సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం | Fenesta National Tennis Championship Soujanya Reaches 2nd Round | Sakshi
Sakshi News home page

సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం

Published Wed, Oct 2 2019 10:08 AM | Last Updated on Wed, Oct 2 2019 10:32 AM

Fenesta National Tennis Championship Soujanya Reaches 2nd Round - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫెనెస్టా ఓపెన్‌ జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయిలు భవిశెట్టి సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం చేశారు. న్యూఢిల్లీలోని ఆర్‌కే ఖన్నా స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ సౌజన్య 6–2, 6–1తో అనూషపై గెలుపొందింది. ఎనిమిదో సీడ్‌ శ్రావ్య శివాని 6–1, 6–1తో రిషిక సుంకరను ఓడించింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్‌ భువన కాల్వ (తెలంగాణ) 7–5, 7–5తో సారా యాదవ్‌పై నెగ్గింది. అండర్‌–18 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన సంజన సిరిమల్ల, రష్మిక భమిడిపాటి, సంస్కృతి దామెర ముందంజ వేయగా... అదితి ఆరే తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. అండర్‌–18 బాలికల సింగిల్స్‌ తొలిరౌండ్‌ మ్యాచ్‌ల్లో పదో సీడ్‌ సంజన 6–1, 6–0తో పావని పాథక్‌పై, ఆరో సీడ్‌ రష్మిక 6–0, 6–1తో దివ్య భరద్వాజ్‌పై, తొమ్మిదో సీడ్‌ సంస్కృతి 7–5, 6–1తో ఇషితా సింగ్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. అదితి ఆరే 1–6, 0–6తో రేష్మా మురారి చేతిలో పరాజయం పాలైంది.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌: ప్రేరణ  బాంబ్రీ 6–2, 6–3తో సుదీప్త సేన్‌పై, ఆకాంక్ష నిట్టూరే 6–1, 6–2తో హర్షిత్‌ చుగ్‌పై, వన్షిత పథాని 6–2, 6–4తో కశిష్‌ భాటియాపై, లక్ష్మి వటుకుర్‌ 4–6, 7–5, 6–3తో లిఖిత కాల్వపై, ఆరతి మునియాన్‌ 7–5, 6–3తో రమ్య నటరాజన్‌పై నెగ్గారు.  

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌: టాప్‌ సీడ్‌ నిక్కీ పునాచ 7–5, 6–4తో సాయి కార్తీక్‌పై, నితిన్‌ కుమార్‌ 6–4, 6–0తో విష్ణు వర్ధన్‌పై, చంద్రిల్‌ 7–4, 6–4తో ధ్రువ్‌పై, దల్వీందర్‌ సింగ్‌ 7–4, 6–3తో రంజీత్‌ వీర్‌ మురుగేశన్‌పై, అద్వైత్‌ బింద్రే 6–1, 6–3తో యశ్‌ యాదవ్‌పై, అభినవ్‌ సంజీవ్‌ 6–4, 6–4తో అన్షు కుమార్‌పై, వియంత్‌ మల్లిక్‌ 6–0, 7–2తో యుగల్‌ బన్సల్‌పై, ప్రజ్వల్‌ దేవ్‌ 6–1, 6–4తో కవిన్‌పై గెలుపొందారు.  

అండర్‌–18 బాలికల సింగిల్స్‌ తొలిరౌండ్‌: కశిష్‌ భాటియా 6–3, 6–2తో రితూ రాణిపై, భక్తి షా 6–1, 6–2తో శాన్వి అçహ్లూవాలియాపై, పూజ ఇంగ్లే 6–3, 6–0తో రెనీ సింగ్‌పై, ప్రేరణ విచారే 6–0, 6–1తో సియా దియా బాలాజీపై, సందీప్తి సింగ్‌ రావు 6–1, 6–2తో గౌరిసియా దబ్రాల్‌పై, బేలా తన్హాంకర్‌ 6–3, 6–1తో రాజేశ్‌ బోయర్‌పై, ఆకాంక్ష నిట్టూరే 6–1, 6–1తో కావ్యపై, జగ్‌మీత్‌ కౌర్‌ 4–6, 6–1, 6–2తో సుదీప్త సేన్‌పై విజయం సాధించారు.  

అండర్‌–18 బాలుర సింగిల్స్‌ తొలిరౌండ్‌: ఆర్యన్‌ భాటియా 7–5, 6–2తో లంకారెడ్డిపై, చిరాగ్‌ దుహాన్‌ 7–6(5), 6–2తో కనిష్క్‌ పాల్‌పై, ఉదిత్‌ గొగోయ్‌ 7–6 (7/4), 6–2తో సిద్ధార్థ్‌ జాడ్లిపై, రోహన్‌ మెహ్రా 6–3, 6–1తో దేవ్‌ జావియాపై, కృష్ణ 5–7, 6–3, 6–1తో అతుల్‌ చిల్లర్‌పై, బిక్రమ్‌జీత్‌ సింగ్‌ 6–4, 6–2తో భూపతిపై, అథర్వ్‌ 6–1, 6–3తో గౌరవ్‌ గులియాపై, మన్‌ మలిక్‌ షా 6–1, 6–0తో బ్రుగెన్‌పై, మోహిత్‌ 6–2, 6–1, 6–2తో దివేశ్‌ గెహ్లాట్‌పై, కబీర్‌ 6–4, 6–2తో హీరక్‌ వోరాపై, సుశాంత్‌ దబాస్‌ 10–8, 6–3తో అఖిలేంద్రాయ్‌ ఇంద్రబాలన్‌పై, యశ్‌ చౌరాసియా 6–1, 6–4తో కరన్‌ సింగ్‌పై, ధ్రువ్‌ తాంగ్రి 6–4, 6–2తో నిశాంత్‌ దబాస్‌పై గెలిచారు.   

డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాయిదేదీప్య జోడీ... 
మరోవైపు మహిళల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి వై. సాయిదేదీప్య తన భాగస్వామి సారా యాదవ్‌ (మధ్యప్రదేశ్‌)తో కలిసి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్‌ ద్వయం 6–2, 6–2తో సింధు జనగామ–సంస్కృతి దామెర (తెలంగాణ) జోడీపై విజయం సాధించింది. సింగిల్స్‌ విభాగంలో ప్రిక్వార్టర్స్‌ చేరిన సాయిదేదీప్య నేడు జరిగే మ్యాచ్‌లో శ్రేయ తటవర్తి (తెలంగాణ)తో తలపడుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement