రన్నరప్‌ ప్రాంజల జోడీ | pranjula pair as runnerup | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ ప్రాంజల జోడీ

Published Sat, Aug 5 2017 10:28 AM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

రన్నరప్‌ ప్రాంజల జోడీ

రన్నరప్‌ ప్రాంజల జోడీ

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఆకట్టుకుంది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ టోర్నీ డబుల్స్‌ విభాగంలో ప్రాంజల జంట రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్‌ ఫైనల్లో ప్రాంజల– మోమ్‌కూంథోడ్‌ (థాయ్‌లాండ్‌) ద్వయం 0–6, 6–7 (5/7)తో గముల్య బియాట్రేస్‌–రోమ్‌పీస్‌ జెస్సీ జంట చేతిలో పరాజయం పాలైంది.

 

మరోవైపు ఈ టోర్నీ సింగిల్స్‌ విభాగంలో ప్రాంజల పోరాటం సెమీస్‌లోనే ముగిసింది. సెమీఫైనల్లో ప్రాంజల 3–6, 3–6తో ఖాజి హరుకా (జపాన్‌) చేతిలో ఓడిపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement