pranjula
-
రన్నరప్ ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల–రలూకా సెర్బాన్ (రొమేనియా) ద్వయం 4–6, 4–6తో టాప్ సీడ్ గిలియానా (మెక్సికో)–లారా పిగోసి (బ్రెజిల్) జంట చేతిలో ఓడిపోయింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల జోడీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. -
రన్నరప్ ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల (భారత్)–లీ పెచి (చైనీస్ తైపీ) ద్వయం 2–6, 3–6తో నాలుగో సీడ్ మార్టినా కోల్‌మాగ్నా (ఇటలీ)–వలెరియా సోలోవియా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. 67 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయింది. -
ఫైనల్లో ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ విభాగంలో టైటిల్ పోరుకు చేరుకుంది. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీ మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాంజల (భారత్)–లీ పెచి (చైనీస్ తైపీ) ద్వయం 6–2, 6–2తో చార్లోటి రొమెర్ (ఈక్వెడార్)–హెలెన్ షోల్సెన్ (బెల్జియం) జంటపై గెలిచింది. 78 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల జంట రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి, తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయింది. శనివారం జరిగే ఫైనల్లో నాలుగో సీడ్ మార్టినా కోల్‌మాగ్నా (ఇటలీ)–వలెరియా సోలోవియా (రష్యా) జంటతో ప్రాంజల ద్వయం ఆడుతుంది. సింగిల్స్ విభాగంలో మాత్రం ప్రాంజల తొలి రౌండ్లోనే ఓడిపోయింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన ప్రాంజల తొలి రౌండ్లో 3–6, 2–6తో క్వాలిఫయర్ కరోలినా బెరెన్కోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓటమి చవిచూసింది. -
టైటిల్ పోరుకు ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శ్రీలంకలోని కొలంబోలో జరుగుతోన్న ఈ టోర్నీలో ప్రాంజల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల 6–1, 6–4తో నాలుగో సీడ్ బోలెమ్ జోసెఫిన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో ప్రాంజల 6–4, 6–4తో జీల్ దేశాయ్ (భారత్)ను ఓడించింది. మరోవైపు మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మూడో సీడ్ ప్రాంజల–రుతుజా భోస్లే (భారత్) ద్వయం 6–2, 6–3తో టాప్‌సీడ్ అనిడినోవా (కజకిస్తాన్)–కరోవిక్ తమారా (సెర్బియా) జంటను కంగుతినిపించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. -
సెమీఫైనల్లో ప్రాంజల జోడీ
సాక్షి, హైదరాబాద్: శ్రీలంకలో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటుకుంది. ఆమె డబుల్స్‌లో సెమీస్‌లోకి, సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కొలంబోలో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ప్రాంజల–రుతూజా భోసలే జోడి 6–0, 6–0తో ప్రియాంక రాడ్రిక్స్ (భారత్) గాబ్రియెలా జుర జర్నొవియను (రొమేనియా) జంటపై అలవోక విజయం సాధించింది. తొలి రౌండ్లో భారత జోడీకి ‘బై’ లభించింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన హైదరాబాద్ అమ్మాయి 7–6 (7/4), 6–0తో అలైస్ గిలాన్ (బ్రిటన్)పై గెలిచింది. భారత క్రీడాకారిణుల మధ్య జరిగిన పోరులో ఎనిమిదో సీడ్ జీల్ దేశాయ్ 6–0, 6–1తో చామర్తి సాయి సంహితను ఓడించగా... తెలుగు అమ్మాయి రిషిక సుంకర 4–6, 0–6తో యెగ్జిన్ మ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జీల్ దేశాయ్‌తో ప్రాంజల తలపడుతుంది. డబుల్స్ సెమీస్‌లో ప్రాంజల–రుతూజా జోడీ... టాప్ సీడ్ ఐనిండినొవా (కజకిస్తాన్)–క్యురోవిక్ (సెర్బియా) జంటతో తలపడుతుంది. మరో సెమీస్‌లో నాలుగో సీడ్ నిధి చిలుముల–ప్రేరణ బాంబ్రీ జోడీ... రెండో సీడ్ నటాషా పల్హా–రిషిక సుంకర జంటతో పోటీపడుతుంది. -
సెమీస్‌లో ఓడిన ప్రాంజల
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం సెమీస్‌లో ముగిసింది. థాయ్‌లాండ్‌లోని హువహిన్ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె క్వాలిఫయర్‌గా అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో ఈ హైదరాబాద్ క్రీడాకారిణి 4–6, 1–6తో రెండో సీడ్ జాక్వెలిన్ కకొ (అమెరికా) చేతిలో పరాజయం చవిచూసింది. -
సింగిల్స్ సెమీస్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లోని హువహిన్ పట్టణంలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో క్వాలిఫయర్ ప్రాంజల 6–2, 6–0తో ఒజ్జెన్ పెమ్రా (టర్కీ)పై అలవోక విజయం సాధించింది. సెమీస్‌లో ఆమె అమెరికాకు చెందిన రెండో సీడ్ జాక్వెలిన్ కకోతో తలపడనుంది. జాక్వెలిన్ 4–6, 7–6 (8/6), 2–1తో ఆధిక్యంలో ఉన్న దశలో ఆమె ప్రత్యర్థి జులియా గ్లుష్కో (ఇజ్రాయెల్) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. -
ప్రాంజల ముందంజ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ప్రొ సర్క్యూట్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో రెండోరౌండ్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో ప్రాంజల (భారత్) 6–1, 6–4తో యొషిటొమి ఐకో (జపాన్)పై విజయం సాధించింది. డబుల్స్ విభాగంలో మరో తెలుగు అమ్మాయి సౌజన్య భవిశెట్టి జంట క్వార్టర్స్‌కు చేరుకుంది. తొలిరౌండ్లో సౌజన్య భవిశెట్టి–రిషిక సుంకర (భారత్) ద్వయం 6–7 (3/7), 6–2, 10–8తో చట్మనీ జాన్‌కియా–నపావి జాన్‌కియా (థాయ్‌లాండ్) జోడీపై నెగ్గింది. -
టైటిల్‌పోరుకు ప్రాంజల జోడి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ ఫైనల్‌కు చేరుకుంది. థాయ్‌లాండ్‌లో గురువారం జరిగిన ఈ టోర్నీ మహిళల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాంజల– జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6–2, 6–4తో కావో సికి– లి యువాన్ (చైనా) జంటపై గెలుపొందింది. ఫైనల్లో ప్రాంజల జోడీ భారత్‌కు చెందిన రితుజ భోస్లే– అలెగ్జాండ్రా వాల్టర్ (అమెరికా) జంటతో తలపడుతుంది. -
సెమీస్‌లో ప్రాంజల జోడి
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల డబుల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్‌లాండ్‌లో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల–జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6–3, 7–5తో వత్సకోల్ సవాస్డీ–చనికర్న్ సిలాకుల్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది. మరోవైపు సింగిల్స్ విభాగంలో ప్రాంజల పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 2–6, 6–7 (4/7)తో వత్సకోల్ సవాస్డీ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. -
రెండో రౌండ్లో ప్రాంజల
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె రెండో రౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ ప్రాంజల 6–0, 6–0తో పిబాంగ్రుక్ నథ్పట్ (థాయ్‌లాండ్)పై గెలుపొందింది. మరో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 0–6, 0–6తో మి జువామా యు (చైనా) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ తొలి రౌండ్లో సౌజన్య భవిశెట్టి–రిషిక ద్వయం 3–6, 5–7తో సవాస్ది–చనికర్న్ సిలాకుల్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. -
రన్నరప్ ప్రాంజల జోడీ
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఆకట్టుకుంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీ డబుల్స్ విభాగంలో ప్రాంజల జంట రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల– మోమ్కూంథోడ్ (థాయ్‌లాండ్) ద్వయం 0–6, 6–7 (5/7)తో గముల్య బియాట్రేస్–రోమ్పీస్ జెస్సీ జంట చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో ప్రాంజల పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. సెమీఫైనల్లో ప్రాంజల 3–6, 3–6తో ఖాజి హరుకా (జపాన్) చేతిలో ఓడిపోయింది. -
ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్లో యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి, డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సింగిల్స్‌లో ఆమె 6–4, 6–0తో సిలకుల్ చనికర్న్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. డబుల్స్ తొలి రౌండ్లో ప్రాంజల–మంకూంతొడ్ (థాయ్‌లాండ్) జోడి 6–3, 7–5తో నటాషా (భారత్)–కారోలిన్ (ఫ్రాన్స్) జంటపై విజయం సాధించింది. -
ప్రాంజల ఓటమి
\సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. ఈజిప్ట్‌లోని షర్మ్ ఎల్ షేక్ నగరంలో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 3–6, 4–6తో బియాంక మిహేలా (రొమేనియా) చేతిలో ఓడిపోయింది. -
ప్రాంజల జంట సంచలనం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల జోడీ సంచలనంతో శుభారంభం చేసింది. ఈజిప్ట్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో పెద్దిరెడ్డి శ్రీ వైష్ణవితో జత కట్టిన ప్రాంజల మహిళల డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలిరౌండ్లో ప్రాంజల–శ్రీ వైష్ణవి (భారత్) ద్వయం 6–3, 6–3తో టాప్ సీడ్ జాక్వెలిన్ (స్వీడన్)–యషినా (రష్యా) జంటపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ప్రాంజల జంట ఎనిమిది ఏస్‌లు సంధించి, ఐదు బ్రేక్ పాయింట్లు సాధించింది. -
ప్రాంజల జంటకు డబుల్స్ టైటిల్
ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నమెంట్ ఔరంగాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మెరిసింది. స్థానిక క్లే ఔట్‌డోర్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి జియోజి జావోతో కలి సి డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివా రం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రాంజల–జియోజి జావో (చైనా) ద్వయం 2–6, 6–3, 10–4తో ‘సూపర్ టైబ్రేక్’లో రుతుజ–కనిక వైద్య (భారత్) జంటపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. 66 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ప్రాంజల జంట ఒక ఏస్ సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి జోడీ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. జూనియర్ స్థాయిలో నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గిన 18 ఏళ్ల ప్రాంజలకు సీనియర్ ప్రొ సర్క్యూట్లో మాత్రం ఇదే తొలి డబుల్స్ టైటిల్ కావడం విశేషం. -
ఫైనల్ రౌండ్‌కు ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో హైదరాబాదీ ప్లేయర్ ప్రాంజల ఫైనల్ రౌండ్‌కు చేరుకుంది. పుణేలోని డెక్కన్ జింఖానా గ్రౌండ్సలో జరుగుతోన్న ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రాంజల 6-0, 6-0తో నాజ్ అమ్రీన్పై గెలుపొంది ఫైనల్ క్వాలిఫరుుంగ్ రౌండ్‌కు అర్హత సాధించింది. -
ప్రాంజల ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు నిరాశ ఎదురైంది. పుణేలోని బాలేవాడి స్పోర్ట్స కాంప్లెక్స్‌లో జరిగిన ఈ టోర్నీలో తను సెమీస్‌లోనే నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రాంజల 4-6, 1-6తో సౌజన్య భవిశెట్టి చేతిలో పరాజయం పాలై వెనుదిరిగింది. -
సెమీస్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల బాలికల సింగిల్స్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 6-4, 6-4తో తనకన్నా మెరుగైన క్రీడాకారిణి నటాషా పల్హాపై విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 3-6, 6-1, 6-3తో శ్వేత చంద్ర రాణాపై గెలుపొంది క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు డబుల్స్‌లో ప్రాంజల పోరాటం ముగిసింది. ప్రాంజల- నిధి చిలుముల ద్వయం 0-6, 4-6తో రియా భాటియా- శ్వేత జోడీ చేతిలో ఓడిపోయి ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. -
ప్రాంజలకు డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఎల్‌టీఏటీ ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సత్తా చాటింది. భారత్‌కే చెందిన జీల్ దేశాయ్‌తో జతకట్టిన ప్రాంజల బాలికల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. థాయ్‌లాండ్‌లోని నేషనల్ టెన్నిస్ డెవలప్మెంట్ సెంటర్లో శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో యడ్లపల్లి ప్రాంజల-జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6-1, 6-3తో కున్-రుు-లీ (చైనీస్ తైపీ)-మనన్చయ సవాంగ్కవ్ (థాయ్‌లాండ్) జోడీపై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. -
ఫైనల్లో ప్రాంజల జోడీ
సాక్షి, హైదరాబాద్: ఎల్‌టీఏటీ ఐటీఎఫ్ జూనియర్ గ్రేడ్-2 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మారుు ప్రాంజల డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. థాయ్‌లాండ్‌లోని నేషనల్ టెన్నిస్ డెవలప్మెంట్ సెంటర్లో శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ సెమీఫైనల్లో ప్రాం జల- జీల్ దేశాయ్ (భారత్) ద్వయం 6-4, 7-5తో హిండోవా (చెక్ రిపబ్లిక్)- అర్పన (ఫిన్లాండ్) జోడీపై విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్‌లో ప్రాంజల పోరాటం ముగిసింది. క్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రాంజల 5-7, 4-6తో సుహ్యున్ పార్క్ (కొరియా) చేతిలో పరాజయం పాలైంది. -
క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల, సాయి దేదీప్య
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, యెద్దుల సాయి దేదీప్య తమ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రాంజల 6-1, 6-4తో ఆరుషి కక్కర్ (చండీగఢ్)పై గెలుపొందగా... అండర్-18 బాలికల సింగిల్స్ మూడో రౌండ్లో సాయి దేదీప్య 6-3, 6-3తో వాసవి (తమిళనాడు)ను ఓడించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సాయి దేదీప్య 3-6,5-7తో హిమాని మోర్ (హరియాణా) చేతిలో ఓడిపోయింది. హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... సౌజన్య భవిశెట్టి తొలి రౌండ్లో ఓటమి చవిచూసింది. నిధి తొలి రౌండ్లో 6-1, 6-0తో సౌమ్య విజ్ (గుజరాత్)పై, రెండో రౌండ్లో 6-2, 6-2తో హర్ష సాయి చల్లా (హైదరాబాద్)పై గెలిచింది. సౌజన్య 3-6, 6-2, 2-6తో వైదేహి చౌదరీ (గుజరాత్) చేతిలో ఓటమి పాలైంది. అండర్-18 బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి లు షేక్ హుమేరా, లలిత దేవరకొండ, సహజ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... రష్మిక, హర్ష సాయి చల్లా, శ్రావ్య శివాని మూడో రౌండ్లో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో విష్ణువర్ధన్ 4-6, 3-6తో పరమ్‌వీర్ (చండీగఢ్)పై గెలుపొందగా... బెరైడ్డి సారుు శరణ్ రెడ్డి 6-7 (4/7), 6-1, 5-7తో రంజిత్ విరాళీ మురుగేశన్ (తమిళనాడు) చేతిలో పోరాడి ఓడిపోయాడు. -
ప్రాంజల శుభారంభం
న్యూఢిల్లీ: ఫెనెస్టా జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్లో టాప్ సీడ్ ప్రాంజల 6-2, 6-1తో ఆస్థా దర్గూడెపై అలవోకగా గెలిచింది. మరో తెలుగు అమ్మాయి తీర్థ ఇస్కా 4-6, 3-6తో నీరూ రాప్రియా చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో తెలంగాణ ప్లేయర్ బెరైడ్డి సాయి శరణ్ రెడ్డి 6-2, 6-1తో విలాసెర్ ఖాటేను ఓడించాడు. అండర్-18 బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో రిత్విక్ చౌదరీ 6-2, 5-7, 7-6 (9/7)తో సార్థక్ సుదెన్పై, కార్తీక్ రెడ్డి 7-5, 6-2తో దీపక్ సెంథిక్ కుమార్‌పై గెలుపొందగా... కొసరాజు శివదీప్ 3-6, 6-2, 3-6తో రియాన్ పండోలె చేతిలో, నితిన్ గుండుబోయిన 3-6, 3-6తో సీహెచ్ అర్జున్ చేతిలో, రోహిత్ కృష్ణ 2-6, 2-6తో సానిల్ జగ్తియాని చేతిలో, అపురూప్ రెడ్డి 1-6, 3-6తో పరమ్ చేతిలో ఓడిపోయారు. అండర్-18 బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో అంజుమ్ ముబాషిరా 1-6, 0-6తో అద్వైత శరవణ చేతిలో ఓడిపోగా... శ్రేయ తటవర్తి 6-1, 6-1తో వన్షిక చౌదరీపై గెలిచింది.