Hyderabad Strikers wins Tennis Premier League Season 4 Champions - Sakshi
Sakshi News home page

Hyderabad Strikers: అదరగొట్టిన హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌.. వరుసగా రెండో టైటిల్‌

Published Mon, Dec 12 2022 3:33 PM | Last Updated on Mon, Dec 12 2022 4:09 PM

Tennis Premier League Season 4 Champion Hyderabad Strikers Details - Sakshi

విజేత ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌

Tennis Premier League Season 4- పుణె: టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌(టీపీఎల్‌) సీజన్‌ 4 చాంఫియన్స్‌గా హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ అవతరించింది. తద్వారా వరుసగా రెండో సారి చాంఫియన్‌షిప్‌ గెలుచుకుంది. లీగ్‌ చివరి రోజులో భాగంగా మ్యాచ్‌లు రసవత్తరంగా సాగాయి. తొలి సెమీ ఫైనల్లో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌, చెన్నై స్టాలియన్స్‌ తలపడ్డాయి. ఈ క్రమంలో.. హైదరాబాద్‌ స్ట్రై‍కర్స్‌కు చెందిన కొన్నీ పెర్రిన్‌, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన ఎకటెరీనా కజియోనోవాతో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు.

ఈ మ్యాచ్‌ 10–10తో డ్రాగా ముగియగా... ఆ తరువాత మెన్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ పోటీలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌కు చెందిన నిక్కీ పూనాచా, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన మథియాస్‌ బౌర్గీపై 13–7తో విజయం సాధించారు.

ఈ మ్యాచ్‌ అనంతరం మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలు జరిగగాయి. ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌కు చెందిన శ్రీరామ్‌ బాలాజీ , కొన్నీ పెర్రిన్‌లు, చెన్నై స్టాలియన్స్‌కు చెందిన ఎకటెరినా కజియోనోవా, అనిరుద్‌ చంద్రశేఖర్‌ల మధ్య జరిగాయి. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ 13–7తో విజయం సాధించింది.

ఇదే జోరును కొనసాగిస్తూ మెన్స్‌ డబుల్స్‌లో శ్రీరామ్‌ బాలాజీ, నిక్కీ పూనాచాలు.. చెన్నై స్టాలియన్స్‌కు చెందిన మథయాస్‌ బౌర్గీ మరియు అనిరుధ్‌ చంద్రశేఖర్‌పై 12–8తో విజయం సాధించారు. ఈ క్రమంలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ 48–32 పాయింట్లతో చెన్నై స్టాలియన్స్‌పై పూర్తి ఆధిపత్యం చాటుకుని ఫైనల్స్‌లో అడుగుపెట్టింది.

రెండో సెమీ ఫైనల్‌ ఇలా
ఇక రెండో సెమీ ఫైనల్స్‌ పోటీలలో ముంబై లియాన్‌ ఆర్మీ, బెంగళూరు స్పార్టన్స్‌తో పోటీపడింది. బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన కర్మాన్‌ కౌర్‌ థండి, ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన ఆకాంక్ష నిట్టర్‌పై 13– 7స్కోర్‌తో మహిళల సింగిల్స్‌లో విజయం సాధించింది. మెన్స్‌ సింగిల్‌ విభాగంలో ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌, బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన సిద్ధార్ధ్‌ రావత్‌పై 11–9 స్కోర్‌తో విజయం సాధించాడు.

అదే విధంగా... మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలలో ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన జీవన్‌ నెడుంచెంజియాన్‌ మరియు ఆకాంక్ష నెట్టూరిలు బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన విష్ణు వర్ధన్‌, కర్మాన్‌కౌర్‌లతో పోటీపడ్డారు. ఈ పోటీలో 12–8 స్కోర్‌తో బెంగళూరుపై ముంబై విజయం సాధించింది. ఇక మెన్స్‌ డబుల్స్‌ పోటీలలో ముంబై లియాన్‌ ఆర్మీకి చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌ మరియు జీవన్‌ నెడుంచెంజియాన్‌లు బెంగళూరు స్పార్టన్స్‌కు చెందిన సిద్ధార్ధ్‌ రావత్‌, విష్ణు వర్ధన్‌ పై 11–9 స్కోర్‌తో విజయం సాధించారు.

ఫైనల్లో మరోసారి
ఈ క్రమంలో ముంబై లియాన్‌ ఆర్మీ 41–39 స్కోర్‌తో ఫైనల్స్‌లో ప్రవేశించారు. దీంతో గత సీజన్‌ మాదిరే ముంబై లియాన్‌ ఆర్మీ, ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ మధ్య టైటిల్‌ కోసం పోరు జరిగింది. ఇందులో భాగంగా.. మహిళల సింగిల్స్‌ విభాగంలో మ్యాచ్‌ తొలుత జరిగింది. ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌కు చెందిన కొన్నీ పెరిన్‌, ముంబై లియాన్‌ ఆర్మీ కి చెందిన ఆకాంక్ష నిట్టర్‌తో తలపడ్డారు.

ఈ మ్యాచ్‌లో 13–7తో కొన్నీ పెర్రిన్‌ విజయం సాధించారు. ఈ మ్యాచ్‌ అనంతరం మెన్స్‌ సింగిల్‌ విభాగపు పోటీలు జరిగాయి. దీనిలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌కు చెందిన నిక్కీ పూనాచా, ముంబై లియాన్‌ ఆర్మీ కు చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌తో పోటీపడ్డారు. ఈ పోటీలో నిక్కీ పూనాచా 12–8 తో విజయం సాధించారు. ఆ తరువాత మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలు జరిగాయి.

ఈ పోటీలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ తరపున శ్రీరామ్‌ బాలాజీ మరియు కొన్నీ పెర్రిన్‌ పోటీపడగా, ముంబై లియాన్‌ ఆర్మీ తరపున జీవన్‌ నెడుంచెంజియాన్‌, ఆకాంక్ష నెట్టూరి పోటీపడ్డారు. ఈ మ్యాచ్‌ 13–7 స్కోర్‌తో ముంబై లియాన్‌ ఆర్మీ గెలిచింది.

ఆ తరువాత విభాగపు పోటీలుగా మెన్స్‌ డబుల్స్‌ జరిగాయి. నిక్కీ పూనాచా మరియు శ్రీరామ్‌ బాలాజీలు ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ సై్ట్రకర్స్‌ తరపున పోటీపడగా, రామ్‌కుమార్‌ రామనాథన్‌ మరియు జీవన్‌ నెండుంచెంజియాన్‌ ముంబై లియాన్‌ ఆర్మీ తరపున పోటీపడ్డారు. ఈ పోటీలో ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ సై్ట్రకర్స్‌ 14–6 తో విజయం సాధించింది.

ఈ క్రమంలో ఫైనల్‌ స్కోర్‌ 41–32 కాగా ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ విజేతగా నిలిచింది. తద్వారా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఫైన్‌క్యాబ్‌ హైదరాబాద్‌ స్ట్రైకర్స్‌ తమ చాంఫియన్‌షిప్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది. కాగా టెన్నిస్‌ ప్రీమియర్‌ లీగ్‌ గ్రాస్‌రూట్‌ లీగ్‌గా టీపీఎల్‌ ప్లస్‌ జరిగింది. దీనిద్వారా యువ టెన్నిస్‌ అథ్లెట్లు అంతర్జాతీయ, భారతీయ స్టార్ల నుంచి నేర్చుకునే అవకాశం కలుగుతుంది. ఈ అవార్డును ముంబై లియాన్‌ ఆర్మీ విజయం గెలుచుకుంది.

చదవండి: FIFA WC 2022: సెమీస్‌ వరకు ప్రయాణం ఇలా! 32 జట్లకు ప్రైజ్‌మనీ ఎంతంటే!
Cristiano Ronaldo: కోచ్‌ కాదు.. నోటి ‍మాటలే శాపంగా మారాయా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement