
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సంజన సిరిమల్ల అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రతిష్టాత్మక మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ఫ్యూచర్ స్టార్స్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆమె భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. చైనాలోని షెన్‌జెన్‌లో ఈనెల 20 నుంచి 28 వరకు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో సంజన అండర్–16 బాలికల సింగిల్స్ విభాగంలో బరిలో దిగనుంది. అండర్–14, అండర్–16 విభాగాల్లో జరిగే ఈ టోర్నీలో ప్రతి దేశం నుంచి ఇద్దరు క్రీడాకారిణులు పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment