
ముంబై: రమేశ్ దేశాయ్ స్మారక అండర్–16 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్ల సత్తా చాటింది. స్థానిక క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) వేదికగా జరిగిన ఈ టోర్నీలో సంజన సింగిల్స్ విభాగంలో టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె ఫైనల్లో 6–3, 6–1తో ఏడో సీడ్ రెనీ సింగ్లా (హరియాణా)పై 90 నిమిషాల్లో గెలుపొంది విజేతగా నిలిచింది.
సంజన కెరీర్‌లో ఇదే తొలి జాతీయ టైటిల్ కావడం విశేషం. గతేడాది ఈ టోర్నీలో క్వార్టర్స్‌లో ఓడిన సంజన ఈసారి చాంపియన్‌గా నిలిచింది. ఆమె ప్రస్తుతం నగరంలోని సంజయ్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment