
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల శుభారంభం చేసింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఎనిమిదో సీడ్ సంజన 6–1, 6–0తో సానియా మనోజ్‌పై సులువుగా విజయం సాధించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో సంజన–రియా జోడీ తమ ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చింది. దీంతో టాప్ సీడ్ ప్రియాన్షి భండారి–హృదయ షా జంట నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment