
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టెన్నిస్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల రాణిస్తోంది. న్యూఢిల్లీలో జరుగుతోన్న ఈ టోర్నీలో సంజన క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సంజన 3–6, 7–5, 6–3తో నాలుగోసీడ్ గార్సెవా (రష్యా)పై పోరాడి గెలుపొందింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఏడో సీడ్ చావో యి వాంగ్ (చైనీస్ తైపీ)తో సంజన తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment