fenesta tennis championship
-
క్వార్టర్స్‌లో నిక్కీ, భువన, సౌజన్య
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు, టాప్ సీడ్ నిక్కీ పునాచ, తెలంగాణ అమ్మాయి భువన కాల్వ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో పురుషులు, మహిళల విభాగంలో వీరిద్దరితో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర ప్లేయర్లు సౌజన్య భవిశెట్టి, శ్రేయ తటవర్తి, శ్రావ్యశివాని క్వార్టర్స్‌కు చేరుకోగా... రష్మిక భమిడిపాటి, సాయి దేదీప్య ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ నిక్కీ 6–4, 6–2తో కేఎస్ ధీరజ్‌పై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ సౌజన్య 6–0, 6–3తో తేజస్వీ (మహారాష్ట్ర)పై, శ్రేయ తటవర్తి 6–2, 6–4తో సాయిదేదీప్యపై, భువన 6–2, 7–6 (7/3)తో వన్షిత (కర్ణాటక)పై, శ్రావ్య శివాని 6–1, 4–6, 6–3తో అకాంక్ష నిట్టూరే (మహారాష్ట్ర)పై గెలుపొందారు. మరో మ్యాచ్‌లో రష్మిక భమిడిపాటి 6–2, 2–6, 3–6తో జగ్మీత్ కౌర్ (పంజాబ్) చేతిలో ఓడిపోయింది. అండర్–18 విభాగంలో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బాలికల కేటగిరీలో రషి్మక భమిడిపాటి క్వార్టర్స్‌లో అడుగుపెట్టగా... సంస్కృతి దామెర, సంజన సిరిమల్ల పరాజయం పాలయ్యారు. బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ రషి్మక 7–5, 6–2తో పదో సీడ్ సంజన సిరిమల్లపై గెలుపొందగా... సంస్కృతి 1–6, 1–6తో ప్రేరణ విచారే చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్: ఇక్బాల్ 4–6, 6–3, 6–0తో విజయంత్ మాలిక్‌పై, కునాల్ ఆనంద్ 6–7 (4/7), 7–5, 6–4తో చంద్రిల్ సూద్‌పై, ఆర్యన్ 6–4, 0–6, 7–6 (7/2)తో అని్వత్ బింద్రేపై, సూరజ్ 6–3, 3–6, 6–4తో జతిన్‌పై, దలీ్వందర్ సింగ్ 6–4, 6–2తో పరాస్‌పై, ప్రజ్వల్ దేవ్ 3–6, 7–6 (7/2), 6–1తో సురేశ్‌పై, నితిన్ సిన్హా 7–6 (7/2), 6–3తో అభినవ్ సంజీవ్‌పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్: ప్రేరణ బాంబ్రీ 6–4, 6–1తో ఆర్తిపై, వైదేహి చౌదరీ 6–0, 6–3తో లక్షి్మపై నెగ్గారు. అండర్–18 బాలికల ప్రిక్వార్టర్స్: కశిష్ భాటియా 6–1, 6–3తో భక్తి షా (తెలంగాణ)పై, ఆకాంక్ష 6–0, 6–0తో పవిత్రపై, పూజ 6–4, 6–3తో సారా దేవ్‌పై, సందీప్తి సింగ్ 6–4, 6–4తో జగ్మీత్ కౌర్‌పై, రేష్మ 6–2, 6–0తో గార్గి పవార్‌పై, బేలా 3–6, 7–5, 6–3తో వన్షిక చౌదరీపై విజయం సాధించారు. -
సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు భవిశెట్టి సౌజన్య, శ్రావ్య శివాని శుభారంభం చేశారు. న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా స్టేడియంలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో టాప్ సీడ్ సౌజన్య 6–2, 6–1తో అనూషపై గెలుపొందింది. ఎనిమిదో సీడ్ శ్రావ్య శివాని 6–1, 6–1తో రిషిక సుంకరను ఓడించింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ భువన కాల్వ (తెలంగాణ) 7–5, 7–5తో సారా యాదవ్‌పై నెగ్గింది. అండర్–18 బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన సంజన సిరిమల్ల, రష్మిక భమిడిపాటి, సంస్కృతి దామెర ముందంజ వేయగా... అదితి ఆరే తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. అండర్–18 బాలికల సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో పదో సీడ్ సంజన 6–1, 6–0తో పావని పాథక్‌పై, ఆరో సీడ్ రష్మిక 6–0, 6–1తో దివ్య భరద్వాజ్‌పై, తొమ్మిదో సీడ్ సంస్కృతి 7–5, 6–1తో ఇషితా సింగ్‌పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. అదితి ఆరే 1–6, 0–6తో రేష్మా మురారి చేతిలో పరాజయం పాలైంది. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు మహిళల సింగిల్స్ తొలి రౌండ్: ప్రేరణ బాంబ్రీ 6–2, 6–3తో సుదీప్త సేన్‌పై, ఆకాంక్ష నిట్టూరే 6–1, 6–2తో హర్షిత్ చుగ్‌పై, వన్షిత పథాని 6–2, 6–4తో కశిష్ భాటియాపై, లక్ష్మి వటుకుర్ 4–6, 7–5, 6–3తో లిఖిత కాల్వపై, ఆరతి మునియాన్ 7–5, 6–3తో రమ్య నటరాజన్‌పై నెగ్గారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్: టాప్ సీడ్ నిక్కీ పునాచ 7–5, 6–4తో సాయి కార్తీక్‌పై, నితిన్ కుమార్ 6–4, 6–0తో విష్ణు వర్ధన్‌పై, చంద్రిల్ 7–4, 6–4తో ధ్రువ్‌పై, దల్వీందర్ సింగ్ 7–4, 6–3తో రంజీత్ వీర్ మురుగేశన్‌పై, అద్వైత్ బింద్రే 6–1, 6–3తో యశ్ యాదవ్‌పై, అభినవ్ సంజీవ్ 6–4, 6–4తో అన్షు కుమార్‌పై, వియంత్ మల్లిక్ 6–0, 7–2తో యుగల్ బన్సల్‌పై, ప్రజ్వల్ దేవ్ 6–1, 6–4తో కవిన్‌పై గెలుపొందారు. అండర్–18 బాలికల సింగిల్స్ తొలిరౌండ్: కశిష్ భాటియా 6–3, 6–2తో రితూ రాణిపై, భక్తి షా 6–1, 6–2తో శాన్వి అçహ్లూవాలియాపై, పూజ ఇంగ్లే 6–3, 6–0తో రెనీ సింగ్‌పై, ప్రేరణ విచారే 6–0, 6–1తో సియా దియా బాలాజీపై, సందీప్తి సింగ్ రావు 6–1, 6–2తో గౌరిసియా దబ్రాల్‌పై, బేలా తన్హాంకర్ 6–3, 6–1తో రాజేశ్ బోయర్‌పై, ఆకాంక్ష నిట్టూరే 6–1, 6–1తో కావ్యపై, జగ్మీత్ కౌర్ 4–6, 6–1, 6–2తో సుదీప్త సేన్‌పై విజయం సాధించారు. అండర్–18 బాలుర సింగిల్స్ తొలిరౌండ్: ఆర్యన్ భాటియా 7–5, 6–2తో లంకారెడ్డిపై, చిరాగ్ దుహాన్ 7–6(5), 6–2తో కనిష్క్ పాల్‌పై, ఉదిత్ గొగోయ్ 7–6 (7/4), 6–2తో సిద్ధార్థ్ జాడ్లిపై, రోహన్ మెహ్రా 6–3, 6–1తో దేవ్ జావియాపై, కృష్ణ 5–7, 6–3, 6–1తో అతుల్ చిల్లర్‌పై, బిక్రమ్‌జీత్ సింగ్ 6–4, 6–2తో భూపతిపై, అథర్వ్ 6–1, 6–3తో గౌరవ్ గులియాపై, మన్ మలిక్ షా 6–1, 6–0తో బ్రుగెన్‌పై, మోహిత్ 6–2, 6–1, 6–2తో దివేశ్ గెహ్లాట్‌పై, కబీర్ 6–4, 6–2తో హీరక్ వోరాపై, సుశాంత్ దబాస్ 10–8, 6–3తో అఖిలేంద్రాయ్ ఇంద్రబాలన్‌పై, యశ్ చౌరాసియా 6–1, 6–4తో కరన్ సింగ్‌పై, ధ్రువ్ తాంగ్రి 6–4, 6–2తో నిశాంత్ దబాస్‌పై గెలిచారు. డబుల్స్ క్వార్టర్స్‌లో సాయిదేదీప్య జోడీ... మరోవైపు మహిళల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య తన భాగస్వామి సారా యాదవ్ (మధ్యప్రదేశ్)తో కలిసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 6–2, 6–2తో సింధు జనగామ–సంస్కృతి దామెర (తెలంగాణ) జోడీపై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్ చేరిన సాయిదేదీప్య నేడు జరిగే మ్యాచ్‌లో శ్రేయ తటవర్తి (తెలంగాణ)తో తలపడుతుంది. -
రష్మిక సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ మహిళల టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలన విజయంతో శుభారంభం చేసింది. న్యూఢిల్లీలోని ఆర్కే ఖన్నా స్టేడియంలో సోమవారం జరిగిన తొలి రౌండ్లో శ్రీవల్లి రష్మిక 7–5, 6–3తో ఆరో సీడ్ చామర్తి సాయి సంహిత (తమిళనాడు)ను బోల్తా కొట్టించింది. తొలి సెట్లో 3–5తో వెనుకబడ్డా... ఎక్కడా ఒత్తిడికి గురికాని రష్మిక వరుసగా నాలుగు గేములను సొంతం చేసుకొని సెట్‌ను గెలిచింది. రెండో సెట్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో తెలంగాణకే చెందిన దామెర సంస్కృతి 6–0, 6–1తో సాల్సా అహెర్‌ను చిత్తుగా ఓడించగా... వై. సాయిదేదీప్య 6–3, 6–1తో ప్రతిభ (కర్ణాటక)పై గెలిచింది. తటవర్తి శ్రేయ 6–2, 6–2తో శరణ్యను ఓడించింది. మెయిన్ ‘డ్రా’కు కార్తీక్ రెడ్డి పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ కుర్రాడు సాయి కార్తీక్‌రెడ్డి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ ఫైనల్లో కార్తీక్ రెడ్డి 6–3, 4–6, 6–2తో అని్వత్ బింద్రే (మహారాష్ట్ర)పై విజయం సాధించాడు. క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో అతను 9–3తో ఆకాశ్ నంద్వాల్ (మధ్యప్రదేశ్)పై గెలుపొందగా... రెండో రౌండ్లో 9–5తో జూనియర్ జాతీయ చాంపియన్ దిగ్విజయ్ ప్రతాప్ సింగ్ (చండీగడ్)ను చిత్తు చేశాడు. సోమవారం జరిగిన మెయిన్ డ్రా తొలి రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ కుర్రాడు రిషబ్ అగర్వాల్ 3–6, 3–6తో పారస్ దహియా చేతిలో ఓడిపో యాడు. అండర్ –18 బాలుర సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో లంక సుహిత్ రెడ్డి 6–2, 6–4తో భూపేందర్‌పై గెలిచాడు. ఈ టోర్నీ ప్రారంభమై ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తి కావడంతో నిర్వాహకులు మాజీ చాంపియన్స్ ను సన్మానించారు. తొలి రోజు కేంద్ర క్రీడల మాజీ మంత్రి, ఏథెన్స్ ఒలింపిక్స్ రజత పతక విజేత రాజ్యవర్ధన్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. -
క్వార్టర్స్‌లో షేక్ హుమేరా, భువన
సాక్షి, హైదరాబాద్: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు భువన కాల్వ, షేక్ హుమేరా నిలకడగా రాణిస్తున్నారు. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో భువన కాల్వ (తెలంగాణ) 6–2, 6–4తో మూడో సీడ్ శ్వేత రాణా (ఢిల్లీ)ను కంగుతినిపించింది. మరో మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మౌలిక రామ్ 0–6, 0–6తో ప్రేరణ బాంబ్రీ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయింది. అండర్–18 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరో సీడ్ షేక్ హుమేరా (తెలంగాణ) 6–1, 6–2తో ప్రింకెల్ సింగ్ (జమ్ము, కశ్మీర్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హుమేరాతో పాటు రాష్ట్రానికి చెందిన శ్రావ్య శివాని, సామ సాత్విక క్వార్టర్స్‌కు చేరుకోగా సాయిదేదీప్యకు చుక్కెదురైంది. శ్రావ్య శివాని 6–0, 6–1తో భక్తి పర్వాని (గుజరాత్)పై, పదమూడో సీడ్ సామ సాత్విక 6–2, 6–3తో నాలుగో సీడ్ సల్సా అహెర్ (మహారాష్ట్ర)పై గెలుపొందారు. ప్రిక్వార్టర్స్‌లో సాయిదేదీప్య 2–6, 2–6తో ప్రేర ణ (మహారాష్ట్ర) చేతిలో పరాజయం పాలైంది. సెమీస్‌లో సాయిదేదీప్య జోడీ హైదరాబాద్ అమ్మాయి వై. సాయిదేదీప్య సింగిల్స్‌లో పరాజయం పాలైనప్పటికీ డబుల్స్‌లో దూసుకెళ్తోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారా యాదవ్‌తో జతకట్టిన దేదీప్య అండర్–18 బాలికల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో సాయిదేదీప్య–సారా యాదవ్ ద్వయం 7–5, 4–6, 10–6తో అక్షర ఇస్కా– మౌలిక రామ్ (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలుపొందింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య జోడీ సృష్టి దాస్ (మహారాష్ట్ర)–సోహా (కర్ణాటక) జంటతో తలపడుతుంది. -
ప్రాంజల శుభారంభం
న్యూఢిల్లీ: ఫెనెస్టా జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో టాప్ సీడ్ ప్రాంజల 6-2, 6-1తో ఆస్థా దర్గూడెపై అలవోకగా గెలిచింది. మరో తెలుగు అమ్మాయి తీర్థ ఇస్కా 4-6, 3-6తో నీరూ రాప్రియా చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తెలంగాణ ప్లేయర్ బెరైడ్డి సాయి శరణ్ రెడ్డి 6-2, 6-1తో విలాసెర్ ఖాటేను ఓడించాడు. అండర్-18 బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో రిత్విక్ చౌదరీ 6-2, 5-7, 7-6 (9/7)తో సార్థక్ సుదెన్పై, కార్తీక్ రెడ్డి 7-5, 6-2తో దీపక్ సెంథిక్ కుమార్‌పై గెలుపొందగా... కొసరాజు శివదీప్ 3-6, 6-2, 3-6తో రియాన్ పండోలె చేతిలో, నితిన్ గుండుబోయిన 3-6, 3-6తో సీహెచ్ అర్జున్ చేతిలో, రోహిత్ కృష్ణ 2-6, 2-6తో సానిల్ జగ్తియాని చేతిలో, అపురూప్ రెడ్డి 1-6, 3-6తో పరమ్ చేతిలో ఓడిపోయారు. అండర్-18 బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో అంజుమ్ ముబాషిరా 1-6, 0-6తో అద్వైత శరవణ చేతిలో ఓడిపోగా... శ్రేయ తటవర్తి 6-1, 6-1తో వన్షిక చౌదరీపై గెలిచింది.