’ హోమ్‌లెస్
‘ఎవరితోనూ కలవలేను, ఎవరికీ చెందిన దానిని కాను అనే భావనతో జీవితమంతా గడి΄ాను’ అంటోంది ‘హోమ్‌లెస్’ రచయిత్రి కె. వైశాలి. అస్తవ్యస్తంగా పలకడం, రాయడం అనే డిస్‌లెక్సియా, డిస్‌గ్రాఫియా సమస్యలను అధిగమించి తన అనుభవాలను అక్షర రూపంగా మార్చి పుస్తకంగా తీసుకొచ్చింది.
ఈ ఏడాది సాహిత్య అకాడమీ యువ పురస్కార్ (ఇంగ్లిష్) అవార్డును గెలుచుకున్న వైశాలి 22 ఏళ్ల వయసులో ముంబైలోని తన ఇంటి నుంచి బయటకు వచ్చి, హైదరాబాద్‌లో ఎలాంటి వసతులూ లేని హాస్టల్ రూమ్‌లో ఉంటూ తనలో చెలరేగే సంఘర్షణలకు సమాధానాలు వెతుక్కుంది. దేశంలో పెరుగుతున్న డిస్‌లెక్సియా బాధితులకు ఈ పుస్తకం ఒక జ్ఞాపిక అని చెబుతుంది. తనలాంటి సమస్యలతో బాధపడుతున్నవారిని కలుసుకుని, వారి అభివృద్ధికి కృషి చేస్తోంది.
‘సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకోవడం అంటే నేను ప్రతి ఒక్కరికీ సమర్థురాలిగానే కనిపిస్తాను’ అంటూ ‘హోమ్‌లెస్’ పుస్తకం గురించి వైశాలి రాసిన వాక్యాలు మనల్ని ఆలోచింప చేస్తాయి. బయటకు చెప్పుకోవడం చిన్నతనంగా భావించే వ్యక్తిగత సమస్యలపై వైశాలి ఒక పుస్తకం ద్వారా తనను తాను పరిచయం చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితం, సమాజం పట్టించుకోని మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలకు వసతి కల్పించడంలో విఫలమయ్యే విద్యావ్యవస్థలోని లో΄ాలు, నిబంధనలను ధిక్కరించే వారి పట్ల సమాజం చూపే అసహన ం వంటి అంశాలెన్నింటినో వైశాలి కథనం మనకు పరిచయం చేస్తుంది.
‘‘నా బాల్యంలో డిస్‌లెక్సియా, డిస్‌గ్రాఫియాల (అస్తవ్యస్తంగా పలకడం, రాయడం) ప్రభావాన్ని అధిగమించడానికే ఎన్నో ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. ఈ కథను చెప్పడానికి నా బాల్యంలోని అన్ని అంశాలనూ అనేకసార్లు గుర్తుచేసుకున్నాను. పదే పదే పునశ్చరణ చేసుకున్నాను.
బాధపెట్టిన బాల్యం
నాలో ఉన్న న్యూరో డైవర్షన్స్ నన్ను నిరాశపరచేవి. వాటి వల్ల ఎవరితోనూ కలిసేదాన్ని కాదు. ఎప్పుడూ ఒంటరిగానే ఉండేదానిని. నాలోని రుగ్మతలను ఇంట్లో రహస్యంగా ఉంచేవాళ్లు. నిర్ధారించని రుగ్మతల కారణంగా భయంతో నా రాతలు ఎవరికీ తెలియకుండా దాచేదాన్ని. నాలోని ఆందోళనలను, రుగ్మతలను నేనే పెంచి ఉంటానా? నేను ఇం΄ోస్టర్ సిండ్రోమ్ (తమ ప్రవర్తన, తెలివి తేటలపై తమకే అనుమానాలు ఉండటం)తో బాధపడుతున్నానా?.. ఇలా ఎన్నో సందేహాలు ఉండేవి.
అద్దెలేని హాస్టల్ గదిలో..
ఇరవై ఏళ్ల వయస్సులో చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం ్ర΄ారంభించాను. నాదైన మార్గం అన్వేషించడానికి మా ఇంటిని వదిలేశాను. అటూ ఇటూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నా. నా దగ్గర డబ్బుల్లేవు. మొత్తానికి మురికిగా, ఈగలు దోమలు ఉండే ఓ హాస్టల్‌లో గది ఇవ్వడానికి ఒప్పుకున్నారు అక్కడి యజమాని. ఆ హాస్టల్ గదికి తలుపులు కూడా సరిగ్గా లేవు. అలాంటి చోట నా అనుభవాల నుంచి ఒక పుస్తకం రాస్తూ, నా పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నించాల్సి వచ్చింది. డిస్‌లెక్సియా బాధితురాలిని, స్వలింగ సంపర్కం, ప్రేమలో పడటం, బాధాకరంగా విడి΄ోవడం, చదువులో ఫెయిల్, అనారోగ్యం, నిరాశ, జీవించడం అంటే ఏంటో అర్థం కాని ఆందోళనల నుంచి నన్ను నేను తెలుసుకుంటూ చేసిన ప్రయాణమే హోమ్‌లెస్ పుస్తకం.
కోపగించుకున్నా.. కుటుంబ మద్దతు
ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణకు మా అమ్మ హాజరైంది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా సామాన్య మైనది కాదు. అయితే, మొదట నా పుస్తకంలోని రాతల వల్ల అమ్మ మనస్తాపం చెందింది. కానీ, నేనెందుకు అలా నా గురించి బయటకు చె΄్పాల్సి వచ్చిందో ఓపికగా వివరించాను. అవార్డు రావడంతో నాపై ఉన్న కోపం ΄ోయింది’’ అని ఆనందంగా వివరిస్తుంది వైశాలి.
సమాజంలో మార్పుకు
అనిశ్చితి, దుఃఖం, గజిబిజిగా అనిపించే వైశాలి మనస్తత్వం నుంచి పుట్టుకు వచ్చిన ఈ పుస్తక ప్రయాణం ఒక వింతగా అనిపిస్తుంది. సైమన్, ఘుస్టర్, యోడా ప్రెస్ సంయుక్తంగా వైశాలి పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్రటరీ ్ర΄÷ఫెసర్ మనీష్ ఆర్ జోషీ రాసిన అభినందన లేఖ వైశాలికి ఎంతో ఓదార్పునిచ్చింది. ‘డిస్‌లెక్సిక్ వ్యక్తుల గురించిన విధానాలు, చట్టం, మార్గదర్శకాలపై నా పుస్తకం ప్రభావం చూపగలదని ఆశాజనకంగా ఉంది. గదిలో ఒంటరిగా కూర్చుని రాసుకున్న పుస్తకం సమాజంలో మార్పుకు దారితీస్తుందని తెలిసి ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది’ అని చెబుతుంది వైశాలి. తన పుస్తకం తనలాంటి సమస్యలు ఉన్న వారితో ఓ ‘గూడు’ను కనుగొన్నట్టు చెబుతుంది వైశాలి.
Comments
Please login to add a commentAdd a comment