Sanjana Sirimalla
-
టైటిల్ పోరుకు సంజన సిరిమల్ల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సంజన సిరిమల్ల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సంజన బాలికల సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం బాలికల సింగిల్స్ సెమీస్‌లో సంజన 6–1, 3–6, 6–1తో ఐదో సీడ్ సలాక్థిప్ (థాయ్‌లాండ్)పై గెలుపొందింది. మరో సెమీస్‌లో మూడో సీడ్ లాన్లనా (థాయ్‌లాండ్) 6–3, 6–4తో ఆరోసీడ్ మెయ్ హసెగవా (జపాన్)పై గెలుపొంది సంజనతో టైటిల్‌పోరుకు సిద్ధమైంది. -
క్వార్టర్ ఫైనల్లో సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టెన్నిస్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల రాణిస్తోంది. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సంజన క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సంజన 3–6, 7–5, 6–3తో నాలుగోసీడ్ గార్సెవా (రష్యా)పై పోరాడి గెలుపొందింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏడో సీడ్ చావో యి వాంగ్ (చైనీస్ తైపీ)తో సంజన తలపడుతుంది. -
చాంపియన్ సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 టైటిల్ విజేతగా తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల నిలిచింది. గువాహటి వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సంజన 5–7, 6–2, 6–4తో రేష్మా మరూరి (కర్ణాటక)పై విజయం సాధించింది. 3 గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను కోల్పోయిన సంజన... రెండో సెట్ నుంచి విజంభించింది. తర్వాతి సెట్లలో ప్రత్యరి్థకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా రెండు సెట్లను గెలిచి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో సంజన 6–4, 6–4తో మల్లిక మరాటీపై, క్వార్టర్స్‌లో 6–1, 6–0తో కనిక శివరమన్పై, ప్రిక్వార్టర్స్‌లో 6–2, 6–2తో అమీక్ కిరణ్‌పై, తొలి రౌండ్లో 6–2, 6–0తో సుహిత మరూరిపై గెలిచింది. టైటిల్ గెలిచిన సంజనను స్పాన్సర్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఎండీ, చైర్మన్ డాక్టర్ రమేశ్ కంచర్ల అభినందించారు. -
డబ్ల్యూటీఏ ఫ్యూచర్ స్టార్స్ టోర్నీకి సంజన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సంజన సిరిమల్ల అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్ స్టార్స్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. చైనాలోని షెన్జెన్లో ఈనెల 20 నుంచి 28 వరకు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో సంజన అండర్–16 బాలికల సింగిల్స్ విభాగంలో బరిలో దిగనుంది. అండర్–14, అండర్–16 విభాగాల్లో జరిగే ఈ టోర్నీలో ప్రతి దేశం నుంచి ఇద్దరు క్రీడాకారిణులు పాల్గొంటారు. -
సంజనకు టైటిల్
ముంబై: రమేశ్ దేశాయ్ స్మారక అండర్–16 టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్, హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. స్థానిక క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వేదికగా జరిగిన ఈ టోర్నీలో సంజన సింగిల్స్ విభాగంలో టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె ఫైనల్లో 6–3, 6–1తో ఏడో సీడ్ రెనీ సింగ్లా (హరియాణా)పై 90 నిమిషాల్లో గెలుపొంది విజేతగా నిలిచింది. సంజన కెరీర్లో ఇదే తొలి జాతీయ టైటిల్ కావడం విశేషం. గతేడాది ఈ టోర్నీలో క్వార్టర్స్‌లో ఓడిన సంజన ఈసారి చాంపియన్‌గా నిలిచింది. ఆమె ప్రస్తుతం నగరంలోని సంజయ్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. -
టైటిల్ పోరుకు సంజన
ముంబై: రమేశ్ దేశాయ్ స్మారక జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నం.1 ప్లేయర్, హైదరాబాదీ సంజన సిరిమల్ల టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా స్థాయిలో జరుగుతోన్న ఈ టోర్నమెంట్లో సంజన సింగిల్స్ విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సంజన (తెలంగాణ) 6–1, 6–1తో ఎనిమిదో సీడ్ పరీ సింగ్ (హరియాణా)పై గెలుపొందింది. రెండో సెమీస్‌లో ఏడో సీడ్ రెనీ సింగ్లా 6–0, 6–2తో అన్‌సీడెడ్ నైషా శ్రీవాస్తవ్‌ను ఓడించి సంజనతో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. -
సెమీఫైనల్లో సంజన
ముంబై: రమేశ్ దేశాయ్ స్మారక సీసీఐ అండర్–16 జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ నం. 1 క్రీడాకారిణి, హైదరాబాదీ సంజన సిరిమల్ల నిలకడగా రాణిస్తోంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన సంజన బాలికల సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకుంది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సంజన (తెలంగాణ) 6–4, 7–5తో దియా భరద్వాజ్ (గుజరాత్)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ రెనీ సింగ్లా (హరియాణా) 6–0, 6–2తో విధి జైన్ (గుజరాత్)పై, ఎనిమిదో సీడ్ పరీ సింగ్ (హరియాణా) 6–1, 6–2తో రేష్మా (కర్ణాటక)పై, అన్‌సీడెడ్ నైషా శ్రీవాస్తవ్ (కర్ణాటక) 6–3, 6–1తో భూమిక త్రిపాఠిపై విజయం సాధించి ముందంజ వేశారు. -
టాప్ సీడ్‌గా సంజన
ముంబై: మహారాష్ట్ర స్టేట్ లాన్‌టెన్నిస్ అసోసియేషన్ (ఎంఎస్‌ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో జరగనున్న రమేశ్ దేశాయ్ స్మారక సీసీఐ ఆలిండియా అండర్–16 టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి సంజన సిరిమల్ల టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. నేటి నుంచి ఇక్కడ జరుగనున్న ఈ టోర్నీలో మరో తెలంగాణ అమ్మాయి వేదరాజు ప్రపూర్ణకు నాలుగో సీడింగ్ దక్కింది. ఆదివారం ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన సీడెడ్ ప్లేయర్ల జాబితాను విడుదల చేశారు. బాలికల అండర్–16 సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ క్రీడాకారిణి సంజన టాప్ సీడ్‌గా, భారత ఐదో ర్యాంకర్ రెనీ సింగ్ (రాజస్తాన్) రెండో సీడ్‌గా, ఎనిమిదో ర్యాంకర్ రుతుజా చపల్కర్ (మహారాష్ట్ర) మూడో సీడ్‌గా బరిలో దిగనున్నారు. బాలుర విభాగంలో టాప్–10లో తెలంగాణ క్రీడాకారులెవరూ చోటు దక్కించుకోలేకపోయారు. అస్సాం ప్లేయర్ ఉదిత్ గొగోయ్‌కు టాప్ సీడింగ్ దక్కింది. -
భారత బాలికలకు మరో ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసియా ఓసియానియా ఫెడ్‌కప్ టోర్నమెంట్లో భారత బాలికల జట్టుకు మరో పరాజయం ఎదురైంది. 9 నుంచి 16 స్థానాల కోసం జరుగుతున్న వర్గీకరణ మ్యాచ్‌ల్లో భాగంగా మలేసియాతో శుక్రవారం బ్యాంకాక్‌లో జరిగిన పోటీలో భారత్ 1–2తో ఓడిపోయింది. తొలి సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల 6–0, 6–0తో జె జువాన్ లిమ్ (మలేసియా)ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో సంజన ఒక్క గేమ్ కూడా కోల్పోకపోవడం విశేషం. అయితే రెండో సింగిల్స్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన భక్తి షా 2–6, 6–3, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో షరీఫా ఎల్సా (మలేసియా) చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమం అయ్యింది. నిర్ణాయక డబుల్స్ మ్యాచ్‌లో సంజన–సుదీప్త ద్వయం 3–6, 6–3, 6–10తో షరీఫా ఎల్సా–జాన్ నింగ్ లిమ్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖాయమైంది. నేడు జరిగే వర్గీకరణ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడుతుంది. -
భారత బాలికల జట్టుకు తొలి గెలుపు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసియా ఓసియానియా జూనియర్ ఫెడ్ కప్ టోర్నమెంట్లో భారత బాలికల జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భారత్ ప్రస్తుతం 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0తో గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల 6–2, 6–0తో జెస్సికా క్రిస్టా వీరా (ఇండోనేసియా)పై నెగ్గి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో తెలంగాణకే చెందిన మరో అమ్మాయి భక్తి షా 6–1, 6–0తో నికెన్ ఫెరిలియానా (ఇండోనేసియా)ను ఓడించి భారత్‌కు 2–0తో ఆధికాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖాయం చేసింది. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్‌లో సుదీప్త–భక్తి షా ద్వయం 6–2, 6–4తో జెస్సికా–నికెన్ జోడీని ఓడించింది. శుక్రవారం జరిగే మరో వర్గీకరణ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడుతుంది. -
భారత్‌కు ‘హ్యాట్రిక్’ ఓటమి
సాక్షి, హైదరాబాద్: జూనియర్ ఫెడ్ కప్ ఆసియా ఓసియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత అండర్–16 బాలికల జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. బ్యాంకాక్‌లో బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–3తో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. తెలంగాణ క్రీడాకారిణులు సంజన సిరిమల్ల, భక్తి షా ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సింగిల్స్ తొలి మ్యాచ్‌లో సంజన 1–6, 4–6తో అనా తమానిక (న్యూజిలాండ్) చేతిలో ఓటమి చవిచూసింది. సింగిల్స్ రెండో మ్యాచ్‌లో భక్తి షా 3–6, 2–6తో జేడ్ ఓట్వే (న్యూజిలాండ్) చేతిలో పరాజయం పాలైంది. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్‌లో సంజన–సుదీప్త ద్వయం 3–6, 4–6తో అబిగెయిల్ మేసన్–జేడ్ ఓట్వే (న్యూజిలాండ్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. గ్రూప్ ‘ఎ’లో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో ఇక 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడనుంది. -
సంజన డబుల్ ధమాకా
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) అండర్–16, అండర్–18 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. హరియాణాలోని కర్నల్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఆమె పాల్గొన్న రెండు వయో విభాగాల్లోనూ విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్–16 బాలికల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచిన సంజన... అండర్–18 కేటగిరీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ అండర్–18 డబుల్స్ కేటగిరీలో తన భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన అండర్–16 బాలికల టైటిల్‌పోరులో సంజన 6–4, 7–5తో రాధిక రాజేశ్ (మహారాష్ట్ర)పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో సంజన 6–2, 6–1తో నియతి (ఉత్తరాఖండ్)పై, క్వార్టర్స్‌లో 6–2, 6–0తో క్రిస్టీ బోరో (అస్సాం)పై, ప్రిక్వార్టర్స్‌లో 6–0, 6–0తో వన్య అరోరా (మహారాష్ట్ర)పై, తొలి రౌండ్లో 6–1, 6–3తో అనా వర్షిణి (ఉత్తర్‌ప్రదేశ్)పై విజయం సాధించింది. సింగిల్స్ ఓడినా.. డబుల్స్ దక్కింది అండర్–16 విభాగంలో ఆధిపత్యం ప్రదర్శించిన సంజన... అండర్–18 కేటగిరీ సింగిల్స్‌లో చివరి మెట్టుపై తడబడింది. ఫైనల్లో సంజన 4–6, 3–6తో గార్గి (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సంజన 6–4, 1–6, 6–1తో కశిష్ భాటియా (ఢిల్లీ)పై, క్వార్టర్స్‌లో 6–1, 5–7, 6–4తో హర్లీన్ కౌర్ (పంజాబ్)పై, ప్రిక్వార్టర్స్‌లో 6–1, 6–2తో క్రితిక (హరియాణా)పై, తొలి రౌండ్లో 6–1, 6–1తో ఐరా సూద్ (తెలంగాణ)పై గెలుపొంది ంది. మరోవైపు డబుల్స్ విభాగంలో భాగస్వామి ఆర్నిరెడ్డితో కలిసి సంజన టైటిల్‌ను సాధించింది. అండర్–18 బాలికల డబుల్స్ తుదిపోరులో సంజన–ఆర్నిరెడ్డి ద్వయం 7–6, 6–4తో పవిత్రా రెడ్డి జోడీపై విజయం సాధించింది. -
రన్నరప్ సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్లకు నిరాశ ఎదురైంది. ఇండోర్‌లో జరిగిన ఈ టోర్నీలో సంజన ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన బాలికల సింగిల్స్ టైటిల్‌పోరులో ఎనిమిదో సీడ్ సంజన 1–6, 0–6తో శ్రేయ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్‌లో 7–5, 6–0తో అర్చిత మహాల్వాల్ (ఢిల్లీ)పై, క్వార్టర్స్‌లో 6–4, 6–1తో టాప్ సీడ్ ప్రియాన్షి భండారి (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. -
డబుల్స్ క్వార్టర్స్‌లో సంజన జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇండోర్‌లో మంగళవారం జరిగిన డబుల్స్ తొలి రౌండ్లో సంజన–రియా (భారత్) ద్వయం 6–4, 6–2తో అష్‌ప్రీత్ కౌర్ బజ్వా–నైషా శ్రీవాస్తవ్ (భారత్) జోడీపై విజయం సాధించింది. ఇదే టోర్నీ బాలుర డబుల్స్ తొలి రౌండ్లో వడ్డేపల్లి కార్తీక్‌నీల్ (భారత్)–ప్యాట్రిక్ స్పిగెల్ (స్లొవేనియా) జోడీ 2–6, 5–7తో నిశాంత్ దబస్–శక్తివేల్ భూపతి (భారత్) జంట చేతిలో ఓడింది. -
సంజన శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల శుభారంభం చేసింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సంజన 6–1, 6–0తో సానియా మనోజ్‌పై సులువుగా విజయం సాధించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో సంజన–రియా జోడీ తమ ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చింది. దీంతో టాప్ సీడ్ ప్రియాన్షి భండారి–హృదయ షా జంట నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. -
సెమీస్‌లో సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 జూనియర్స్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమళ్ల నిలకడగా రాణిస్తోంది. శ్రీలంకలో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్న సంజన... డబుల్స్ విభాగంలో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో సంజన (భారత్) 6–2, 7–5తో టాప్‌సీడ్ లింగ్ చుయ్ కీ (హాంకాంగ్)కి షాకిచ్చింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 6–4, 6–4తో మ యుజా (చైనా)పై, తొలిరౌండ్లో 6–4, 5–7, 6–4తో సెనివిరత్నే (శ్రీలంక)పై గెలుపొందింది. మరోవైపు బాలికల డబుల్స్ తొలిరౌండ్లో బిపాషా– సంజన (భారత్) ద్వయం 6–4, 7–5తో లిన్ జిన్ టాన్– హనా సీన్ ఇయాన్ యిప్ (మలేసియా) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది. -
సంజనకు హ్యాట్రిక్ టైటిల్
హైదరాబాద్: ‘ఐటా’ టెన్నిస్ టోర్నమెంట్లలో హైదరాబాద్ క్రీడాకారిణి సంజన సిరిమల్ల నిలకడ విజయాలతో సత్తా చాటుతోంది. కొంపల్లిలోని సురేశ్ కృష్ణ టెన్నిస్ అకాడమీలో జరిగిన అండర్–16 టోర్నీలో సంజన విజేతగా నిలిచింది. ఈనెలలో ఆమెకు ఇది మూడో సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. జూన్ 11 నుంచి 16 వరకు జరిగిన అండర్–18 చాంపియన్‌షిప్ సిరీస్, జూన్ 18 నుంచి 23 వరకు జరిగిన అండర్–16 సూపర్‌సిరీస్ టోర్నీల్లోనూ సంజన విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఈ టోర్నీ అండర్–16 బాలికల సింగిల్స్ ఫైనల్లో సంజన 6–2, 6–4తో రితి అగర్వాల్ (కర్ణాటక)పై గెలుపొందింది. బాలుర విభాగంలో మహారాష్ట్రకు చెందిన ఆర్యన్ భటి చాంపియన్‌గా నిలిచాడు. మరోవైపు ఇదే టోర్నీ అండర్–16 బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి అదితి ఆరే టైటిల్‌ను గెలుచుకుంది. టైటిల్‌పోరులో అదితి 6–0, 6–2తో త్రిష్యా ఖండేవాల్ (కర్ణాటక)ను ఓడించింది.