై, ఆర్యన్ 6–3, 6–7 (5/7), 6–3తో సూరజ్ ప్రబోద్పై నెగ్గారు. మహిళల క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సౌజన్య భవిశెట్టి 6–2, 6–2తో సాల్సా అహర్ (మహారాష్ట్ర)పై గెలుపొందగా, శ్రేయ తటవర్తి (ఆంధ్రప్రదేశ్) 2–6, 5–7తో నాలుగో సీడ్ ప్రేరణ బాంబ్రీ చేతిలో, శ్రావ్య శివాని (తెలంగాణ) 1–6, 1–6తో వైదేహి చౌదరీ చేతిలో, రెండో సీడ్ భువన (తెలంగాణ) 4–6, 2–6తో జగ్మీగ్ కౌర్ చేతిలో పరాజయం పాలయ్యారు. అండ ర్–18 బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రష్మిక 6–4, 6–4తో టాప్ సీడ్ కశిష్ భాటియాను కంగుతినిపించింది. ఇతర మ్యాచ్‌ల్లో సందీప్తి 6–2, 6–4తో బేలా తంహాంకర్పై, పూజ 7–6 (7/4), 6–2 తో ప్రేరణ విచారేపై, రేష్మ 7–5, 6–2తో ఆకాంక్ష నిట్టూరేపై గెలుపొందారు. అండర్–18 బాలు ర సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ మన్ మాలిక్ షా 6–2, 6–2తో ఉద్వీర్ సింగ్‌పై, కామత్ 6–3, 6–4తో కబీర్‌పై, రోహన్ 6–1, 7–5తో చిరాగ్‌పై, ఉదిత్ గొగోయ్ 4–6, 6–1, 6–4తో కృషన్ హుడాపై విజయం సాధించారు. టైటిల్ పోరుకు సాయిదేదీప్య జోడీ... డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి వై. సాయిదేదీప్య టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ఈ టోరీ్నలో సారా యాదవ్ (మధ్యప్రదేశ్)తో జతకట్టిన దేదీప్య డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల డబుల్స్ సెమీస్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 6–3, 3–6, 10–6తో అనూష (ఆంధ్రప్రదేశ్)–దక్షత పటేల్ (మహారాష్ట్ర) జోడీపై పోరాడి గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో సౌజన్య భవిశెట్టి (తెలంగాణ)–రిషిక సుంకర (ఢిల్లీ) జోడీతో సాయిదేదీప్య జంట తలపడుతుంది. -
సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు భవిశెట్టి సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం చేశారు. న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సౌజన్య 6–2, 6–1తో అనూషపై గెలుపొందింది. ఎనిమిదో సీడ్ శ్రావ్య శివాని 6–1, 6–1తో రిషిక సుంకరను ఓడించింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ భువన కాల్వ (తెలంగాణ) 7–5, 7–5తో సారా యాదవ్‌పై నెగ్గింది. అండర్–18 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన సంజన సిరిమల్ల, రష్మిక భమిడిపాటి, సంస్కృతి దామెర ముందంజ వేయగా... అదితి ఆరే తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. అండర్–18 బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో పదో సీడ్ సంజన 6–1, 6–0తో పావని పాథక్‌పై, ఆరో సీడ్ రష్మిక 6–0, 6–1తో దివ్య భరద్వాజ్‌పై, తొమ్మిదో సీడ్ సంస్కృతి 7–5, 6–1తో ఇషితా సింగ్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. అదితి ఆరే 1–6, 0–6తో రేష్మా మురారి చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు మహిళల సింగిల్స్ తొలి రౌండ్: ప్రేరణ బాంబ్రీ 6–2, 6–3తో సుదీప్త సేన్‌పై, ఆకాంక్ష నిట్టూరే 6–1, 6–2తో హర్షిత్ చుగ్‌పై, వన్షిత పథాని 6–2, 6–4తో కశిష్ భాటియాపై, లక్ష్మి వటుకుర్ 4–6, 7–5, 6–3తో లిఖిత కాల్వపై, ఆరతి మునియాన్ 7–5, 6–3తో రమ్య నటరాజన్‌పై నెగ్గారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్: టాప్ సీడ్ నిక్కీ పునాచ 7–5, 6–4తో సాయి కార్తీక్‌పై, నితిన్ కుమార్ 6–4, 6–0తో విష్ణు వర్ధన్‌పై, చంద్రిల్ 7–4, 6–4తో ధ్రువ్‌పై, దల్వీందర్ సింగ్ 7–4, 6–3తో రంజీత్ వీర్ మురుగేశన్‌పై, అద్వైత్ బింద్రే 6–1, 6–3తో యశ్ యాదవ్‌పై, అభినవ్ సంజీవ్ 6–4, 6–4తో అన్షు కుమార్‌పై, వియంత్ మల్లిక్ 6–0, 7–2తో యుగల్ బన్సల్‌పై, ప్రజ్వల్ దేవ్ 6–1, 6–4తో కవిన్‌పై గెలుపొందారు. అండర్–18 బాలికల సింగిల్స్ తొలిరౌండ్: కశిష్ భాటియా 6–3, 6–2తో రితూ రాణిపై, భక్తి షా 6–1, 6–2తో శాన్వి అçహ్లూవాలియాపై, పూజ ఇంగ్లే 6–3, 6–0తో రెనీ సింగ్‌పై, ప్రేరణ విచారే 6–0, 6–1తో సియా దియా బాలాజీపై, సందీప్తి సింగ్ రావు 6–1, 6–2తో గౌరిసియా దబ్రాల్‌పై, బేలా తన్హాంకర్ 6–3, 6–1తో రాజేశ్ బోయర్‌పై, ఆకాంక్ష నిట్టూరే 6–1, 6–1తో కావ్యపై, జగ్మీత్ కౌర్ 4–6, 6–1, 6–2తో సుదీప్త సేన్‌పై విజయం సాధించారు. అండర్–18 బాలుర సింగిల్స్ తొలిరౌండ్: ఆర్యన్ భాటియా 7–5, 6–2తో లంకారెడ్డిపై, చిరాగ్ దుహాన్ 7–6(5), 6–2తో కనిష్క్ పాల్‌పై, ఉదిత్ గొగోయ్ 7–6 (7/4), 6–2తో సిద్ధార్థ్ జాడ్లిపై, రోహన్ మెహ్రా 6–3, 6–1తో దేవ్ జావియాపై, కృష్ణ 5–7, 6–3, 6–1తో అతుల్ చిల్లర్‌పై, బిక్రమ్‌జీత్ సింగ్ 6–4, 6–2తో భూపతిపై, అథర్వ్ 6–1, 6–3తో గౌరవ్ గులియాపై, మన్ మలిక్ షా 6–1, 6–0తో బ్రుగెన్‌పై, మోహిత్ 6–2, 6–1, 6–2తో దివేశ్ గెహ్లాట్‌పై, కబీర్ 6–4, 6–2తో హీరక్ వోరాపై, సుశాంత్ దబాస్ 10–8, 6–3తో అఖిలేంద్రాయ్ ఇంద్రబాలన్‌పై, యశ్ చౌరాసియా 6–1, 6–4తో కరన్ సింగ్‌పై, ధ్రువ్ తాంగ్రి 6–4, 6–2తో నిశాంత్ దబాస్‌పై గెలిచారు. డబుల్స్ క్వార్టర్స్‌లో సాయిదేదీప్య జోడీ... మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య తన భాగస్వామి సారా యాదవ్ (మధ్యప్రదేశ్)తో కలిసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 6–2, 6–2తో సింధు జనగామ–సంస్కృతి దామెర (తెలంగాణ) జోడీపై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్ చేరిన సాయిదేదీప్య నేడు జరిగే మ్యాచ్‌లో శ్రేయ తటవర్తి (తెలంగాణ)తో తలపడుతుంది. -
శివాని, సాత్విక ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు సామ సాత్విక, శ్రావ్య శివాని, షేక్ హుమేరా ముందంజ వేశారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వీరు మూడో రౌండ్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల రెండో రౌండ్లో సాత్విక 6–1, 6–1తో రిషిక సుంకర (ఢిల్లీ)పై, శ్రావ్య శివాని 6–2, 6–3తో నిత్యరాజ్ బాబురాజ్ (తమిళనాడు)పై విజయం సాధించారు. హుమేరా 1–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఆమె ప్రత్యర్థి ముస్కాన్ గుప్తా (ఢిల్లీ) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో ఆమె ముందంజ వేసింది. పురుషుల విభాగంలో తెలంగాణకు చెందిన సీపీ అనిరుధ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అండర్–18 బాలికల విభాగంలోనూ షేక్ హుమేరా, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక మూడో రౌండ్‌కు చేరుకున్నారు. రెండోరౌండ్లో హుమేరా 3–6, 6–4, 6–3తో ముస్కాన్ గుప్తా (ఢిల్లీ)పై గెలుపొందగా, రష్మిక 6–2, 6–3తో విపాసా మెహ్రా (తమిళనాడు)ను ఓడించింది. బాలుర విభాగంలో రాష్ట్రానికి చెందిన గంటా సాయికార్తీక్ రెడ్డి 5–7, 6–4, 4–7 (4/7)తో అజయ్ మలిక్ (హరియాణా) చేతిలో పరాజయం పాలై రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. -
రిత్విక్ జోడీకి టైటిల్
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ కుర్రాడు బొల్లిపల్లి రిత్విక్ చౌదరి డబుల్స్‌లో టైటిల్ చేజిక్కించుకున్నాడు. బాలికల డబుల్స్‌లో సృజన రాయరాల– ముష్రత్ అంజుమ్ షేక్ జంట విజేతగా నిలిచింది. అండర్–16 బాలుర డబుల్స్ తుదిపోరులో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన రిత్విక్ చౌదరి (తెలంగాణ)–జావియా దేవ్ (గుజరాత్) ద్వయం 6–3, 6–4తో సార్థక్ సుదెన్ (ఢిల్లీ)–ధ్రువ్ తంగ్రి (పంజాబ్) జంటపై గెలిచింది. అండర్–14 బాలికల డబుల్స్ టైటిల్ పోరులో రెండో సీడ్ అంజుమ్ షేక్–సృజన జోడి 6–2, 6–1తో రుతూజ (మహారాష్ట్ర)–నయిషా (కర్ణాటక) జంటపై విజయం సాధించింది. -
సెమీస్‌లో భువన, సాత్విక
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు భువన కాల్వ, సామ సాత్విక సెమీఫైనల్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ ముందంజ వేయగా, నగరానికే చెందిన షేక్ హుమేరా, శ్రావ్య శివానిలు పరాజయం పాలయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో భువన (తెలంగాణ) 0–6, 6–4, 6–3తో ఆరో సీడ్ ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ)ను బోల్తా కొట్టించగా... షేక్ హుమేరా (తెలంగాణ) 2–6, 4–6తో టాప్ సీడ్ జీల్ దేశాయ్ (గుజరాత్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు అండర్–18 బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో సామ సాత్విక (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో ప్రేరణ విచారే (మహారాష్ట్ర)పై నెగ్గి సెమీఫైనల్‌కు చేరుకోగా, శ్రావ్య శివాని (తెలంగాణ) 2–6, 1–6తో తనీషా కశ్యప్ (అస్సాం) చేతిలో, షేక్ హుమేరా (తెలంగాణ) 1–6, 3–6తో వైదేహి చౌదరి (గుజరాత్) చేతిలో పరాజయం పాలయ్యారు. టైటిల్ పోరుకు సాయిదేదీప్య జోడి ఈ టోర్నీ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారాయాదవ్‌తో జతకట్టిన దేదీప్య అండర్–18 బాలికల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో దేదీప్య–సారాయాదవ్ ద్వయం 6–4, 6–1తో సోహా–సృష్టి జంటపై విజయం సాధించింది. ఫైనల్లో సాయిదేదీప్య జోడి స్నేహా రెడ్డి (తమిళనాడు)–శ్వేతా రాణా (ఢిల్లీ) జంటతో తలపడుతుంది. -
రన్నరప్ కృష్ణ రోహిత్ జంట
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ రోహిత్ రన్నరప్‌గా నిలిచాడు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన డబుల్స్ బాలుర ఫైనల్లో కృష్ణరోహిత్ (తెలంగాణ)-దక్షిణేశ్వర్ (తమిళనాడు) ద్వయం 2-6, 2-6తో సిద్ధాంత్ (మహరాష్ట్ర)- మేఘ్ పటేల్ (గుజరాత్) జోడీ చేతిలో ఓడిపోయి రెండో స్థానంతో సరిపెట్టుకుంది. -
క్వార్టర్ ఫైనల్లో హుమేరా
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో షేక్ హుమేరా 6-1, 4-6, 6-4తో సారా దేవ్‌పై విజయం సాధించింది. బాలుర విభాగంలో సిద్ధాంత్ 6-4, 6-4తో తోజ్యో ఓజెస్పై, అభిమన్యు 6-0, 6-0తో మోనీష్ షాపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అండర్-14 బాలబాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఆర్యన్ జవేరీ 6-2, 6-3తో నరేశ్ బడ్గుజర్పై గెలుపొందగా... సన్యా సింగ్ 7-6 (4), 6-2తో అదితిని ఓడించింది. ఇతర మ్యాచ్ ఫలితాలు.. అండర్-16 బాలురు: రిషబ్ 6-1, 6-3తో ఆయూష్ దేశ్వాల్పై, మేఘ్ కుమార్ పటేల్6-3, 6-0తో సంకేత్ తోమర్‌పై, అర్జున్ 6-4, 5-7, 6-2తో రోహిత్‌పై, సురేశ్6-1, 6-0తో నీరజ్ యశ్‌పాల్‌పై, దేవ్ 6-2, 7-5తో రిథమ్ మల్హోత్రాపై గెలుపొందారు. బాలికలు: వైదేహి 6-0, 6-0తో గార్గి పవార్‌పై, అయేషా పటేల్ 6-0, 6-1తో దామినిపై, తనీషా కశ్యప్ 6-2, 6-0తో ముబషిరా షేక్‌పై, ప్రింకెల్సింగ్ 6-2, 6-2తో ప్రియాన్షి భండారిపై, సల్సా అహర్ 6-1, 6-0తో మలైకాపై, శరణ్య 6-2, 6-3తో యుబ్రాని బెనర్జీపై, భక్తి పర్వాణి 7-6 (6), 1-6, 6-3తో సాయి దేదీప్యపై విజయం సాధించారు. అండర్-14 బాలురు: దేవ్ 6-4, 6-2తో క్రిష్ పటేల్‌పై, సందీప్ 6-3, 6-3తో ఆదర్శ్ నాగపై, నితిన్ జైపాల్ 6-2, 6-3తో ఆదిత్య వర్ధన్‌పై, అజయ్ 6-0, 6-3తో రాజేశ్‌పై, దివేశ్ 5-7, 6-1, 7-6తో ఉదిత్‌పై, నిశాంత్ 6-0, 6-7 (4), 7-6 (3)తో భూపతిపై నెగ్గారు. బాలికలు: శరణ్య 6-3, 6-3తో సంస్కృతిపై, సారా దేవ్ 6-2, 6-2తో బేలా తన్హాంకర్పై, రిచా 4-6, 6-4, 6-1తో వన్షిక చౌదరీపై, మలైకా 6-0, 6-1తో గార్గి పవార్‌పై, వినీత 6-2, 1-0తో అర్చితపై, సందీప్తి సింగ్ 6-3,7-5తో భక్తి పర్వాణిపై, ప్రియాన్షి భండారి 6-0, 6-0తో పూర్వి భట్‌పై గెలిచారు. -
సౌజన్య జంటకు డబుల్స్ టైటిల్
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి సాధించింది. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి రిషిక సుంకరతో కలసి సౌజన్య విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సౌజన్య-రిషిక ద్వయం 4-6, 6-1, 10-7తో ‘సూపర్ టైబ్రేక్’లో శ్వేతా రాణా (ఢిల్లీ)-ఇతీ మెహతా (గుజరాత్) జోడీపై విజయం సాధించింది. అండర్-18 బాలికల డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారిణి శ్రావ్య శివాని-తనీషా కశ్యప్ (అస్సాం) జంట 6-1, 7-6 (7/5)తో సభ్యత నిహ్లాని (ఢిల్లీ)-యుబ్రాని బెనర్జీ (బెంగాల్) జోడీని ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. ఫైనల్లో హుమేరా అండర్-18 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి షేక్ హుమేరా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో హుమేరా 4-6, 6-3, 6-2తో హైదరాబాద్‌కే చెందిన యెద్దుల సారుు దేదీప్యపై కష్టపడి గెలిచింది. శనివారం జరిగే ఫైనల్లో ఆకాంక్ష భాన్ (గుజరాత్)తో హుమేరా తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో ఆకాంక్ష 6-2, 6-1తో ఆంధ్రప్రదేశ్ అమ్మారుు లలిత దేవరకొండను ఓడించింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో హైదరాబాద్ ప్లేయర్ యడ్లపల్లి ప్రాంజల 4-6, 3-6తో ఇతీ మెహతా (గుజరాత్) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ క్రీడాకారుడు విష్ణువర్ధన్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీస్‌లో విష్ణు 6-3, 6-1తో కునాల్ ఆనంద్ (ఢిల్లీ)పై గెలిచాడు. ఫైనల్లో సిద్ధార్థ విశ్వకర్మ (ఉత్తరప్రదేశ్)తో విష్ణు ఆడతాడు. -
మెయిన్ ‘డ్రా’కు సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి యెద్దుల సాయి దేదీప్య మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో సాయి దేదీప్య ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సాయి దేదీప్య రెండో రౌండ్లో 9-2తో అద్రిజా బిశ్వాస్ (బెంగాల్)పై, మూడో మ్యాచ్‌లో 6-0, 6-1తో విభశ్రీ గౌడ (కర్ణాటక)పై గెలిచింది. క్వాలిఫయింగ్ ఇతర మ్యాచ్‌ల్లో తెలంగాణకే చెందిన శ్వేత నలెకల మూడో రౌండ్లో, సయ్యద్ గుల్స్ ్రబేగం తొలి రౌండ్లో ఓడిపోయారు.