
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్లకు నిరాశ ఎదురైంది. ఇండోర్‌లో జరిగిన ఈ టోర్నీలో సంజన ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన బాలికల సింగిల్స్ టైటిల్‌పోరులో ఎనిమిదో సీడ్ సంజన 1–6, 0–6తో శ్రేయ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్‌లో 7–5, 6–0తో అర్చిత మహాల్వాల్ (ఢిల్లీ)పై, క్వార్టర్స్‌లో 6–4, 6–1తో టాప్ సీడ్ ప్రియాన్షి భండారి (మహారాష్ట్ర)పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment