ప్రాంజల శుభారంభం | pranjula wins opening match in fenesta tennis championship | Sakshi
Sakshi News home page

ప్రాంజల శుభారంభం

Published Tue, Oct 4 2016 11:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

pranjula wins opening match in fenesta tennis championship

న్యూఢిల్లీ: ఫెనెస్టా జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో టాప్ సీడ్ ప్రాంజల 6-2, 6-1తో ఆస్థా దర్గూడెపై అలవోకగా గెలిచింది. మరో తెలుగు అమ్మాయి తీర్థ ఇస్కా 4-6, 3-6తో నీరూ రాప్రియా చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో తెలంగాణ ప్లేయర్ బెరైడ్డి సాయి శరణ్ రెడ్డి 6-2, 6-1తో విలాసెర్ ఖాటేను ఓడించాడు.

 అండర్-18 బాలుర సింగిల్స్ తొలి రౌండ్‌లో రిత్విక్ చౌదరీ 6-2, 5-7, 7-6 (9/7)తో సార్థక్ సుదెన్‌పై, కార్తీక్ రెడ్డి 7-5, 6-2తో దీపక్ సెంథిక్ కుమార్‌పై గెలుపొందగా... కొసరాజు శివదీప్ 3-6, 6-2, 3-6తో రియాన్ పండోలె చేతిలో, నితిన్ గుండుబోయిన 3-6, 3-6తో సీహెచ్ అర్జున్ చేతిలో, రోహిత్ కృష్ణ 2-6, 2-6తో సానిల్ జగ్తియాని చేతిలో, అపురూప్ రెడ్డి 1-6, 3-6తో పరమ్ చేతిలో ఓడిపోయారు. అండర్-18 బాలికల సింగిల్స్ తొలి రౌండ్‌లో అంజుమ్ ముబాషిరా 1-6, 0-6తో అద్వైత శరవణ చేతిలో ఓడిపోగా... శ్రేయ తటవర్తి 6-1, 6-1తో వన్షిక చౌదరీపై గెలిచింది.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement